నా బిడ్డకి నిజమైన తండ్రికావాలిః సంచలన వ్యాఖ్యలు చేసిన బిగ్‌బాస్‌ భామ రాఖీ సావంత్‌

First Published Feb 25, 2021, 4:02 PM IST

ఇటీవల బిగ్‌బాస్‌ 14వ సీజన్‌లో మోస్ట్ ఎంటర్‌టైనర్‌గా నిలిచి హైలైట్‌గా నిలిచింది సెక్సీ అందాల తార రాఖీ సావంత్‌. హాట్‌ అందాలు, మత్తెక్కించే డాన్సులతో హాట్‌ టాపిక్‌గా నిలిచే రాఖీ సావంత్‌ తన కోరికని బయటపెట్టింది. తనకు పిల్లల్ని కనాలని ఉందట. తాజాగా ఈ విషయాన్ని వెల్లడించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. 
 

ఇండియన్‌ డాన్సర్‌గా, మోడల్‌గా, టెలివిజన్‌ హోస్ట్ గా, నటిగా రాణిస్తున్న సెక్సీ బాంబ్‌ రాఖీ సావంత్‌ ఇటీవల బిగ్‌బాస్‌ 14వ సీజన్‌లో కంటెస్టెంట్‌గా మెప్పించింది. అత్యంత వినోదాన్ని పంచే కంటెస్టెంగ్‌గా నిలిచి ప్రశంసలందుకుంది.
undefined
అంతేకాదు బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలె రోజు కూడా తాను స్పెషల్‌ అనిపించింది. హోస్ట్ సల్మాన్‌ ఇచ్చిన రూ.14 లక్షల ఆఫర్‌ని తీసుకుని సైలెంట్‌గా జారుకుని జాక్‌ పాట్‌ కొట్టేసింది. ఈ విషయంలో ప్రశంసలందుకుంది రాఖీ.
undefined
ఇదిలా ఉంటే తన చిరకాల కోరికని వెల్లడించింది రాఖీ. బిగ్‌బాస్‌ హౌజ్‌ నుంచి బయటకు రాగానే వరుసగా పార్టీలు, టీవీ ఛానెల్స్ ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా గడుపుతుంది.
undefined
అందులో భాగంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది రాఖీ సావంత్‌. `నేను బిగ్‌బాస్‌లో కచ్చితంగా గెలుస్తా అనుకున్నా. కానీ రాను రానూ రుబీనాకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనిపించింది. ఒకవేళ గెలుపు చేజారితే రన్నరప్‌గా లేదంటే సెకండ్‌ రన్నరప్‌గా నిలుస్తాను. దీని వల్ల నాకేంటి ప్రయోజనం.
undefined
నా బ్యాంక్‌ బ్యాలెన్స్ జీరో ఉంది. నాకిప్పుడు డబ్బులు చాలా అవసరం. కొన్ని నెలలుగా అమ్మ ఆరోగ్యం అస్సలు బాగా లేదు. నేను సంపాదించిందంతా ఆమె చికిత్సకే అయిపోయింది. అందుకే డబ్బులు తీసుకుని ఎలిమినేట్‌ అయ్యా. బిగ్‌బాస్‌ పూర్తయ్యాక అమ్మతోనే మాట్లాడాను. ఇప్పుడు ఆమె ఆరోగ్యం బాగు చేసేందుకు కావాల్సినంత డబ్బు నా వద్ద ఉంది. అందుకు సంతోషంగా ఉంది` అని చెప్పింది రాఖీ.
undefined
సల్మాన్‌ హోస్ట్ గా రన్‌ అయ్యే `బిగ్‌బాస్‌ 14` లో సీరియల్‌ నటి రుబీనా దిలేక్‌ విన్నర్‌గా నిలిచింది. ఆమె ట్రోపీతోపాటు రూ.35లక్షల నగదు అందుకుంది. మిగిలిన 14 లక్షలు రాఖీ ముందే ఆఫర్‌గా పొందిన విషయం తెలిసిందే.
undefined
ఇక రాఖీ సావంత్‌ బిజినెస్‌ మేన్‌ రితేష్‌ ని మ్యారేజ్‌ చేసుకుంది. అయితే అతనికి అప్పటికే మ్యారేజ్‌ అయ్యింది. ఓ బిడ్డ కూడా ఉన్నారని తెలిసి రాఖీ షాకయ్యింది. తనతో వివాహం జరిగిన విషయం ఎవరికీ చెప్పొద్దని ఆయనతో మాట తీసుకున్న రాఖీ.. బిగ్‌బాస్‌లోకి వచ్చాక ఆ విషయాన్ని రివీల్‌ చేసింది.
undefined
దీనిపై ఆయన ఎలా స్పందిస్తాడో తెలియదని చెప్పింది. విడాకుల వరకు వెళ్లినా ఆశ్చర్యం లేదన్నారు. ఇదే సమయంలో మరో ఆసక్తికర, షాకింగ్‌ విషయం వెల్లడించింది రాఖీ సావంత్‌.
undefined
తనకు పిల్లల్ని కనాలని ఉందట. మాతృత్వాన్ని అనుభవించాలని ఉందని తన మనసులోని మాటని వెల్లడించింది. తన అందాలను భద్రపర్చానని చెప్పింది. అయితే తనకు విక్కీ డోనార్‌ అవసరం లేదని, తన బిడ్డకి నిజమైన తండ్రి కావాలని చెప్పింది రాఖీ సావంత్‌. ఒంటరి తల్లిగా ఉండటం ఇష్టంలేదని, కానీ ఇదెలా సాధ్యమవుతుందో తెలియదని వెల్లడించింది.
undefined
ఇదిలా ఉంటే బిగ్‌బాస్‌ పూర్తయిన తర్వాత తన తోటి కంటెస్టెంట్లతో కలిసి పార్టీ చేసుకుంది రాఖీ. తాజాగా ఆయా ఫోటోలను పంచుకుంది.
undefined
బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలె అనంతరం తోటి కంటెస్టెంట్లతో కలిసి పార్టీలో మునిగితేలుతున్న రాఖీ సావంత్‌.
undefined
బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలె అనంతరం తోటి కంటెస్టెంట్లతో కలిసి పార్టీలో మునిగితేలుతున్న రాఖీ సావంత్‌.
undefined
బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలె అనంతరం తోటి కంటెస్టెంట్లతో కలిసి పార్టీలో మునిగితేలుతున్న రాఖీ సావంత్‌.
undefined
బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలె అనంతరం తోటి కంటెస్టెంట్లతో కలిసి పార్టీలో మునిగితేలుతున్న రాఖీ సావంత్‌.
undefined
బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలె అనంతరం తోటి కంటెస్టెంట్లతో కలిసి పార్టీలో మునిగితేలుతున్న రాఖీ సావంత్‌.
undefined
బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలె అనంతరం తోటి కంటెస్టెంట్లతో కలిసి పార్టీలో మునిగితేలుతున్న రాఖీ సావంత్‌.
undefined
click me!