శ్రీరెడ్డి నెక్ట్స్ టార్గెట్ నేనే.. విశాల్

First Published Jun 13, 2018, 2:03 PM IST
Highlights

శ్రీరెడ్డి వివాదంపై స్పందించిన విశాల్

యాంకర్, నటి శ్రీరెడ్డి .. హీరో నానిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై ఇప్పటికే నాని.. శ్రీరెడ్డికి లీగల్ నోటీసులు కూడా జారీ చేశారు. కాగా.. తాజాగా ఈ విషయంపై హీరో  విశాల్ స్పందించారు.

‘నాకు నాని గురించి తెలుసు. అతను నాకు మంచి స్నేహితుడు. వ్యక్తిగత కారణాల వల్ల నేను నానికి మద్దతు తెలపడంలేదు. కానీ నానిపై శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు వివాదాస్పదం. నాని గురించి తెలిసిన వారికి అతను మహిళల పట్ల ఎంత మర్యాదగా ప్రవర్తిస్తారో తెలుసు. ఒకవేళ శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉంటే కేవలం పేర్లు బయటపెడితే సరిపోదు. ఆధారాలు చూపించాలి. ఆమె వ్యాఖ్యల్ని బట్టి చూస్తే ఇతరులను ఇష్టం వచ్చినట్లు టార్గెట్ చేస్తోందని అర్థమవుతోంది. మున్ముందు నన్ను కూడా టార్గెట్‌ చేస్తుందేమో. కాబట్టి ఇలాంటి ఆరోపణలు చేసినప్పుడు అందుకు తగ్గ ఆధారాలు కూడా చూపించాలి. మన దేశంలో లైంగిక వేధింపుల నిరోధానికి సరైన చట్టాల్లేవు. ఏ మహిళైనా ఇతరులపై ఆరోపణలు చేస్తే చట్టం దానిని మాత్రమే పరిగణలోకి తీసుకుని ఆరోపణలు చేసేవారికే మద్దతు ఇస్తోంది. ఇది సరైనది కాదు.’

‘తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో ఓ వ్యక్తి తనకు తాను నిర్మాతనని చెప్పుకుని ఆడవాళ్లను ఆడిషన్లకు రమ్మంటాడు. అలా ఆడిషన్ పేరుతో ఆడపిల్లల్ని మోసం చేయడం చాలా తప్పు. చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉందని ఒప్పుకుంటాను. కానీ దాని అర్థం పేరున్న వ్యక్తులను టార్గెట్‌ చేస్తూ వారిపై ఆరోపణలు చేయమని కాదు’ అని వెల్లడించారు విశాల్‌.

click me!