చేతిలో మందు గ్లాస్‌, టైట్‌ హగ్‌తో ప్రియుడికి ఘాటు ముద్దు.. విశ్వరూపం చూపించిన జ్యోతిరాయ్‌.. ఫోటో వైరల్

Published : May 08, 2024, 03:13 PM IST

`గుప్పెడంత మనసు` సీరియల్‌ ఫేమ్‌ జ్యోతీ రాయ్‌ మరోసారి షాకిచ్చింది. ఆమె తన ప్రియుడితో ఘాటు రొమాన్స్ తో బిజీగా ఉంది. ఈ మేరకు లేటెస్ట్ ఫోటో ఇంటర్నెట్‌ని ఊపేస్తుంది.   

PREV
17
చేతిలో మందు గ్లాస్‌, టైట్‌ హగ్‌తో ప్రియుడికి ఘాటు ముద్దు.. విశ్వరూపం చూపించిన జ్యోతిరాయ్‌.. ఫోటో వైరల్

`గుప్పెడంత మనసు` సీరియల్‌‌తో పాపులర్‌ అయ్యింది జ్యోతీ రాయ్‌. ఇందులో జగతీ మేడమ్‌గా ఆమెకి విశేష గుర్తింపు వచ్చింది. ఈ సీరియల్‌ తెలుగు ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. తెలుగు వారికి దగ్గరైన సీరియల్లో ఒకటిగా నిలిచింది. దీంతోపాటు ఇందులోని జగతీమేడమ్‌ పాత్రలో నటించిన జ్యోతీ రాయ్‌ అంతే పాపులారిటీని సొంతం చేసుకుంది.  
 

27

బుల్లితెరపై చీరలో సాంప్రదాయంగా కనిపించే జ్యోతీరాయ్‌.. సోషల్‌ మీడియాలో మాత్రం పూర్తి భిన్నంగా దర్శనమిస్తుంది. ఆమెలోని విశ్వరూపం చూపిస్తుంది. చీరకి పూర్తి భిన్నంగా షార్ట్స్, బికినీలు, పొట్టి దుస్తుల్లో దుమారం రేపుతుంది. ఒంటిపై డ్రెస్‌ నిలవదు అనేలా ఆమె ఫోటో షూట్లు చేసి షాకిస్తుంది. ఇది జగతీ మేడమేనా ? అని ఆమె అభిమానులు సైతం ఆశ్చర్యపోయేలా ట్రీట్‌ ఇస్తూ రెచ్చిపోతుంది జ్యోతీరాయ్‌. 
 

37

ఆమె సోషల్‌ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన అన్ని విషయాలను పంచుకుంటుంది. గ్లామర్‌ ఫోటోలే కాదు, రీల్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది. అడపాదడపా ఫ్యాన్స్ తోనూ ఛాట్‌ చేస్తుంది. మరోవైపు తాను చేసే ప్రతీ యాక్టివిటీస్‌ని అందులో పోస్ట్ చేస్తుంది. ఈ క్రమంలో తన పర్సనల్‌ విషయాలను షేర్‌ చేస్తూ వస్తోంది. 
 

47

తన ప్రియుడి విషయాలు కూడా బయటపెట్టింది జ్యోతీరాయ్‌. ఆ మధ్య ప్రియుడు దర్శకుడు సురేష్‌ కుమార్‌తో ఘాటు రొమాన్స్ చేస్తున్న ఫోటోలను పంచుకుని షాకిచ్చింది. గట్టిగా హగ్గులు, ముద్దులతో రెచ్చిపోయిన పిక్స్ ని పంచుకుంది. ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది. ప్రియుడికి ఘాటు ముద్దు పెడుతూ కనిపించింది. ప్రస్తుతం ఈ పిక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

57

ఇందులో ఓ చేతిలో మందు(వైన్‌) గ్లాస్‌ పట్టుకుని ఉంది. మరోవైపు ప్రియుడికి గట్టిగా హగ్‌ ఇస్తూ, ఘాటుగా ముద్దుపెట్టింది జ్యోతీ రాయ్‌. రాత్రి సమయంలో పార్టీలో ఈ ఇద్దరు ఇలా రెచ్చిపోయినట్టు తెలుస్తుంది. కావాలని తీసుకున్నారా? తెలియకుండా తీశారో తెలియదు కానీ ఇప్పుడీ పిక్‌ ఇంటర్నెట్‌ని ఊపేస్తుంది. 
 

67

జ్యోతీరాయ్‌కి ఇప్పటికే పెళ్లి అతనితో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత స్వేచ్ఛగా విహరిస్తుంది. ఈ క్రమంలో ఆమె దర్శకుడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. ప్రస్తుతం `ఏ మాస్టర్‌ పీస్‌` సినిమాని రూపొందిస్తున్న దర్శకుడు సురేష్‌ కుమార్‌ తో డేటింగ్‌లో ఉంది. ఈ ఇద్దరు ఘాటు రొమాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు. ఘాటు ప్రేమలో మునిగి తేలుతున్నారు. 
 

77

అయితే వీరికి పెళ్ళైందనే వార్తలు వస్తున్నాయి. ఓ సందర్భంలో ఆమె నువ్వు నాకు భర్తగా దక్కడం అదృష్టం అంటూ పోస్ట్ పెట్టింది. దీంతో ఈ ఇద్దరు సీక్రెట్‌గా మ్యారేజ్‌ చేసుకున్నారని అంటున్నారు. అంతేకాదు ఈ చిత్రంలోనూ జ్యోతీ రాయ్‌ కనిపిస్తుందని సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కానీ ఇప్పుడు జ్యోతీ రాయ్‌ ఫోటో ఒకటి మాత్రం ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది.  

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories