పదహారణాల తెలుగు అమ్మాయి సొగసు అదరహో.. లంగాఓణీలో మైమరపించేలా బేబీ హీరోయిన్

First Published | Jul 18, 2023, 11:24 AM IST

ఆనంద్ దేవరకొండ, విరాజ్, వైష్ణవి నటించిన బేబీ చిత్రం శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్ హిట్ మౌత్ టాక్ తో ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపిస్తోంది.

ఆనంద్ దేవరకొండ, విరాజ్, వైష్ణవి నటించిన బేబీ చిత్రం శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్ హిట్ మౌత్ టాక్ తో ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపిస్తోంది. సాయి రాజేష్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఎస్ కె ఎన్ నిర్మించారు.

విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ తొలి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ తరుణంలో బేబీ మూవీ రూపంలో ఆనంద్ దేవరకొండ అసలు సిసలైన హిట్ కొట్టేశాడు.   


ఆనంద్ దేవరకొండతో పాటు ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన యంగ్ బ్యూటీ వైష్ణవి చైతన్య యువతలో క్రేజీగా మారింది. సోషల్ మీడియాలో వైష్ణవి గురించే నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. 

ఒక్కసారిగా యువతలో వైష్ణవి క్రేజీ బ్యూటీగా మారిపోయింది. చిన్న సినిమాగా విడుదలైన బేబీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. బేబీ చిత్రంతో వైష్ణవి ఓవర్ నైట్ స్టార్ అయిపోయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా యువతని మాయ చేసేసింది ఈ తెలుగు పిల్ల. 

తొలి చిత్రమే అయినప్పటికీ వైష్ణవి ఏమాత్రం బెదురు లేకుండా ఈ చిత్రంలో పెర్ఫామెన్స్ అందించింది. బోల్డ్ గా లిప్ లాక్ సీన్స్ లో కూడా నటించింది. దీనితో వైష్ణవి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 

  ఆ సీన్స్ లో నటించేటప్పుడు బేబీ టీం నన్ను చాలా కంఫర్ట్ గా చూసుకున్నారు. సెట్స్ లో నాకు అసౌకర్యం లేకుండా చూసుకున్నారు. లిప్ లాక్ సీన్, రొమాంటిక్ సీన్ లో నటించేటప్పుడు సెట్ లో చాలా తక్కువ మందే ఉన్నారు అని వైష్ణవి తెలిపింది. 

 అయితే బేబీ మూవీ కేవలం లిప్ లాక్ సన్నివేశం మాత్రమే కాదు. దానికి మించిన ఎమోషన్స్ ఈ చిత్రంలో అద్భుతంగా ఉన్నాయి. సినిమా చూసిన తర్వాత ఎమోషన్స్ మాత్రమే గుర్తుంటాయి అని వైష్ణవి పేర్కొంది. 

  టిక్ టాక్ వీడియోలు చేసుకుంటూ కెరీర్ ప్రారంభించిన వైష్ణవి ఆ తర్వాత యూట్యూబర్ గా మారింది. షార్ట్ ఫిలిమ్స్ తో గుర్తింపు పొందిన తర్వాత బేబీ చిత్రంలో అవకాశం దక్కింది. ఈ జర్నీకి తనకి ఎనిమిదేళ్లు పట్టింది అని వైష్ణవి పేర్కొంది.   

 సోమవారం రోజు జరిగిన బేబీ మూవీ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో వైష్ణవి చైతన్య లంగా ఓణిలో పదహారణాల తెలుగు అమ్మాయిలా మెరుపులు మెరిపించింది. ఆమె లంగా ఓణీలో సింపుల్ గా స్టన్నింగ్ అనిపించే సొగసుతో యువత మైమరచిపోయేలా ఫోజులు ఇచ్చింది. 

ఏది ఏమైనా టాలీవుడ్ లో ఈ యంగ్ తెలుగు బ్యూటీ వైష్ణవి సంచలనంగా మారింది. ఇక నుంచి ఆమెకి మరిన్ని క్రేజీ ఆఫర్స్ రావడం ఖాయం అంటూ సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

Latest Videos

click me!