MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • Miss World 2025: రంగు ఆధారంగా మిస్ వరల్డ్ విజేత ఎంపిక జరుగుతుందా, నిబంధనలు ఎలా ఉన్నాయి ?

Miss World 2025: రంగు ఆధారంగా మిస్ వరల్డ్ విజేత ఎంపిక జరుగుతుందా, నిబంధనలు ఎలా ఉన్నాయి ?

ప్రస్తుతం మిస్ వరల్డ్ పోటీలు కీలక దశలో ఉన్నాయి. అయితే మిస్ వరల్డ్ పోటీలపై చాలామందికి కొన్ని అపోహలు ఉంటాయి. ముఖ్యంగా ఏ ప్రాతిపదికన విజేతని ప్రకటిస్తారు అనే అంశంలో చాలామందికి సందేహాలు ఉంటాయి.

2 Min read
Author : Tirumala Dornala
Published : May 24 2025, 08:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ 2025
Image Credit : Asianet News

హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ 2025

హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ 2025 పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లతో మిస్ వరల్డ్ పోటీలు చాలా గ్రాండ్ గా, ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతున్నాయి. ప్రస్తుతం మిస్ వరల్డ్ పోటీలు కీలక దశలో ఉన్నాయి. అయితే మిస్ వరల్డ్ పోటీలపై చాలామందికి కొన్ని అపోహలు ఉంటాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఏ ప్రాతిపదికన విజేతని ప్రకటిస్తారు ?
Image Credit : google

ఏ ప్రాతిపదికన విజేతని ప్రకటిస్తారు ?

ముఖ్యంగా ఏ ప్రాతిపదికన విజేతని ప్రకటిస్తారు అనే అంశంలో చాలామందికి సందేహాలు ఉంటాయి. హైదరాబాద్ లో జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ పోటీల్లో 108 దేశాలకు చెందిన సుందరీమణులు టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. కంటెస్టెంట్ లను వారి ఖండాల ఆధారంగా ఆసియా- ఓసియానా, ఆఫ్రికా, యూరప్, అమెరికా- కరేబియన్ గ్రూపులుగా విభజిస్తారు. వీరిలో ఒక్కో ఖండం నుంచి పది దేశాలకు చెందిన అందాల భామలు క్వార్టర్ ఫైనల్లో పాల్గొంటారు. వీరిలో టాప్ 5 ని ఎంపిక చేస్తారు. ఆ తర్వాత టాప్ 2 ని ఎంపిక చేస్తారు. చివరికి ప్రతి ఖండం నుంచి ఒకరిని విజేతగా, ఒకరిని రన్నర్ గా ప్రకటిస్తారు.

35
రంగుని కూడా ప్రామాణికంగా తీసుకుంటారా?
Image Credit : google

రంగుని కూడా ప్రామాణికంగా తీసుకుంటారా?

ఈ విధంగా ప్రతి ఖండంలో విజేతగా నిలిచిన నలుగురు సుందరీమణులు తుది దశ టైటిల్ రేసులో పోటీకి ఎంపిక అవుతారు. వీరిలో ఒక్కరు మాత్రమే విజేతగా నిలిచి మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంటారు. మిగిలిన ముగ్గురిని ఒకటి, రెండు , మూడు రన్నర్ లుగా ప్రకటిస్తారు.

అయితే అసలు విజేతను ఎలా ప్రకటిస్తారు? వారి రంగుని కూడా ప్రామాణికంగా తీసుకుంటారా? తెల్లగా ఉన్న వారికి మాత్రమే విజేతగా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయా? ఇలాంటి అనుమానాలు చాలామందిలో ఉంటాయి. కానీ మిస్ వరల్డ్ పోటీల్లో రంగుని ఏమాత్రం ప్రామాణికంగా తీసుకోరు.

45
మిస్ వరల్డ్ పోటీదారులు ఉండాల్సిన అర్హతలు
Image Credit : instagram

మిస్ వరల్డ్ పోటీదారులు ఉండాల్సిన అర్హతలు

అయితే మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనాలంటే కొన్ని నియమాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనది పెళ్లి అయి ఉండకూడదు, అదేవిధంగా పిల్లలున్న మహిళలు కూడా ఈ పోటీల్లో పాల్గొనడానికి అనర్హులు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే కంటెస్టెంట్ల వయస్సు 17 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అదేవిధంగా వారిపై ఎలాంటి కేసులు ఉండకూడదు.

55
నల్లజాతి మహిళలు కూడా..
Image Credit : Social Media

నల్లజాతి మహిళలు కూడా..

మిస్ వరల్డ్ పోటీల్లో తెల్లగా ఉంటే మాత్రమే విజేతలుగా నిలుస్తారు అనేది అపోహ మాత్రమే.ఈ పోటీల్లో పాల్గొనేవారి ఎంపిక వ్యక్తిత్వం, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, ప్రతిభ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. మిస్ వరల్డ్ పోటీల్లో నల్లజాతి మహిళలు కూడా విజేతగా నిలిచిన చరిత్ర ఉంది. జెనిఫర్ హోస్టన్ మిస్ వరల్డ్ పోటీల్లో విజేతగా నిలిచిన తొలి నల్లజాతి మహిళ. 1970లో ఆమె మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకుంది. ఇండియా తరపున ఇప్పటివరకు రీటా ఫరియా , ఐశ్వర్యరాయ్, డయానా హెడెన్, యుక్త ముఖి, ప్రియాంక చోప్రా లాంటివారు మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకున్నారు. చివరగా ఇండియా తరపున 2017లో మానుషి చిల్లర్ మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకుంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Temper Vamsi: టెంపర్ వంశీకి టెంపర్ లేచింది, రోహిత్ తో తీవ్ర స్థాయికి చేరిన గొడవ.. చుక్కలు చూపించిన దేబ్జానీ
Recommended image2
Ranveer Singh: బాక్సాఫీస్ వద్ద అసలైన 'ధురంధర్' రణ్‌వీర్ సింగ్.. ఈ 5 కారణాలే ప్రూఫ్!
Recommended image3
Jason Sanjay: నాన్న సీఎంగా బిజీ, అందుకే ఇన్వాల్వ్ కాలేదు.. కానీ సిగ్మా కోసం ఎదురుచూస్తున్నారు
Related Stories
Recommended image1
అఫీషియల్: సెన్సేషనల్ బ్యూటీని 'స్పిరిట్' హీరోయిన్ గా ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా
Recommended image2
హరిహర వీరమల్లు టార్గెట్ గా థియేటర్ల బంద్ ? తెలుగు ఫిలిం ఛాంబర్ రియాక్షన్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved