జీవాపై ‘రేప్’ కామెంట్లు చేసిన టీనేజర్ అరెస్టు... అశ్విన్ ఏమన్నాడంటే...

First Published Oct 12, 2020, 8:11 PM IST

IPL 2020 సీజన్‌లో మహేంద్ర సింగ్ ధోనీ వరుసగా ఫెయిల్ అవుతుండడంతో ఆయన కూతురు జీవా సింగ్‌పై అత్యాచార బెదిరింపులకు పాల్పడిన టీనేజర్‌ను అరెస్టు చేశారు గుజరాత్ పోలీసులు... ఈ అరెస్టుపై స్పందించారు క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్, నటుడు ఆర్ మాధవన్. 

IPL 2020 సీజన్‌లో మహేంద్ర సింగ్ ధోనీ వరుసగా ఫెయిల్ అవుతుండడంతో ఆయన కూతురు జీవా సింగ్‌పై అత్యాచార బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే.
undefined
సోషల్ మీడియాలో కొందరు ఆకతాయిలు ధోనీ బాగా ఆడకపోతే జీవాను రేప్ చేస్తామంటూ పిచ్చి కామెంట్లతో బెదిరింపులకు పాల్పడ్డారు.
undefined
దీంతో రాంఛీలో ఉన్న ధోనీ ఇంటికి భద్రత పెంచారు అధికారులు.
undefined
సైబర్ క్రైమ్ పోలీసుల సాయంతో పిచ్చి కామెంట్లు చేసిన ఆ ఆకతాయిని అరెస్టు చేశారు పోలీసులు.
undefined
గుజరాత్‌లోని కుట్జ్ జిల్లా నమ్న కపాయ గ్రామానికి చెందిన 16 ఏళ్ల యువకుడు ఈ విధమైన అసభ్య కామెంట్లు చేసినట్లు గుర్తించిన గుజరాత్ పోలీసులు, అతన్ని అదుపులోకి తీసుకుని జార్ఖండ్ పోలీసులకి అప్పగించారు.
undefined
దీనిపై స్పందించిన రవిచంద్రన్ అశ్విన్... ‘కుర్చిలో కూర్చొని, చేత్తో దారుణాలు రాసే ఈ రాక్షసులను సూటిగా చేయాల్సిన సమయం వచ్చింది’ అని కామెంట్ చేశాడు.
undefined
‘ధోనీ కూతుర్ని బెదిరించిన టీనేజర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు గొప్ప పని చేశారు. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ అంటే వీడికి భయం కలిగేలా, ముఖం చూపించడానికి భయపడి ఇంటర్నెట్‌ల ఇష్టం వచ్చినవి రాసే ఈ రాక్షసులకు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది’ అని కామెంట్ చేశారు నటుడు మాధవన్.
undefined
2007లో వరల్డ్‌కప్‌లో భారత జట్టు ఘోర ఓటమి తర్వాత ధోనీ ఇంటిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే.
undefined
భారత జట్టుకు సారథిగా రెండు వరల్డ్‌కప్స్ అందించిన మహేంద్ సింగ్ ధోనీ, ఇప్పుడు కూడా ఐపీఎల్ ప్రదర్శన కారణంగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
undefined
ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా ఉన్న ధోనీ, మూడు సార్లు టైటిల్, 8 సార్లు ఫైనల్, 10 సీజన్లలో ప్లేఆఫ్ చేరిన ఏకైక జట్టుగా సీఎస్‌కేని నిలిపాడు.
undefined
అత్యాచార బెదిరింపులు ఎదుర్కొన్న జీవా సింగ్ ధోనీ వయసు కేవలం ఐదేళ్లు మాత్రమే...
undefined
click me!