ఆ రోజు రాహుల్ ద్రావిడ్‌ను శ్రీశాంత్ పబ్లిక్‌గా బూతులు తిట్టాడు... కారణం ఇదేనంటూ...

First Published Jul 3, 2021, 3:52 PM IST

భారత మాజీ మెంటల్ కండీషనర్ ప్యాడీ అప్టన్, రెండేళ్ల క్రితం విడుదల చేసిన పుస్తకంలో టీమిండియా గురించి కొన్ని విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతున్నాయి. 2011 వరల్డ్‌కప్ సమయంలో భారత క్రికెటర్లను సెక్స్ చేయాలని సూచించానని తన పుస్తకంలో రాసుకున్న అప్టన్, శ్రీశాంత్‌పై ఓ సంచలన ఆరోపణ చేశాడు...

స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న కేరళ క్రికెటర్ శ్రీశాంత్, 2013 మే 16న అరెస్ట్ అయ్యాడు. అయితే అరెస్టుకి ముందే అప్పటి కెప్టెన్ రాహుల్ ద్రావిడ్‌తో అమర్యాదగా ప్రవర్తించి, జట్టు నుంచి ఇంటికి పంపబడినట్టు తెలిపాడు ప్యాడీ అప్టన్...
undefined
భారత క్రికెటర్ హర్భజన్ సింగ్‌తో గొడవ వంటి సంఘటనలతో శ్రీశాంత్ షార్ట్ టెంపర్ బిహేవియర్ గురించి అప్పటికే చాలా పెద్ద చర్చ జరిగింది...
undefined
‘2013లో ఐపీఎల్ సీజన్ నడుస్తున్న టైమ్‌లో నేను రాజస్థాన్ రాయల్స్‌కి మెంటల్ కోచ్‌గా వ్యవహరించాను. ఎవరైనా శ్రీశాంత్ ఓ ఎమోషనల్ పర్సన్ అని, ప్రతీదానికి బాధపడతాడని చెబితే నేను నవ్వుతాను...
undefined
ఎందుకంటే అతను ఎమోషనల్‌గా వీక్ కాదు, తన ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేని స్వభావం తనది. చాలాసార్లు ఇలాగే ఓవర్‌గా కోపం, అతి ఆవేశం చూపించేవాడు శ్రీశాంత్...
undefined
అప్పుడు రాజస్థాన్ రాయల్స్ పూర్తి జట్టు బలం 24 మంది. ప్రతీ మ్యాచ్‌కి ముందు ఎంపిక కాని 13 ప్లేయర్లకు ఆ విషయాన్ని ముందుగానే చెప్పేవాళ్లం...
undefined
అప్పటి కెప్టెన్ రాహుల్ ద్రావిడ్, ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీశాంత్‌ను ఎంపిక చేయలేదు. ప్రతీ ప్లేయర్ జట్టులో స్థానం రావాలని కోరుకుంటాడు. రాకపోతే నిరాశ పడతాడు.
undefined
స్పాట్ ఫిక్సింగ్‌కి పాల్పడిన ప్లేయర్ల గురించి అప్పటికే మాకు సమాచారం అందింది. అందుకే శ్రీశాంత్‌తో పాటు చండీలాను కూడా తుది జట్టుకి ఎంపిక చేయలేదు రాహుల్ ద్రావిడ్...
undefined
అయితే టీమ్‌కి ఎంపిక చేయకపోవడంతో శ్రీశాంత్‌కి బాగా కోపం వచ్చింది. అందరి ముందు మమ్మల్ని బూతులు తిట్టాడు... అతని మెంటల్ కండీషన్ సరిగా లేదని నాకు అప్పుడే క్లారిటీ వచ్చేసింది.
undefined
ఆ సంఘటనతో షాకైన ద్రావిడ్, అతన్ని టీమ్‌ నుంచి పక్కనబెట్టి, అమర్యాదకరంగా ప్రవర్తించినందుకు ఇంటికి పంపించేశాడు...’ అంటూ తన బుక్ ‘ది బేర్ ఫూట్ కోచ్’ లో రాసుకొచ్చాడు అప్టన్...
undefined
స్పాట్ ఫిక్సింగ్‌కి పాల్పడుతున్నారని ఆరోపణలు ఎదుర్కొన్న చండీలాను కూడా ముంబైతో గేమ్‌లో తప్పించామని, దాంతో తాము ఏర్పాటు చేసుకున్న ఇద్దరు ప్లేయర్లు... ఆ రోజు మ్యాచ్‌లో ఆడకపోవడంతో అంకిత్ ఛావన్‌ను ఎంచుకున్నారని కామెంట్ చేశాడు అప్టన్.
undefined
అయితే ప్యాడీ అప్టన్ చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్దాలని కొట్టిపారేశాడు క్రికెటర్ శ్రీశాంత్... ‘రాహుల్ ద్రావిడ్ సర్ అంటే నాకు ఎంతో గౌరవం. నేను భారత జట్టులోకి రావడానికి కారణం ఆయనే. ఆయన్ని నేను ఎందుకు తిడతాడు. ఆప్టన్ పచ్చి అబద్దాల కోరు’ అంటూ కామెంట్ చేశాడు శ్రీశాంత్.
undefined
click me!