Tollywood Updates: కాజల్‌కి నచ్చిన పాట.. కార్తికేయ సినిమా రిలీజ్‌ డేట్‌.. సత్యదేవ్‌ చెప్పే `కృష్ణమ్మ` కథ..

By Aithagoni RajuFirst Published May 8, 2024, 6:50 PM IST
Highlights

కాజల్‌కి ఓ పాట నచ్చిందట. ఆదేంటో చెప్పింది. మరోవైపు కార్తికేయ నటిస్తున్న కొత్త సినిమా రిలీజ్‌ డేట్‌ వచ్చింది. ఇంకోవైపు స్నేహం, జీవితం విలువ చెప్పారు సత్యదేవ్‌. 
 

తెలుగు తెర అందాల చందమామ కాజల్‌ సెకండ్‌ ఇన్నింగ్స్ లో దూసుకుపోతుంది. అయితే ఆమె లేడీ ఓరియెంట్‌ చిత్రాలతో అలరించేందుకు వస్తుంది. కానీ తనకి మాత్రం వేరే మూవీ పాట నచ్చిందట. శివ మల్లాల తెలుగులో అందిస్తున్న `సత్య` చిత్రంలోని నిజమా ప్రాణమా ` పాట బాగుందని, తనకు నచ్చిందని చెప్పింది.ఆమె ఈ పాటని విడుదల చేసింది. `సత్య` సినిమా ఈనెల 10న రిలీజ్‌ కానున్న నేపథ్యంలో కాజల్‌ ఈ పాటని రిలీజ్‌ చేసి శివతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంది. టీమ్‌కి అభినందనలు తెలియజేసింది. 

నిర్మాత శివ మల్లాల మాట్లాడుతూ, కాజల్ తో అనుబంధాన్ని పంచుకున్నారు.  `లక్ష్మి కళ్యాణం` సినిమా నుండి పరిచయమని ఆమె ఎదిగిన తీరుని అప్రిషియేట్‌ చేశారు. ఆమె తనకు సపోర్ట్ చేయడం ఆనందంగా ఉందన్నారు. హమరీష్‌, ప్రార్థన జంటగా నటించిన `సత్య` చిత్రానికి వాలి మోహన్‌దాస్‌ దర్శకత్వం వహించారు. తమిళంలో హిట్‌ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో శివ మల్లాల తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. ఈ శుక్రవారం నుంచి సినిమా థియేటర్లోకి రానుంది.  

కార్తికేయ గుమ్మకొండ `భజే వాయు వేగం` రిలీజ్‌ డేట్‌..

కార్తికేయ గుమ్మకొండ `ఆర్‌ఎక్స్ 100` తో ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయిపోయాడు. ఆ తర్వాత ఆ స్థాయి హిట్‌ పడలేదు. ఈ క్రమంలో సక్సెస్‌ కోసం ఆయన స్ట్రగుల్‌ సాగుతూనే ఉంది. తాజాగా `భజే వాయు వేగం` చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్  ఈచిత్రం రూపొందుతుంది. ఐశ్వర్య మీనన్‌ హీరోయిన్‌గా నటించింది. ప్రశాంత్‌ రెడ్డి చంద్రపు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ వచ్చింది.  ఈ నెల 31న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. `హ్యాపీ డేస్` ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషించారు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా "భజే వాయు వేగం" సినిమా రూపొందింది. రేపు (గురువారం) ఉదయం 9.09 నిమిషాలకు సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ `పిచ్చిగా సెట్ అయ్యిందే'ని రిలీజ్‌ చేస్తున్నారు. 

The pitch is ready for the Final Showdown 🏏 hitting theatres Worldwide on May 31st 🎯

Get ready for a CRAZY RIDE 🚘🏁 💥 pic.twitter.com/w5vHrCY4St

— UVConcepts (@UVConcepts_)

స్నేహం, జీవితాల భావోద్వేగ కథే 'కృష్ణమ్మ': సత్యదేవ్  

విలక్షణ నటుడుగా రాణిస్తున్నారు సత్యదేవ్‌. ఆయన తాజాగా `కృష్ణమ్మ` చిత్రంలో హీరోగా నటించారు. వి.వి.గోపాలకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి ఈ మూవీని నిర్మించారు. ఈ నెల 10న రిలీజ్‌ కానుంది. తాజాగా సత్యదేవ్‌ మీడియాతో మాట్లాడుతూ, స్నేహం, జీవితాల విలువని తెలియజేసే చిత్రమిది అన్నారు. `విజయవాడ అంటే పాలిటిక్స్, రౌడీయిజం అని చెప్తారు. కానీ అది కాదు అని చెప్పే కథే ఈ కృష్ణమ్మ. ఇది ముఖ్యంగా ముగ్గురు స్నేహితుల కథ. వాళ్ళ చిన్న జీవితాలు, వాళ్ళకి ఒక మంచి ఫ్యామిలీ ఉండాలి అనుకునే ముగ్గురు ఫ్రెండ్స్. కానీ అలాంటి డ్రీమ్ చెడగొడితే వీళ్ళు ఏం చేశారు అనేదే ఈ మూవీ` అని తెలిపారు సత్యదేవ్‌. రివేంజ్‌ హైలైట్‌గా నిలుస్తుందన్నారు. 
 

click me!