ఒకే ఓవ‌ర్ లో 4 4 4 6 4 6.. ఊచ‌కోత‌కు కేరాఫ్ అడ్ర‌స్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్..

By Mahesh Rajamoni  |  First Published May 8, 2024, 8:59 AM IST

Jake Fraser-McGurk : ఢిల్లీ క్యాపిట‌ల్స్ ప్లేయ‌ర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ ఈ ఐపీఎల్ సీజ‌న్ లో ఆడిన 7 మ్యాచుల్లో 235 స్ట్రైక్ రేటుతో 309 ప‌రుగులు చేశాడు. అత‌ని ఇన్నింగ్స్ ల‌లో 30 ఫోర్లు, 26 సిక్స‌ర్లు ఉన్నాయి. ఐపీఎల్ 2024 లో 89.3 శాతం ప‌రుగులు జేక్ కు బౌండ‌రీల రూపంలోనే రావ‌డం విశేషం. 
 


Delhi Capitals vs Rajasthan Royals : బౌల‌ర్ ఎవ‌రైనా ఏమాత్రం భ‌యం లేదు.. బెరుకు లేదు.. క్రీజులోకి వ‌స్తువ‌స్తూనే బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డుతున్న సునామీ ఇన్నింగ్స్ ఆడుతూ అల‌వోక‌గా ఫోర్లు, సిక్స‌ర్ల‌తో విరుచుకుప‌డుతూ సంచ‌ల‌నంగా మారాడు ఢిల్లీ క్యాపిట‌ల్స్ యంగ్ ప్లేయ‌ర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్. తాజాగా రాజ‌స్థార్ రాయ‌ల్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో ఈ ఢిల్లీ బ్యాటింగ్ సెన్షేష‌న్ జేక్ మ‌రోసారి బౌల‌ర్ కు చుక్క‌లు చూపించాడు. అవేశ్ ఖాన్ వేసిన 4వ ఓవ‌ర్ లో వ‌రుస‌గా 4, 4, 4, 6, 4, 6 బాదాడు. దీంతో ఈ ఓవ‌ర్ లో 28 ప‌రుగులు వ‌చ్చాయి. దీంతో పాటు కేవ‌లం 19 బంతుల్లోనే జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ హాఫ్ సెంచ‌రీ పూర్తి చేశాడు.

మంగళవారం (మే 7) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ అవేశ్ ఖాన్ బౌలింగ్ ను చిత్తుచేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కు శుభారంభం అందించి డీసీ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. తొలి ఓవర్లోనే ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ లొ   ఫోర్ కొట్టిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. మూడో ఓవర్ లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టి తన బ్యాటింగ్ పవర్ ను చూపించాడు. ఇక నాలుగో ఓవర్లో అవేష్ ఖాన్ బౌలింగ్ ను చెడుగుడు ఆడుకుంటూ కేవలం 19 బంతుల్లోనే అద్భుత అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఈ ఓవర్లో 28 పరుగుల‌ను రాబ‌ట్టాడు. వరుసగా మూడు ఫోర్లు, నాలుగో బంతికి సిక్స్, ఐదో బంతికి మరో ఫోర్.. చివ‌రి బందికి మరో సిక్సర్ తో ఓవర్ ను ముగించాడు. ఈ క్ర‌మంలోనే 19 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్లో 20 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేయడం ఇది మూడోసారి. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2024 సీజన్ లో ఇప్పటికే 15 బంతుల్లో రెండు అర్ధసెంచరీలు సాధించాడు.

Latest Videos

undefined

 

Now this is how you play T20 cricket 💥 pic.twitter.com/wJxxvhKdLe

— JioCinema (@JioCinema)

 

జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ తన తొలి ఐపీఎల్ సీజన్ లోనే అద్భుతంగా ఆకట్టుకున్నాడు. ప్రస్తుత సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చోటు దక్కకపోయినప్పటికీ ఆ తర్వాత లుంగీ ఎంగిడి గాయం స్థానంలో జట్టులోకి తీసుకున్నారు. టోర్నమెంట్ ప్రారంభ దశలో ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు దక్కించుకోవడానికి కష్టపడిన ఈ బ్యాట్స్ మన్ గత నెలలో అరంగేట్రం చేసినప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. అరంగేట్ర మ్యాచ్లోనే లక్నో సూపర్ జెయింట్స్ పై 55 పరుగుల ఇన్నింగ్స్ తో ఐపీఎల్లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ తో పాటు ముంబై ఇండియన్స్ పై 15 బంతుల్లో హాఫ్ సెంచరీలు సాధించాడు. ఢిల్లీ క్యాపిట‌ల్స్ ప్లేయ‌ర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ ఈ ఐపీఎల్ సీజ‌న్ లో ఆడిన 7 మ్యాచుల్లో 235 స్ట్రైక్ రేటుతో 309 ప‌రుగులు చేశాడు. అత‌ని ఇన్నింగ్స్ ల‌లో 30 ఫోర్లు, 26 సిక్స‌ర్లు ఉన్నాయి. ఐపీఎల్ 2024 లో 89.3 శాతం ప‌రుగులు జేక్ కు బౌండ‌రీల రూపంలోనే రావ‌డం విశేషం.

click me!