ఎన్టీఆర్ కొడితే కిందపడిపోయిన వేళ.. సావిత్రి, విజయనిర్మల మధ్య రిలేషన్!

Published : Jun 27, 2019, 02:30 PM ISTUpdated : Jun 27, 2019, 02:36 PM IST
ఎన్టీఆర్ కొడితే కిందపడిపోయిన వేళ.. సావిత్రి, విజయనిర్మల మధ్య రిలేషన్!

సారాంశం

ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. దీనితో కృష్ణ కుటుంబంతో పాటు చిత్ర పరిశ్రమ కూడా విషాదంలో మునిగిపోయింది.దీనితో విజయనిర్మల నటిగా, దర్శకురాలిగా సాధించిన విజయాలని అంతా గుర్తుచేసుకుంటున్నారు.

ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. దీనితో కృష్ణ కుటుంబంతో పాటు చిత్ర పరిశ్రమ కూడా విషాదంలో మునిగిపోయింది.దీనితో విజయనిర్మల నటిగా, దర్శకురాలిగా సాధించిన విజయాలని అంతా గుర్తుచేసుకుంటున్నారు. 200పైగా చిత్రాల్లో నటించిన విజయనిర్మల, 44 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఏకైక మహిళగా గిన్నిస్ రికార్డు సృష్టించారు. 

తెలుగు వెండితెర దిగ్గజం సావిత్రితో విజయనిర్మలకు మంచి సాన్నిహిత్యం ఉంది. విజయనిర్మల దర్శకత్వం వహించిన కవిత చిత్రంలో సావిత్రి నటించారు. ఇందులో విజయనిర్మలకు సావిత్రి తల్లి పాత్రలో నటించారు. విచిత్ర కుటుంబం చిత్రంలో అక్కా చెల్లెళ్లుగా నటించారు. అలా సావిత్రి అక్కకు కూతురిగా, చెల్లిగా నటించే అవకాశం తనకు దక్కిందని పలు సందర్భాల్లో విజయనిర్మల గుర్తుచేసుకున్నారు. 

ఓ సందర్భంలో విచిత్ర కుటుంబం చిత్రాన్ని గుర్తిచేసుకుంటూ విజయనిర్మల ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆ చిత్రంలో నేను ఎన్టీఆర్ కు మరదలిని. ఆయన నన్ను ఆటపట్టిస్తూ వీపుపై కొట్టే సన్నివేశం ఒకటి ఉంది. ఎన్టీఆర్ గారు పాత్రలో లీనమైపోయి నిజంగానే కొట్టేశారు. దెబ్బకు కింద పడ్డాను. వెంటనే సావిత్రి అక్క నన్ను పైకి లేపింది. అంత బలహీనంగా ఉంటే ఎలాగమ్మా.. కాస్త తిని నాలాగా ఉండాలి అని చెప్పింది. 

సావిత్రక్క చివరిరోజుల్లో ఆమెని చూసి తల్లడిల్లిపోయాను. ఆయనవారి చేతిలోనే మోసపోయిన తర్వాత మొదట ఆమెకు షుగర్ వ్యాధి వచ్చింది. ఇక నేను సినిమాలు చేయలేనురా అని నాతో అన్నారు. సావిత్రక్క అనారోగ్యానికి గురైన తర్వాత ఆమెని బెంగుళూరు నుంచి మద్రాసు తరలించారు. ఆమెని కోమాలో ఉన్న సమయంలో చూసి నా  హృదయం తల్లడిల్లిపోయింది విజయనిర్మల అన్నారు. సావిత్రి, విజయ నిర్మల ఇద్దరూ చిత్ర పరిశ్రమలో మహిళలకు ఆదర్శంగా నిలిచిన వారే. 

 

మహిళలకు ఆమె స్ఫూర్తిగా నిలిచారు: పవన్ కళ్యాణ్

ప్రముఖ సినీ నటి, దర్శకురాలు విజయనిర్మల కన్నుమూత

ఆ సినిమా కారణంగా కలిసిన కృష్ణ-విజయనిర్మల!

అప్పట్లో విజయనిర్మలవన్నీ మగవేషాలే..!

విజయనిర్మల మృతిపై మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్!

ఆమె మరణం పరిశ్రమకి తీరనిలోటు.. వైఎస్ జగన్!

విజయనిర్మల.. జయసుధకి ఏమవుతుందో తెలుసా..?

విజయనిర్మలగారిని ఎవరితోనూ పోల్చలేం: జీవితా రాజశేఖర్

ఆమె మరణవార్త కలచివేసింది.. ఎన్టీఆర్ కామెంట్స్!

ఆ రికార్డ్ కృష్ణ-విజయనిర్మలకే సొంతం!

ఎప్పుడు పోయినా.. అది గురువారం నాడే!

PREV
click me!

Recommended Stories

రవితేజ సంచలన నిర్ణయం, మాస్ మహారాజా ట్యాగ్ ను దూరం పెట్టిన స్టార్ హీరో?
Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?