పిల్లల జీవితంలో ముఖ్యమైన సమయం ఇది.. వృథా చేయకండి..!

First Published | May 7, 2024, 9:56 AM IST

ఒక రోజంతా మీకు వారితో సమయం గడపడం కుదరకపోవచ్చు. కానీ.. మీరు రోజులో ఒక మూడు సమయాల్లో వారిపై స్పెషల్ అఫెక్షన్, అటెన్షన్ చూపిస్తే సరిపోతుంది. ఆ టైమ్స్ ఏంటో చూద్దాం..
 

ప్రతి పేరెంట్స్ తమ పిల్లలు సంతోషంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటారు. అయితే.. వాళ్లు అలా సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి అంటే కొన్ని సమయాల్లో పేరెంట్స్ నుంచి ఎక్సట్రా అటెన్షన్ కోరుకుంటారు. ఆ అటెన్షన్ కనుక ఇచ్చినట్లయితే... వారు నిజంగానే హ్యాపీగా లైఫ్ ని  లీడ్ చేయగలుగుతారు. ఒక రోజంతా మీకు వారితో సమయం గడపడం కుదరకపోవచ్చు. కానీ.. మీరు రోజులో ఒక మూడు సమయాల్లో వారిపై స్పెషల్ అఫెక్షన్, అటెన్షన్ చూపిస్తే సరిపోతుంది. ఆ టైమ్స్ ఏంటో చూద్దాం..


1.మార్నింగ్ మ్యాజిక్..
పిల్లలు ఉన్న ఇంట్లో ఉదయం పూట  ఎంత హడావిడిగా ఉంటుందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఉదయాన్నే పిల్లలను లేపి, రెడీ చూసి స్కూల్ కి పంపడం ఒకవైపు.. వారికి లంచ్, బ్రేక్ ఫాస్ట్ ప్రిపేర్ చేయడం మరో వైపు ఇలా నానా హంగామా ఉంటుంది. పిల్లలు ఎంత లేపినా లేవరు. పేరెంట్స్ కి టైమ్ అయిపోతుంది అనే కంగారు ఉంటుంది. ఈ క్రమంలో వారిపై చిరాకు పడుతూ, సీరియస్ అవుతూ ఉంటాం. నిద్రలేవమని కొట్టే పేరెంట్స్ కూడా లేకపోలేదు.  అయితే.. దానికి బదులు.. మీరు ఈ  సమయంలోనే వారిపై స్పెషల్ కేర్ చూపించాలి. ఆలస్యం అవుతోందని కోపం పడే బదులు.. నవ్వుతూ వాళ్లను పలకరించాలి. మంచిగా గుడ్ మార్నింగ్ చెప్పి, వాళ్లకు ఓ మద్దు పెట్టి నిద్రలేపాలి. ఉదయం పూట వారి బ్రెయిన్ చాలా  ప్లెజెంట్ గా ఉంటుంది. ఆ సమయంలో వారికి మంచిగా హగ్ ఇచ్చి.. ఏదైనా మంచి విషయం చెప్పాలి. ఆ రోజంతా వారు పాజిటివ్ గా ముందుకు సాగడానికి సహాయపడుతుంది.


Kids alone

2.స్వీట్ నైట్...
పిల్లల జీవితంలో ఉదయం ఎంత కీలకంగా ఉంటుందో.. రాత్రిపూట కూడా అంతే కీలకంగా ఉంటుంది. పిల్లలకు రాత్రి సమయం చాలా ప్రశాంతంగా ఉండేలా చూడాలి. పడుకోమని తిట్టడం, కొట్టడం లాంటివి చేయకూడదు. పడుకునే సమయంలోనూ వారిపై కోపం తెచ్చుకోకూడదు. ఇది మీకు, మీ పిల్లలకు ఇద్దరికీ నిద్ర భంగం కలిగిస్తుంది. నిద్రపోయే సమయంలో పిల్లలతో కలిసి మంచిగా పుస్తకం చదవడం, వారికి మంచి కథలు చెప్పడం లాంటివి చేసి.. వారిని ఆనందంగా నిద్రపుచ్చేలా చేయాలి. అప్పుడు వారు ఎలాంటి టెన్షన్స్ లేకుండా... ప్రశాంతంగా నిద్రపోగలరు


3. స్కూల్ తర్వాత..

ఉధయం పూట, రాత్రి నిద్రపోయే సమయం మాత్రమే కాకుండా.. పిల్లల జీవితంలో ఒక రోజులో మరో ముఖ్యమైన సమయం కూడా ఉంది. అదే.. పిల్లలు స్కూలు నుంచి ఇంటికి వచ్చే సమయం. కలిసి చిరుతిండిని తయారు చేయడం ద్వారా మీ పిల్లలతో బంధం ఏర్పరుచుకునే అవకాశాన్ని పొందండి. ఇది కొన్ని పండ్లను ముక్కలు చేయడం లేదా కుక్కీల బ్యాచ్‌ను తయారు చేయడం వంటివి చాలా సులభం. ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు కలిసి సమయాన్ని వెచ్చిస్తారు. ఆ సమయంలోనే వారికి రోజు ఎలా గడిచిందో అడిగి తెలుసుకోవాలి. వారు చెప్పాలి అనుకునే అన్ని విషయాలను ఓపిక గా వినడం. అలా వారికి ఆ సమయం కేటాయించడం వల్ల వారు చాలా సంతోషంగా ఉంటారు. 

Latest Videos

click me!