టీమిండియా టీ20 ప్రపంచకప్ 2024 జెర్సీలో ఒక్క 'స్టార్' మాత్ర‌మే ఎందుకు ఉంది?

By Mahesh RajamoniFirst Published May 8, 2024, 10:15 AM IST
Highlights

India new jersey highlights: టీ20 ప్రపంచ కప్ 2024లో భారత క్రికెట్ జట్టు జూన్ 5న ఐర్లాండ్‌తో తన తొలి మ్యాచ్ ను ఆడ‌నుంది. పాకిస్తాన్, కెనడా,యూఎస్ఏ, ఐర్లాండ్ జట్టుతో పాటుగా టీమిండియా కూడా గ్రూప్ ఏ ఉంది. ఈ క్ర‌మంలోనే వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త జ‌ట్టు కొత్త జెర్సీని ఆవిష్క‌రించింది. 
 

T20 World Cup 2024 India new jersey : ఐపీఎల్ 2024 ముగిసిన వెంట‌నే మ‌రో క్రికెట్ స‌మ‌రం మొద‌లుకానుంది. అదే ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024. దీనికి సంబంధించిన ఇప్ప‌టికే ఐసీసీ ఏర్పాట్ల‌ను పూర్త చేస్తోంది. ఇక 2024 టీ20 ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ జట్టు త‌న కొత్త‌ జెర్సీని విడుదల చేసింది. జూన్ 1న యూఎస్ఏ, వెస్టిండీస్‌లో ప్రారంభం కానున్న ఈ మెగా గ్లోబల్ టోర్నమెంట్ కోసం మెన్ ఇన్ బ్లూ కొత్త జేర్సీతో బ‌రిలోకి దిగ‌నుంది.

గతంలో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్‌కు సంబంధించిన కిట్‌తో పోలిస్తే ప్ర‌స్తుత జెర్సీ చాలా భిన్నంగా ఉంది. భార‌త జ‌ట్టు కొత్త జెర్సీ నీలం, నారింజ రంగుల కలయికతో ఉంది. సాంప్రదాయ నీలం ముందు భాగంలో ఉండగా, ఆడిడాస్ (కిట్ స్పాన్సర్) చారలతో భుజాలపై నారింజ రంగు ఉంటుంది. అయితే భారత పరిమిత ఓవర్ల జెర్సీలపై సాధారణంగా కనిపించే మూడు నక్షత్రాలకు బదులుగా జెర్సీలో ఒకే ఒక నక్షత్రం ఉంది.

భార‌త టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024  జెర్సీలో ఒక్క నక్షత్రమే ఎందుకు ఉంది? 

టీమిండియా టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 కోసం విడుద‌ల చేసిన కొత్త జెర్సీలో ఇందుకు ముందు జెర్సీతో పోలిస్తే కొన్ని ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి. సాధార‌ణంగా భార‌త జెర్సీలో క‌నిపించే మూడు స్టార్ల‌కు బ‌దులు కొత్త జెర్సీలో ఒక్క స్టార్ మాత్ర‌మే ఉంది. ఆస‌లు ఈ స్టార్లు ఎందుకు ఉంచారు? అస‌లు విష‌యంలోకి వెళ్తే.. భార‌త జెర్సీపై ఉన్న నక్షత్రాలు వ‌న్డే, టీ20 ఫార్మాట్‌లలో మెన్ ఇన్ బ్లూ గెలుచుకున్న ప్రపంచ కప్ టైటిల్‌లను సూచిస్తాయి. అంటే వ‌న్డే క్రికెట్  మూడు ప్ర‌పంచ క‌ప్ ల‌ను భార‌త్ గెలుచుకుంది. కాబ‌ట్టి  ఆ జెర్సీపై మూడు న‌క్ష‌త్రాలు ఉంటాయి.

టీ20 ప్రపంచకప్‌కి సంబంధించిన జెర్సీ కిట్‌లో ఒక నక్షత్రం మాత్రమే ఉంటుంది. ఎందుకంటే 2007లో భారత్‌ ఒకే ఒక్క టీ20 ప్రపంచకప్‌ను మాత్రమే గెలుచుకుంది. ఆ త‌ర్వాత క‌ప్ ను సాధించ‌లేక‌పోయింది. ఈ సారి భారత జ‌ట్టు టీ20 ప్ర‌పంచ క‌ప్ టైటిల్ ను సాధించే రాబోయే జెర్సీలో రెండు న‌క్ష‌త్రాల‌ను మనం చూడ‌వ‌చ్చు. అంటే ఈ న‌క్ష‌త్రాలు జ‌ట్టు సాధించిన ట్రోఫీల‌ను సూచిస్తుంది. 

ఇదిలావుండ‌గా, పాకిస్థాన్, కెనడా, యూఎస్ఏ, ఐర్లాండ్‌లతో కలిసి భారత జట్టు టోర్నీలో గ్రూప్-ఎలో ఉంది. జూన్ 5న యూఎస్ఏలోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భార‌త జ‌ట్టు ఐర్లాండ్ తో తొలి మ్యాచ్ ను ఆడ‌నుంది. జూన్ 9న అదే వేదికపై చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఆ తర్వాత జూన్ 12న న్యూయార్క్‌లో అమెరికాతో మూడో మ్యాచ్ ఆడ‌నుంది. జూన్ 15న ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌లోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్‌లో మెన్ ఇన్ బ్లూ వారి చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో కెనడాతో త‌ల‌ప‌డ‌నుంది.

హెలికాప్టర్ తో టీ20 ప్రపంచ కప్ భార‌త‌ జెర్సీ ఆవిష్క‌ర‌ణ‌.. అభిమానులు ఎక్కడ కొనుక్కోవచ్చు?

 

click me!