లీకైన అరియనా బిగ్ బాస్ రెమ్యూనరేషన్... పాపం చాలా చీప్ గా వాడేశారుగా!

First Published Dec 30, 2020, 10:21 PM IST

గత మూడు సీజన్స్ తో పోల్చుకుంటే బిగ్ బాస్ సీజన్ 4 చాలా ప్రత్యేకం. కారణం ఏదైనా ఈసారి హౌస్ లోకి ప్రవేశించిన వారిలో చాలా మందివి కొత్త మొహాలే. హౌస్ లోకి వెళ్లిన తరువాత వాళ్ళ నేపథ్యం ఏమిటో బయటికి రావడం జరిగింది. అలా ఈ సీజన్ కి ఫేమస్ అయినవారిలో అరియనా ఒకరు.

అరియనా యాంకర్ అన్న విషయం తెలిసింది చాలా తక్కువ మందికే... యూట్యూబ్ ప్రేక్షకులకు ఆమె ఐడియా ఉన్నప్పటికీ బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. ఎటువంటి అంచనాలు లేకుండా హౌస్ లోకి ప్రవేశించిన అరియానా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఎదిగారు.
undefined
హౌస్ లో సోహైల్ తో గొడవలుఈమెపైకొంత ప్రతికూల ప్రభావము చూపాయి. అవినాష్ తో అరియనా రిలేషన్ హైలైట్ అయ్యింది. అవినాష్ ఎలిమినేషన్ తరువాత అరియనా ఒంటరిగా ఫీలైఆటమీద ఫోకస్ పెట్టలేకపోయింది.
undefined
ముక్కు సూటి తనం, రియల్ గేమ్ ఆడుతుందనే ఇమేజ్ తెచ్చుకున్న అరియనా ఫైనల్ కి చేరుకున్నారు. అరియనా ఫైనల్ కి చేరడంతో పాటు టాప్ ఫోర్ పొజిషన్ అందుకున్నారు.
undefined
అనేక కష్టనష్టాలు ఓర్చుకున్న అరియానా 105రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారు. ఇన్ని రోజులు కష్టపడిన అరియనాకు ఎంత దక్కింది అనేది, ఆమె రెమ్యూనరేషన్ ఎంత అనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది.
undefined
తాజాగా బయటికి వచ్చిన సమాచారం ప్రకారం అరియనాను రోజుకు రూ. 20వేలు ఒప్పందంపై హౌస్ లోకి తీసుకున్నారట. ఆ లెక్కన105 రోజులకు గాను రూ. 21 లక్షలు ఆమె రెమ్యూనరేషన్ గా తీసుకున్నారట.
undefined
ఐతే హౌస్ లోకి ప్రవేశించిన వారందరిలో అరియానాకే తక్కువ పారితోషికం అట. దీనితో ఫైనల్ కి చేరుకున్నప్పటికీ అరియనాకు కేవలం దక్కింది రూ. 21 లక్షలే అన్న మాట వినిపిస్తుంది.
undefined
ఇక రెమ్యూనరేషన్ పక్కన పెడితేషో వలన అరియానా ఫేమ్బాగా పెరిగిపోయింది. ఆమె కెరీర్ కి మంచి బ్రేక్ వచ్చినట్లు అయ్యింది.
undefined
click me!