రాజమౌళి విజయం తప్పించి అపజయం ఎరుగని దర్శకుడు దాదాపు 24 ఏళ్లుగా సినిమాలు చేస్తూ వస్తున్న జక్కన్న ఇప్పటి వరకూ పరాజయం చూడలేదు. అంతే కాదు టాలీవుడ్ కు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకువచ్చాడు. తెలుగు సినిమాను చులకన చేసినవారికి గుబగుయ్యి..మనే సమాధానం చెప్పాడు. తెలుగు తారలను పాన్ వరల్డ్ కు తీసుకెళ్లిన ఘనుడు రాజమౌళి. అటువంటి జక్కన్న సినిమాను ఎవరు కాదంటారు చెప్పండి.