శ్రీకారం యూఎస్ ప్రీమియర్ షో రివ్యూ

First Published Mar 11, 2021, 9:19 AM IST


శర్వానంద్ హీరోగా దర్శకుడు కిషోర్ బి తెరకెక్కించిన చిత్రం శ్రీకారం. వ్యవసాయం అనే సామజిక అంశం ప్రధానంగా తెరకెక్కిన శ్రీకారం మూవీ నేడు విడుదలైంది. ఇప్పటికే శ్రీకారం ప్రీమియర్ షోస్ ప్రదర్శన జరుగగా.. మూవీ గురించిన టాక్ ఈ విధంగా ఉంది. 

అనంతరాజపురానికి చెందిన రైతు కేశవులు(రావు రమేష్) కొడుకు కార్తీక్ (శర్వానంద్), మంచి జీతానికి సిటీలో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ ఉంటాడు. కార్తీక్ ఊరిలో ఉన్న వడ్డీ వ్యాపారి అయిన ఏకాంబరం(సాయి కుమార్) రైతులకు అప్పులు ఇస్తూ అధిక వడ్డీలు వసూలు చేస్తూ ఉంటాడు. అప్పు తీర్చలేని వారి భూములను లాక్కుంటూ ఉంటాడు. లాభసాటిగా లేని వ్యవసాయం కారణంగా ఆ ఊరి రైతులు అప్పులతో అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ పరిస్థితి తెలుసుకున్న కార్తీక్ వ్యవసాయం చేయడానికి సొంత ఊరు చేరుకుంటాడు. రైతుగా మారిన యువ సాఫ్ట్ వేర్ తన ఊరి రైతులకు చేసిన మేలు ఏమిటీ? వడ్డీ వ్యాపారి ఏకాంబరానికి ఎలా బుద్ది చెప్పాడనేది మిగతా కథ .
undefined
వ్యవసాయం అంటేనే ఇష్టపడని ఈ జెనరేషన్ లో వ్యవసాయం, రైతు గొప్పతనం శ్రీకారం మూవీలో చక్కగా చూపించారు. పంటలు సరిగా పండక, పండిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఏవిధంగా అప్పులపాలు అవుతున్నారు. వడ్డీ వ్యాపారులు వారిని ఏ విధంగా పీక్కుతింటున్నారనేది వాస్తవానికి దగ్గరగా చూపించారు.
undefined
చదువుకున్న వారు కూడా వ్యవసాయాన్ని వృత్తిగా తీసుకోవాలని శర్వానంద్ పాత్ర ద్వారా చెప్పిన తీరు బాగుంది. సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా, రైతుగా రెండు భిన్న షేడ్స్ లో శర్వానంద్ నటన బాగుంది. ఎప్పటిలాగే రావు రమేష్ పాత్రలో ఒదిగిపోయి.. తన మార్కు నటనతో ఆకట్టుకున్నారు. వడ్డీ వ్యాపారిగా సాయి కుమార్ మెప్పించారు.
undefined
మంచి సందేశంతో కూడుకున్న కథ అయినప్పటికీ... ఇది అందరికీ పరిచయం ఉన్న కథే. ఏళ్లుగా ఇలాంటి సబ్జెక్ట్ తో సినిమాలు వస్తున్నాయి. దానికి తోడు దర్శకుడు నెరేషన్ చాలా స్లో గా సాగింది.  మ్యూజిక్ కూడా అంతగా ఆకట్టుకోదు. పెంచల్ దాస్ పాడిన 'వస్తానంటివో' పాట మాత్రం బాగుంది. ఫస్ట్ హాఫ్ ప్రేక్షకుడు సహనానికి పరీక్ష పెడుతుంది.
undefined
సాలిడ్ హిట్ కొట్టి ఫార్మ్ లోకి వద్దామన్న శర్వానంద్ కోరిక మాత్రం తీరే సూచనలు శ్రీకారం మూవీలో కనిపించడం లేదు. మరీ బోరింగ్ మూవీ అని చెప్పలేం కానీ... పర్వాలేదు అన్నట్లుగా సాగుతుంది. మరి ఫైనల్ రిజల్ట్ ఏమవుతుందో చూడాలి.
undefined
click me!