నవీన్‌ చంద్రతో కాజల్ రొమాంటిక్‌ డేట్‌.. హత్తుకునేలా `సత్యభామ`లో `కళ్లారా చూసాలే` సాంగ్‌..

By Aithagoni RajuFirst Published Apr 25, 2024, 8:04 PM IST
Highlights

కాజల్‌ అగర్వాల్‌ లేడీ ఓరియెంటెడ్‌ మూవీ `సత్యభామ`లో నటిస్తుంది. ఈ మూవీ నుంచి మొదటి పాట విడుదలైంది. ఇందులో కాజల్‌.. నవీన్‌ చంద్రతో కలిసి రొమాంటిక్‌ డేట్‌కి వెల్లడం విశేషం. 
 

కాజల్‌ అగర్వాల్‌ పెళ్లి చేసుకుని ఓ కుమారుడికి జన్మనిచ్చింది. కొడుకు నీల్‌ కిచ్లు, భర్త గౌతమ్‌ కిచ్లుతో ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కాజల్‌.. యంగ్‌ హీరో నవీన్‌ చంద్రతో రొమాంటిక్‌ డేట్‌కి వెళ్లడం విశేషం. అంతేకాదు కాజల్‌ని చూసిన నవీన్‌.. గతాన్ని గుర్తు చేసుకున్నాడు. యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో ఆమెలోని సింగింగ్‌ టాలెంట్‌కి పడిపోయాడట. ఆ విషయాన్ని కాజల్‌కి వెల్లడించారు. 

ఇద్దరు కలిసి కారులో షికారుకి వెళ్లే సమయంలో తన మనసులో మాట బయటపెట్టాడు నవీన్‌ చంద్ర. దీంతో ప్రియుడి కోసం గొంతు సవరించుకుంది. అద్బుతమైన గాత్రంతో హృదయాన్ని హత్తుకునేలా మధురమైన పాటని ఆలపించింది. ఇప్పుడు ఆ పాట ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుంది. మరి ఈ కథ ఏంటి? కాజల్‌ పాట పాడటమేంటి? అనేది చూస్తే.. 

కాజల్‌ సెకండ్‌ ఇన్నింగ్స్ లో లేడీ ఓరియెంటెడ్‌ మూవీ `సత్యభామ`లో నటిస్తున్న విషయం తెలిసిందే. నవీన్‌ చంద్ర ఇందులో కాజల్‌కి జోడీగా నటించాడు. ఈ మూవీ గ్లింప్స్, టీజర్లు ఆకట్టుకున్నాయి. తాజాగా గురువారం ఫస్ట్ సింగిల్‌ విడుదలైంది. `కళ్లారా చూసాలే` అంటూ సాంగే ఈ పాట ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ పాటకు ముందు కాజల్‌, నవీన్‌ చంద్రల మధ్య జరిగిన కన్వర్జేషన్‌ ఆసక్తికరంగా ఉంది. కాలేజ్‌ డేస్‌లో కాజల్‌ ఈ పాట పాడినప్పుడు ఆ వాయిస్‌ విని ఆమెకి పడిపోయాడట నవీన్‌. కారులో వెళ్తున్న సమయంలో కాజల్‌కి ఈ విషయం చెప్పగా ఆమె మళ్లీ ఈ పాటని పడటం విశేషం. 

ఈ పాటను బ్యూటిఫుల్ మెలొడీగా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల కంపోజ్ చేశారు. రాంబాబు గోసాల లిరిక్స్ అందించగా.. క్వీన్ ఆఫ్ మెలొడీ శ్రేయా ఘోషల్ పాడారు. 'కళ్లారా చూసాలే.. నువ్వేనా నువ్వే నేనా, గుండెల్లో దాచాలే నిన్నేనా నా నిన్నేనా నీ ఊహల గుస గుస పదనిసలై ఉయ్యాలే ఊపేనా నీ ఊసుల మధురిమ హృదయమునే మైకంలో ముంచేసేనా' పాట సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని టీమ్‌ తెలిపింది. 

కాజల్‌, నవీన్‌ చంద్ర జంటగా నటిస్తున్న `సత్యభామ` మూవీకి సుమన్‌ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు శశి కిరణ్‌ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ, స్క్రీన్‌ ప్లే అందిస్తున్నారు. క్రైమ్‌ థ్రిల్లర్‌ కథతో ఈ మూవీ రూపొందుతుంది. మే 17న ఈ మూవీని విడుదల చేయబోతున్నారు. 
 

click me!