ముస్లిమ్ యువతిగా మారిన అనుపమ... లుక్ చూసి షాకవుతున్న ఫ్యాన్స్!

First Published May 14, 2021, 12:12 PM IST

రెడ్ బుర్కా ధరించి ముస్లిం యువతిగా దర్శనం ఇచ్చింది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. మలయాళీ బ్యూటీ ముస్లిం గెటప్ వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కాక ఆమె ఫ్యాన్స్ షాక్ తిన్నారు. 
 

ప్రేమమ్ బ్యూటీ అనుపమకు టాలీవుడ్ యూత్ లో మంచి క్రేజ్ ఉంది. అనుపమ అనేక హిట్ చిత్రాలలో నటించగా ఆమెకు ఫ్యాన్ బేస్ ఏర్పడింది. కర్లీ హెయిర్, గుండ్రని ముఖంతో హోమ్లి బ్యూటీతో ఆకట్టుకుంటుంది అనుపమ.
undefined
ఆమె క్యూట్ నెస్ కి యూత్ పడిపోయారు. అయితే ఈ మధ్య ఆమె జోరు తగ్గింది. ముఖ్యంగా టాలీవుడ్ లో అనుపమకు అవకాశాలు తగ్గాయి. 2019లో విడుదలైన రాక్షసుడు మూవీ హిట్ టాక్ తెచ్చుకున్నా, అనుపమ కెరీర్ కి ప్లస్ కాలేదు.
undefined
ప్రస్తుతం ఒకటీ అరా సినిమాలు మినహా చెప్పకోదగ్గ బడా ఆఫర్స్ అనుపమ చేతిలో లేవు.అవకాశాల కోసం ఈ మధ్య అనుపమ తన పంథా కూడా మార్చింది. స్కిన్ షోకి దూరంగా ఉండే ఈ హీరోయిన్, సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది.
undefined
పొట్టిబట్టలలో నాటీ ఫోజులు ఇవ్వడంతో పాటు, చీరలో కూడా నడుము అందాలు చూపిస్తూ కవ్విస్తోంది. అలాంటి హాట్ పాత్రకైనా నేను సిద్దమే అని పరోక్షంగా దర్శక నిర్మాతలకు అనుపమ ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా తెలియజేస్తుంది.
undefined
ఏమి చేసిన ఫార్మ్ లో ఉన్నప్పుడు చేస్తేనే ఫలితం ఉంటుంది. ఫేడవుట్ అయ్యాక ఎంత స్కిన్ షోకి సిద్ధమైనా దర్శకులు పట్టించుకోరు. అనుపమ పరిస్థితి కూడా అలానే మారింది.
undefined
ఇక అనుపమ ముస్లిమ్ గెటప్ విషయానికి వస్తే... నేడు పవిత్ర రంజాన్ నేపథ్యంలో తనదైన శైలిలో విషెస్ తెలియజేసింది. ఏకంగా ముస్లిం యువతిగా గెటప్ వేసుకొని తన అభిమానులకు విషెస్ తెలియజేశారు. ముస్లిమ్ యువతిగా అనుపమ షాకింగ్ లుక్ వైరల్ గా మారింది.
undefined
click me!