ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ల డ్యాన్సింగ్ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఈ వీడియోపై ఇద్దరు నేతల రియాక్షన్ ఒక్కోలా వుంది... ఎవరెలా స్పందించారంటే...
భారతదేశ పాలనా పగ్గాలు చేపట్టేది ఎవరో నిర్ణయించే అత్యంత కీలకమైన లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలన్ని కదనరంగంలోకి దిగాయి. మండుటెండలను సైతం లెక్కచేయకుండా నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు...ఈ క్రమంలోనే వారిమధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇలా సీరియస్ గా రాజకీయ వాతావరణాన్ని కూల్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డ్యాన్సింగ్ వీడియోలు బయటకు వచ్చాయి.
ఎవరు రూపొందించారో గానీ ప్రధాని మోదీ కుర్రాడిలా డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సేమ్ టు సేమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా హుషారుగా డ్యాన్స్ చేస్తున్న కార్టూన్ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇద్దరూ రాజకీయ నాయకులే... ఉన్నత పదవుల్లో వున్నవారే... కానీ డ్యాన్సింగ్ వీడియోపై మోదీ ఒకలా... మమత మరోలా రియాక్ట్ అయ్యారు.
undefined
ప్రధాని మోదీ ట్వీట్ :
సోషల్ మీడియాలో తన డ్యాన్స్ వీడియోపై స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ వీడియో చూసి మీరంతా ఎంజాయ్ చేసినట్లే ఆ డ్యాన్స్ చూసి తానూ ఎంజాయ్ చేసానని ప్రధాని అన్నారు. ఈ వీడియో చాలా సృజనాత్మకంగా వుందని ప్రధాని అన్నారు. ఎన్నికల హడావిడి సమయంలో ఇలాంటి వీడియోలు ఎంతో ఉపశమనంగా వుంటాయి... ఇలాంటివి తనకెంతో సంతోషాన్ని ఇస్తాయి అనేలా ప్రధాని కామెంట్స్ చేసారు. ఇలా తన డ్యాన్సింగ్ వీడియోను పోస్ట్ చేసిన నెటిజన్ ను ప్రధాని మోదీ ప్రశంసించారు.
Like all of you, I also enjoyed seeing myself dance. 😀😀😀
Such creativity in peak poll season is truly a delight! https://t.co/QNxB6KUQ3R
మమతా బెనర్జీ :
ప్రధాని మోదీ డ్యాన్సింగ్ వీడియో మాదిరిగానే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డ్యాన్స్ చేస్తున్నట్లుగా ఓ కార్టూన్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.అయితే మోదీలా ఈ వీడియోను సరదాగా తీసుకోవడంలేదు దీదీ. అలాగే తమ నాయకురాలిని అవమానించేలా ఈ వీడియో వుందని తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ వీడియోను రూపొందించింది ఎవరో గుర్తించేపనిలో పడ్డారు. సీఎం మమత ఆదేశాలతో ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్దమయ్యారు.
Kolkata Police is giving warning for posting this funny video on CM Mamata Banerjee.
Please dont share 🙏🏻pic.twitter.com/gQVkQaVjWq https://t.co/2076BrSvoM