సూర్య సునామీ.. సచిన్ టెండూల్కర్, సనత్ జయసూర్య రికార్డులు బ్రేక్

By Mahesh Rajamoni  |  First Published May 8, 2024, 7:16 PM IST

Surya Kumar Yadav's Tsunami Innings : ఐపీఎల్ 2024 55వ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ సూపర్ సెంచరీ ఇన్నింగ్స్ తో ముంబై ఇండియన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై అద్భుతమైన విజయం సాధించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ రికార్డుల మోత మోగించాడు.
 


Surya Kumar Yadav : ఐపీఎల్ 2024 55వ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్  జట్టు ముంబై ఇండియన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై అద్భుతమైన విజయం సాధించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో సూర్యకుమార్  యాదవ్ సూపర్ సెంచరీ (102 పరుగులు) తో దుమ్మురేపాడు. నటరాజన్ బౌలింగ్‌లో సిక్సర్ బాది తన సెంచరీని పూర్తి చేశాడు. ముంబై మరో విజయాన్ని అందించాడు. సూర్య కుమార్ యాదవ్ కేవలం 51 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో సెంచరీ బాదాడు. 200 స్ట్రైక్ రేట్ తన ఇన్నింగ్స్ ను కొనసాగించాడు. తన సెంచరీతో అనేక రికార్డులు బద్దలు కొట్టాడు.

సచిన్-జయసూర్య రికార్డులు బ్రేక్.. 

Latest Videos

ముంబైకి విన్నింగ్స్ సెంచరీతో సూర్యకుమార్ యాదవ్ పలు రికార్డులు బ్రేక్ చేశాడు. ముంబై తరఫున సూర్యకుమార్ రెండో సెంచరీ సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో ముంబై తరఫున అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా రోహిత్ శర్మతో సమానంగా నిలిచాడు. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు. అలాగే,  ముంబై తరఫున అత్యధిక సెంచరీలలో సచిన్ టెండూల్కర్, సనత్ జయసూర్య, లెండిల్ సిమన్స్, కామెరాన్ గ్రీన్‌లను అధిగమించాడు. ఈ ఆటగాళ్లలో ఒక్కొక్కరు ఒక సెంచరీ సాధించారు.

కేెఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్ లతో సమంగా.. 

టీ20 క్రికెట్‌లో భారత్ తరఫున ఆరు సెంచరీలు చేసిన మూడో బ్యాట్స్‌మెన్‌గా సూర్యకుమార్ నిలిచాడు. ఈ విషయంలో రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ లతో సమంగా నిలిచాడు. వీరి కంటే ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఉన్నారు. టీ20 క్రికెట్‌లో కోహ్లీకి 9 సెంచరీలు చేయగా,  రోహిత్ శర్మ 8 సెంచరీలు సాధించాడు. దీంతో పాటు సూర్యకుమార్ నంబర్-4 లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ అత్యధిక టీ20 సెంచరీలు సాధించిన వారిలో రెండో స్థానంలో ఉన్నాడు

ఒకే ఓవ‌ర్ లో 4 4 4 6 4 6.. ఊచ‌కోత‌కు కేరాఫ్ అడ్ర‌స్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్..

అలాగే, తిలక్ వర్మతో కలిసి సూర్యకుమార్ నాలుగో వికెట్‌కు అజేయంగా 143 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఐపీఎల్‌లో ఛేజింగ్ లో నాలుగో లేదా అంతకంటే తక్కువ వికెట్‌కు ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం. ఈ విషయంలో గురుకీరత్ సింగ్, షిమ్రాన్ హెట్మెయర్ మొదటి స్థానంలో ఉన్నారు. ముంబై త‌ర‌ఫున ఇదే అత్య‌ధికం.

143* - తిలక్ వర్మ-సూర్యకుమార్ vs సన్‌రైజర్స్, వాంఖడే, 2024
131* - కోరీ అండర్సన్-రోహిత్ శర్మ vs కేకేఆర్, కోల్‌కతా, 2015
122* - కీరన్ పొలార్డ్ - అంబటి రాయుడు vs ఆర్సీబీ, బెంగళూరు, 2012

టీమిండియా టీ20 ప్రపంచకప్ 2024 జెర్సీలో ఒక్క 'స్టార్' మాత్ర‌మే ఎందుకు ఉంది?

click me!