తెగ నవ్వించిన మహేష్, రాజేంద్రప్రసాద్,అనీల్ రావిపూడి డైరక్షన్ ... చూసారా?

Published : Apr 25, 2024, 06:53 PM IST
 తెగ నవ్వించిన మహేష్, రాజేంద్రప్రసాద్,అనీల్ రావిపూడి డైరక్షన్ ... చూసారా?

సారాంశం

  కామెడీని హైలైట్ చేశారు. ఈ యాడ్‌ను టాలీవుడ్ యువ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేశారు.  


మహేష్ బాబు,రాజేంద్రప్రసాద్ కామెడీ టైమింగ్స్ ఇద్దరివీ డిఫరెంటే. ఇద్దరూ ఇరక్కొడుతూంటారు. ఇక ఇద్దరు కలిసి ఒకే ఫ్రేమ్ లో కామెడీ పండిస్తే అది అభి బస్ యాడ్ అవుతుంది. వీళ్లిద్దరు కలిసి అనీల్ రావిపూడి డైరక్షన్ లో ఈ యాడ్స్ తయారయ్యాయి. 
 

ఇప్ప‌టికే ఎన్నో యాడ్స్ లో  ప్రిన్స్‌ మహేష్ బాబును చూశాం.  తాజాగా రాజేంద్రప్రసాద్‌తో కలిసి అభిబస్ కోసం ఓ రెండు కొత్త యాడ్స్ చేశారు. ఎక్కడికి వెళ్లాలన్నా, ఎప్పుడైనా అనే కాన్సెప్ట్‌తో అభిబస్ యాడ్ చేశారు. ఈ రెండు యాడ్స్ లోనూ  కామెడీని హైలైట్ చేశారు. ఈ యాడ్‌ను టాలీవుడ్ యువ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేశారు. గతంలోనే ఈ యాడ్  తాలూకు ఓ వర్కింగ్ స్టిల్‌ను ఆయ‌న‌ షేర్ చేయ‌డం జ‌రిగింది. ప్రస్తుతం మహేశ్‌ బాబు కొత్త యాడ్స్ తాలూకు వీడియోలు నెట్టింట‌ వైరల్ అవుతున్నాయి. 

 

ప్ర‌స్తుతం మ‌హేశ్ బాబు ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా కోసం సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రంలో మ‌హేశ్ పూర్తి డిఫ‌రెంట్ లుక్‌లో క‌నిపించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. దీనికి త‌గ్గ‌ట్టుగా త‌న శ‌రీర ఆకృతిని మార్చుకునే ప‌నిలో సూప‌ర్ స్టార్ ఉన్నారు. దీనిలో భాగంగా రాజ‌మౌళి సూచ‌న మేర‌కు ఇప్ప‌టికే విదేశాల‌కు కూడా వెళ్లొచ్చారు. కాగా, ఈ సినిమా ఓ అడ్వెంచర్ డ్రామాగా ఉండ‌బోతుంద‌ని ర‌చ‌యిత విజేంద్ర‌ప్ర‌సాద్ ఇప్ప‌టికే వెల్ల‌డించారు.

 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే
Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి