Brahmamudi: భార్యని అందరి ముందు ఇరికించిన రాహుల్.. ఆ పని చేసి చిట్టితో తిట్లు తింటున్న స్వప్న?

First Published | Jul 18, 2023, 9:02 AM IST

Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి రేటింగ్ ని సంపాదించుకుంటూ టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది. తన భార్య టాలెంట్ ని గుర్తించలేకపోతున్న ఒక భర్త కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూలై 18 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
 

 ఎపిసోడ్ ప్రారంభంలో గ్రౌండ్ కి వచ్చిన కళ్యాణ్ నేను గ్రౌండ్ కి వచ్చేసాను అని అప్పుకి ఫోన్ చేస్తాడు. నాకు పని ఉంది రావడం కుదరదు అని కళ్యాణ్ చెప్పేది వినకుండా ఫోన్ పెట్టేస్తుంది అప్పు. అప్పు ఏదో టెన్షన్ లో ఉన్నట్టుంది అనుకుంటాడు కళ్యాణ్ అంతలోనే ఎవరు బండిమీద వెళ్తున్నా అప్పుడు చూసి పిలుస్తాడు కానీ తను వినిపించుకోదు. తనని ఫాలో అవుతాడు కళ్యాణ్. మరోవైపు శృతి పంపించే అమౌంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కావ్య.
 

 ఇంతలోనే శృతి ఫోన్ చేసి  అకౌంటెంట్ లీవ్ లో ఉన్నాడు అమౌంట్ ఎల్లుండి పే చేస్తాను అని చెప్పిన శృతి  మళ్లీ ఎలాంటి డిజైన్స్ కావాలో  మీకు సెండ్ చేశాను అవి గీసి పంపించండి అని చెప్తుంది. అలాగే అని చెప్పిన కావ్య డబ్బు రాలేనందుకు బాధపడుతుంది. మరోవైపు అప్పు తను పనిచేస్తున్న షాప్ దగ్గరికి వెళ్లి 10,000 అప్పుడు అవుతుంది అతను ఇవ్వడం కుదరదు అంటాడు. ఇదంతా బయట నుంచి ఉంటున్న కళ్యాణ్ తనకి ఇప్పుడు ఎందుకు అంత డబ్బు అవసరం అనుకుంటాడు.
 


షాప్ నుంచి బయటకు వస్తారు అప్పు, తన ఫ్రెండ్. అప్పు ఫ్రెండ్ కి కళ్యాణ్ కనిపిస్తాడు. అతనిని అప్పడగొచ్చు కదా అని అప్పు కి చెప్పి కళ్యాణ్ ని పిలుస్తాడు ఆ ఫ్రెండ్. అప్పు దగ్గరికి వచ్చిన కళ్యాణ్ నువ్వు ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నావు నీకు ఎలాంటి సాయం కావాలన్నా నేను చేస్తాను అంటాడు కళ్యాణ్. అలాంటిదేమీ వద్దు అని పొగరుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పు. తనకి తెలియకుండా ఎలాగైనా తన కష్టం తీర్చాలి అనుకుంటాడు కళ్యాణ్. మరోవైపు దగ్గుతూ బాధపడుతూ ఉంటుంది అన్నపూర్ణ.
 

అది చూసిన కనకం తోటి కోడలికి మంచినీళ్లు ఇచ్చి ఆమె కాస్త కుదుటపడిన తర్వాత భర్త దగ్గరికి వెళ్లి తనను చూస్తే నాకు బాధగా ఉంది ఎలాగైనా ట్రీట్మెంట్ చేయించాలి అంటుంది. ఇదిగో బొమ్మలు రెడీ చేస్తున్నాను తీసుకొని టైం కి వస్తాడు అప్పుడు డబ్బులు ఇస్తాడు. అప్పుడు ట్రీట్మెంట్ చేయిద్దాము అంటాడు కృష్ణమూర్తి. ఇంతలో బొమ్మలు కొన్న అతను మీ బొమ్మలు అమ్ముడుపోవడం లేదు, కాబోయేసినట్లుగా జీవం ఉండటం లేదు అంటూ పాత బొమ్మలు కూడా తీసుకొని వచ్చి ఇచ్చేస్తాడు.
 

 దాంతో మరింత బాధపడతారు కృష్ణమూర్తి దంపతులు. మరోవైపు అందరూ భోజనాలు చేస్తూ ఉండగా భోజనం మధ్యలోనే వదిలి లేచిపోతుంది స్వప్న. అన్నం లేక చాలా మంది బాధపడుతున్నారు భోజనం పారేయొద్దు అంటుంది కావ్య. చిట్టి వాళ్ళు కూడా అదే చెప్పి స్వప్నని మందలిస్తారు. లేని వాళ్ళ గురించి నా దగ్గర ఎందుకు మాట్లాడుతావు అని కావ్యతో పొగరుగా మాట్లాడుతుంది స్వప్న.
 

 అప్పుడే రాహుల్ సలాడ్ తీసుకు వచ్చి అందరూ దీన్ని పొగరుని చూస్తున్నారు ఇప్పుడు దీని మొండితనాన్ని కూడా చూడాలి  అనుకొని సలాడ్ని స్వప్న కి ఇస్తాడు. అది ఏంటి కడుపుతో ఉన్నవాళ్లు అలాంటివి తినకూడదు అని తెలియదా అని చిట్టి మందలిస్తుంది. అయినా తను చెప్తే నువ్వు చేయటమేనా అంటూ రాహుల్ ని కూడా మందలిస్తుంది. నీకు నచ్చినది తినటం కాదు నీ కడుపులో ఉన్న బిడ్డకు నచ్చింది తినటం ముఖ్యం అంటూ ధాన్యలక్ష్మి కూడా చివాట్లు పెడుతుంది.
 

మరోవైపు బ్యాగ్ తో పాటు బయలుదేరిన అన్నపూర్ణ ని చూసి షాక్ అవుతారు కనుక దంపతులు. ఎక్కడికి బయలుదేరారు అంటుంది కనకం. మన చేతకానితనాన్ని చూడలేక వెళ్ళిపోతున్నట్టుగా ఉంది అంటాడు కృష్ణమూర్తి. అలాంటిదేమీ లేదు ఇప్పటికే మీరు నన్ను కడుపులో పెట్టుకొని చేస్తున్నారు మీకు మళ్ళీ భారం కాలేను అంటుంది అన్నపూర్ణ. అలా అంటావేంటి అక్క నిన్ను సొంత అక్క లాగా చూసుకున్నాను. నువ్వు ఈ ఇంట్లో మనిషి ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు అంటూ ఆమెని ఆపేస్తుంది కనకం.

మరోవైపు ఫ్రీ లాన్సర్ గీసిన డిజైన్స్ ని కావ్యకి చూపించి ఇవి డిజైన్స్ అంటే.. నువ్వు వేస్తావు చుక్కల ముగ్గులు అంటూ వెటకారంగా మాట్లాడుతాడు రాజ్. ఆ అమ్మాయిని పొగడటం కోసం నన్ను తిట్టాలా అంటుంది కావ్య. ఆ అమ్మాయి కి చాలా టాలెంట్ ఉంది తనని ఎంకరేజ్ చేసి ఎక్కడికో తీసుకువెళ్తాను అంటాడు రాజ్. సరే నాకు పని ఉంది అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కావ్య. తర్వాత చార్జర్ కోసం వెతుకుతూ కావ్య డిజైన్స్ చూస్తాడు.

ఫ్రీ లాన్సర్ గీసిన డిజైన్స్ తో కంపేర్ చేసుకుంటాడు ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయి అంటూ షాక్ అవుతాడు. తరువాయి భాగంలో స్కిప్పింగ్ చేస్తున్న స్వప్నని చూసి చిట్టి కోప్పడుతుంది కడుపుతో ఉన్న వాళ్ళు ఇలా చేయొచ్చా అంటూ మందలిస్తుంది. అసలు కడుపుతో ఉన్నట్లే ప్రవర్తకించడం లేదు అని ప్రకాష్ కూడా అనుమానంగా మాట్లాడుతాడు.

Latest Videos

click me!