Andrew Symonds death : సెక్సీ క్వీన్ బిపాషాతో సైమండ్స్ ... ఇండియన్ క్రికెట్ తోనే కాదు సినిమాలతోనూ సంబంధాలు

First Published May 15, 2022, 10:49 AM IST

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ అకాలమరణం క్రీడాలోకాన్నే కాదు ఇండియన్ సినీప్రియులను కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది. బాలీవుడ్ లోనూ యాక్టర్ గా ఎంట్రీ ఇచ్చి సైమండ్స్ సినీప్రియులకూ దగ్గరయ్యారు. 

andrew symonds

Andrew Symonds death: ఆసీస్ క్రికెట్ దిగ్గజం, మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ (46) అకాలమృతితో క్రీడాప్రపంచం ధు:ఖసాగరంలో మునిగిపోయింది. విభిన్నమైన వేషధారణ, వినూత్నమైన ఆటతీరుతో క్రికెటర్ గా మంచి గుర్తింపు పొందిన సైమండ్స్ ప్రస్తుతం వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తూ హటాన్మరణం పొందాడు. శనివారం రాత్రి క్వీన్స్ ల్యాండ్ లోని టౌన్స్‌విల్లేలో జరిగిన కారు యాక్సిడెంట్‌లో సైమండ్స్ ప్రాణాలు కోల్పోయాడు.

andrew symonds

రెండుసార్లు వరల్డ్ కప్ సాధించిన ఆస్ట్రేలియా టీంలో సైమండ్స్ ప్లేయర్ గా వున్నాడు. అలాగే ఆస్ట్రేలియా క్రికెటర్ గానే కాకుండా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోనూ తనదైన ఆటతీరుతో భారత అభిమానుల సంపాదించారు. ఇలా కేవలం క్రికెటర్ గా క్రీడా ప్రియులను కాదు బాలీవుడ్ నటుడిగా సినీ ప్రియులను సైతం ఆలరించారు సైమండ్స్. ఇండియన్ సినిమాలతో సైమండ్స్ కు వున్న సంబంధాలను సినీ అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు. 

Andrew Symonds death

చాలామందికి ఆండ్రూ సైమండ్స్ క్రికెటర్ గానే తెలుసు. కానీ ఆయనలో మంచి నటుడు వున్నాడని గుర్తించింది మన సినీలోకమే. పలు బాలీవుడ్ సినిమాల్లో నటించడమే కాదు టీవి షో ల్లోనూ మెరిసి అభిమానులను నటుడిగానూ ఆకట్టుకున్నాడు. భారత ప్రజలను క్రికెటర్ గానే  కాదు నటుడిగానూ ఆకట్టుకున్నాడు. 

Andrew Symonds

ఈ  46 ఏళ్ల మాజీ ఆసిస్ క్రికెటర్ పదేళ్ల క్రితమే బాలీవుడ్ లో ఆరంగేట్రం చేసారు. బాలీవుడ్ దిగ్గజ నటులు అక్షయ్ కుమార్, అనుష్క శర్మ, రిషి కపూర్, డింపుల్ కపాడియా ప్రధాన పాత్రల్లో నటించిన క్రీడా నేపథ్యంలో రూపొందిన ''పటియాలా హౌస్'' సినిమాలో ఈ క్రికెట్ దిగ్గజం నటించాడు. ఈ మూమీలో మంచి ప్రాధాన్యత కలిగిన పాత్రను పోషించి తనలోని నటున్ని సైమండ్స్ పరిచయం చేసారు. ఈ సినిమా 2011లో  విడుదలయ్యింది. 

Andrew Symonds death

తర్వాతి  సంవత్సరం అంట 2012లో సైమండ్స్ మళ్లీ తెరపై కనిపించారు. కానీ ఈసారి వెండితెరపై కాకుండా బుల్లితెరపై బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తో కలిసి కనిపించారు. వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సల్మాన్ ఆహ్వానం మేరకు ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ ఐదో సీజన్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు.  

Andrew Symonds death

 సైమండ్స్ ఎంట్రీతో బిగ్ బాస్ రూల్స్ మొత్తం మారిపోయాయి. కంటెస్టెంట్ ఇంగ్లీష్ మాట్లాడకూడదన్న నిబంధనను సైమండ్స్ కోసం పక్కనపెట్టారు. అయితే ఆయనకు మరో కంటెస్టెంట్ పూజా మిశ్రా ట్రాన్స్ లేటర్ గా వ్యవహరించారు. ఈ  సీజన్ 2012ల ప్రసారంకాగా సైమండ్స్ కోసమే చాలామంది క్రికెట్ అభిమానులు కూడా టీవీలకు అతుక్కుపోయారు.
 

Andrew Symonds

ఇక 2013లో మరోసారి సైమండ్స్ బుల్లితెరపై కనిపించారు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఆయన మరోసారి మెరిసారు. బాలీవుడ్ నటి బిపాషా బసుతో కలిసి అద్భుతమైన డ్యాన్స్ ప్రదర్శన ఇచ్చారు సైమండ్స్. ఇలా ఆయనలోని క్రికెటర్, నటుడే కాదు డ్యాన్సర్ కూడా భారత ప్రజలకు పరిచయమయ్యాడు.  

Andrew Symonds

ఇలా బాలివుడ్ సినిమా, ఇండియన్ టెలివిజన్ స్క్రీన్ పై కనిపించి భారత్ లోనూ చాలామంది అభిమానులను సంపాదించుకున్నారు. వింత వేషధారణ, అత్యుత్తమ క్రికెటర్ గా క్రీడాప్రియులను, నటుడిగా  సినీ ప్రియులను సంపాదించుకున్న సైమండ్స్ ఇకలేరన్న వార్త అందరినీ కలచివేస్తోంది. 

Andrew Symonds

సైమండ్స్ ప్రాణాలు కోల్పోవడంతో కేవలం ఆస్ట్రేలియాలోనే కాదు యావత్ ప్రపంచంలోని క్రికెట్ ప్రియులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇక సైమండ్స్ సహచర ఆటగాళ్ళు, ఆయనతో కలిసి ఆడిన విదేశీ ఆటగాళ్ళు గత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ సైమండ్స్ కు నివాళి అర్పిస్తున్నారు. 

click me!