విజయవాడలో ప్రధాని మోదీ రోడ్ షో ... చంద్రబాబు, పవన్ లతో కలిసి ముందుకు...

Published : May 08, 2024, 07:27 PM ISTUpdated : May 08, 2024, 07:32 PM IST
విజయవాడలో ప్రధాని మోదీ రోడ్ షో ...  చంద్రబాబు, పవన్ లతో కలిసి ముందుకు...

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. విజయవాడలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లతో కలిసి ఆయన భారీ రోడ్ షో లో పాల్గొన్నారు. 

విజయవాడ : ప్రధాని నరేంద్ర మోదీ విజయవాడలో రోడ్ షో చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ప్రధాని ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా విజయవాడకు చేరుకున్న ప్రధాని మోదీ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తో కలిసి రోడ్ షో లో పాల్గొన్నారు. విజయవాడ పివిపి మాల్ దగ్గర ప్రారంభమైన ఈ రోడ్ షో  బెంజ్ సర్కిల్ వరకు సాగుతుంది. 

విజయవాడ వాసులే కాదు చుట్టుపక్కల ప్రాంతాలనుండి ప్రధాని మోదీని చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. టిడిపి, జనసేన, బిజెపి కార్యకర్తలు తమ పార్టీజెండాలు చేతబట్టుకుని తమ అభిమాన నాయకులు ముగ్గురు కలిసివస్తుంటే చూసి ఆనందిస్తున్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ మోదీ, చంద్రబాబు, పవన్ ముందుకు కదులుతున్నారు. 

కూటమి నాయకులు ప్రయాణించే వాహనంముందు మహిళలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ముందుకు కదులుతున్నారు. అలాగే మోదీని చూసేందుకు భారీగా మహిళలు తరలివచ్చారు.  తమ అభిమాన నాయకులపై పూలు చల్లుతూ భారీ నినాదాలు చేస్తున్నారు. కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఈ రోడ్ షో సాగుతోంది. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ కంటే హైదరాబాద్ లోనే లోయెస్ట్ టెంపరేచర్స్ .. స్కూల్ టైమింగ్స్ చేంజ్
YS Jagan Sensational Comments: మేము అధికారంలోకి వస్తే వాళ్లందరూ జైలుకే | Asianet News Telugu