10 నిమిషాల పాత్రకోసం 20 కోట్లు వసూల్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
టాలీవుడ్ స్టార్ హీరో, కోట్ల మంది అభిమానులున్న మాస్ హీరో, వరుసగా సినిమాలు చేస్తున్న ఈ హీరో రీసెంట్ గా ఓ సినిమాలో గెస్ట్ రోల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 10 నిమిషాల డ్యూరేషన్ ఉన్న ఆ పాత్రను చేయడానికి 20 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్నారట.
- FB
- TW
- Linkdin
Follow Us
)
తెలుగు పరిశ్రమలో మాస్ హీరో, కనుసైగతో ఫ్యాన్స్ ను కదిలించగల పవర్ ఫుల్ హీరో, సోలోగా సూపర్ హిట్ సినిమాలు చేసుకుంటూ, హిట్ మీద హిట్ కొడుతున్న ఈ సీనియర్ హీరో ఓ భారీ ప్రాజెక్ట్ లో గెస్ట్ రోల్ చేయబోతున్నాడు. అయితే ఈ రోల్ కోసం భారీగా రెమ్యునరేషన్ కూడా తీసుకున్నాడట. నిమిషానికి దాదాపు రెండు కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా? ఆయన ఎవరో కాదు నట సింహం నందమూరి బాలయ్య బాబు.
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కూలీ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తర్వాత రజినీకాంత్ జైలర్ 2 చిత్రంలో నటించనున్నారు. ఇది గతంలో విడుదలై ఘన విజయం సాధించిన జైలర్ సినిమాకు సీక్వెల్.
జైలర్ 2 సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఒక హైయాక్షన్ మూవీగా రూపొందుతోంది. ఇందులో కొంత మంది స్టార్ నటీనటులు అతిథి పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలకపాత్రలో కనిపించనున్నారు. రజినీకాంత్ తో శివన్న కలిసి చేసే సన్నివేశాలు సినిమాకు హైలెట్ కానున్నాయి.
ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో, మరో హై లెవెల్ అప్‌డేట్ హాట్ టాపిక్‌గా మారింది. ఆ వివరాలు ప్రకారం, టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. జైలర్ 2లో ఆయనకు కేవలం 10 నిమిషాల నిడివి ఉన్న పవర్‌ఫుల్ క్యారెక్టర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి గాను బాలకృష్ణకు రూ.22 కోట్లు పారితోషికంగా చెల్లిస్తున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ భారీ రెమ్యునరేషన్‌తో కేవలం అతిథి పాత్ర చేసినందుకే తీసుకుంటున్నారని తెలుస్తోంది.
ఇది ఒక రికార్డ్ అని చెప్పవచ్చు. చాలా ఏళ్ల తర్వాత రజినీకాంత్, బాలకృష్ణ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని, ప్రేక్షకులకు గూస్‌బంప్స్ రాబట్టే విధంగా ఉండనున్నాయని టాక్ వినిపిస్తోంది.ఇక బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. గతంలో వీరసింహారెడ్డి, డాకు మహారాజ్ వంటి వరుస విజయాలు అందుకున్న బాలయ్య, జైలర్ 2లో నటించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.