వేసవిలో రోజుకు ఎన్ని గుడ్లు తినాలి?

First Published | May 7, 2024, 9:54 AM IST

గుడ్లు మంచి పోషకాహారం. రోజూ గుడ్డును తినడం వల్ల మన శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. అయితే  గుడ్లలో కూడా వేడి చేసే గుణం ఉంటుంది. అందుకే చాలా మంది ఎండాకాలంలో గుడ్లను మొత్తమే మానేస్తుంటారు. కానీ ఎండాకాలంలో కూడా గుడ్లను తినొచ్చు. కానీ అతిగా మాత్రం తినొద్దు.
 

చాలా మంది తమ శరీరాన్ని ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి రోజూ గుడ్లను తింటుంటారు. కానీ ఎండాకాలం వచ్చిందంటే రోజుకు ఎన్ని గుడ్లు తినాలో తెలియక మనలో చాలా మంది గుడ్లను తినడమే మానేస్తుంటారు. కానీ ఆరోగ్యంగా ఉండాలంటే ఎండాకాలంలో కూడా గుడ్లను ఖచ్చితంగా తినాలి. గుడ్లు మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలను అందిస్తుంది. మరి ఎండాకాలంలో రోజుకు ఎన్ని గుడ్లు తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

వేసవిలో గుడ్లు తింటే..

ఎండాకాలంలో గుడ్లను తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని, శరీరానికి హాని కలుగుతుందని చాలా మంది నమ్ముతారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఎండాకాలంలో కూడా గుడ్లను ఎంచక్కా తినొచ్చు. కానీ లిమిట్ లోనే తినాలి. అప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. 
 


ఎన్ని గుడ్లు తినాలి?

గుడ్లను తినడం వల్ల మన శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ డి వంటి ఎన్నో పోషకాలు అందుతాయి. అయితే ఎండాకాలంలో రోజుకు 1 నుంచి 2 గుడ్లను తినొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని ఉడకబెట్టి లేదా ఆమ్లేట్ వేసుకుని తినొచ్చు. 

రోగనిరోధక శక్తిని పెంచుతాయి

సరైన మోతాదులో గుడ్లను తింటే మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అలాగే మన శరీరానికి సంబంధించిన సమస్యలతో పోరాడే శక్తి వస్తుంది. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటే అంటువ్యాధులతో పాటుగా ఇతర రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. 
 

బలమైన ఎముకలు

గుడ్లలో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. మీరు గుడ్లను సరైన మొత్తంలో తింటే మీ ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. గుడ్లు దంతాలను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. గుడ్లను రెగ్యలర్ గా తింటే ఎముకలకు సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.
 

కళ్లకు మంచిది

ఎండాకాలంలో కళ్లపై ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. దీంతో కళ్లు అలసటకు గురవుతాయి. అలాగే కంటికి సంబంధించిన సమస్యలు వస్తుంటాయి. అయితే ఎండాకాలంలో రోజూ 1 లేదా 2 గుడ్లను తినడం వల్ల కళ్లకు మేలు జరుగుతుంది. వీటిలో ఉండే గుణాలు కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి.
 

అతిగా తినొద్దు 

ఎండాకాలంలో గుడ్లను మరీ ఎక్కువగా తినొద్దు. ఎందుకంటే ఈ సీజన్ లో గుడ్లను ఎక్కువగా తింటే అజీర్ణం, చంచలత, పేగు వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. ఎండాకాలంలో 1 లేదా 2 కంటే ఎక్కువ గుడ్లు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. 

Latest Videos

click me!