కొత్త డైరెక్టర్‌తో మెగాహీరో సినిమా?.. ప్రొడ్యూస్‌ చేస్తున్న `హనుమాన్‌` నిర్మాత

Published : Apr 25, 2024, 02:03 PM IST
కొత్త డైరెక్టర్‌తో మెగాహీరో సినిమా?.. ప్రొడ్యూస్‌ చేస్తున్న `హనుమాన్‌` నిర్మాత

సారాంశం

మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌( సాయిదుర్గ తేజ్‌) కొత్త సినిమా ఫైనల్‌ అయ్యింది. ఓ కొత్త దర్శకుడితో రాబోతున్నాడు. త్వరలోనే ఈ మూవీని ప్రారంభించబోతున్నారు.   

మెగా ఫ్యామిలీలో యంగ్‌ హీరోలకు కాలం కలిసి రావడం లేదు. వారి సినిమాలు ఆగిపోవడం, లేదంటే ఫెయిల్ అవ్వడమే జరుగుతున్నాయి. వరుణ్‌ తేజ్‌ని వరుస పరాజయాలు వెంటాడుతున్నాయి. వైష్ణవ్‌ తేజ్‌కి మొదటి సినిమా తప్ప మిగిలిన అన్నీ ఫ్లాప్‌ అయ్యాయి. అల్లు శిరీష్‌కి సినిమాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇక సాయిధరమ్‌ తేజ్‌ గతేడాది ఏడాదిపాటు బ్రేక్‌ తీసుకున్నట్టు వెల్లడించారు. 

అయితే అప్పటికే ఆయన సంపత్‌ నందితో `గంజా శంకర్‌` చిత్రాన్ని ప్రకటించారు. టీజర్‌ కూడా వచ్చింది. కానీ ఈ మూవీ ఆగిపోయిందట. బడ్జెట్‌ కారణంగా ఈ మూవీని పక్కన పెట్టినట్టు సమాచారం. మరి సాయిధరమ్‌ చేయబోతున్న సినిమా ఏంటి? ఎవరితో నెక్ట్స్ ఉంటుందనేది ఆసక్తికరంగా, సస్పెన్స్ గా మారింది. ఈనేపథ్యంలో ఇప్పుడు ఓ మెగా ఫ్యాన్స్ కి గుడ్‌ న్యూస్‌ బయటకు వచ్చింది. తాజాగా సాయిధరమ్‌ తేజ్‌కొత్త సినిమా ఓకే అయ్యిందట. 

ఓ కొత్త దర్శకుడితో మూవీ చేయబోతున్నారట సాయి. రోహిత్‌ అనే కొత్త కుర్రాడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ మూవీ చేస్తున్నారు. దీనికి `హనుమాన్‌` ఫేమ్‌ నిరంజన్‌ రెడ్డి భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించనున్నారు. జూన్‌ నుంచి ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభించనున్నారట. అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమా కథ, కాస్టింగ్‌ వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇక సాయిధరమ్‌ తేజ్‌ చివరగా `బ్రో` చిత్రంతో వచ్చాడు. తన మామయ్య పవన్‌ కళ్యాణ్‌తో కలిసి నటించిన చిత్రమిది. సముద్రఖని దర్శకత్వం వహించారు. కాలం విలువని తెలియజేసే కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది. కానీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఆ సమయంలోనే బ్రేక్‌ని ప్రకటించారు సాయి తేజ్‌. అంతకు ముందు ఆయన బైక్‌ యాక్సెడెంట్‌కి గురైన విషయం తెలిసిందే. చావు అంచుకు వెళ్లి ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ఆ అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకునేందుకు సాయితేజ్‌ ఈ బ్రేక్‌ తీసుకున్నారు. 

ఇదిలా ఉంటే ఈ మధ్య సాయితేజ్‌ తన పేరుని మార్చుకున్నాడు. తన అమ్మ పేరు వచ్చేలా `సాయిదుర్గ తేజ్‌`గా మార్చుకున్నట్టు ఇటీవల `సత్య` షార్ట్ ఫిల్మ్ ప్రదర్శన సమయంలో వెల్లడించాడు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే
Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి