రంగస్థలం, పుష్ప లాంటి చిత్రాలు అనసూయకి నటిగా మంచి క్రేజ్ తీసుకువచ్చాయి. అనసూయ చివరగా పెదకాపు చిత్రంలో నటిచింది. ఇప్పుడు పుష్ప 2, మరికొన్ని చిత్రాలతో బిజీగా ఉంది. వచ్చిన ప్రతి ఆఫర్ కి అనసూయ ఒకే చెప్పి ఉంటే ఈ పాటికి ఆమె చాలా చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసి ఉండాలి. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది.