వేణుమాధవ్‌ మరణం ఇండస్ట్రీకి తీరని లోటు.. రాజశేఖర్ కామెంట్స్!

By AN TeluguFirst Published Sep 25, 2019, 5:07 PM IST
Highlights

టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న వేణుమాధవ్ కిడ్నీ సంబంధిత వ్యాధితో కొద్దిసేపటి క్రితం  కన్నుమూశారు.
 

ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్‌ మరణం ఇండస్ట్రీకి తీరని లోటని ప్రముఖ కథానాయకుడు, యాంగ్రీ స్టార్‌ రాజశేఖర్‌ అన్నారు. వేణుమాధవ్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అతనితో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.వేణుమాధవ్‌ తమ కుటుంబానికి ఎంతో సన్నిహిత మిత్రుడని.. తనను బావా అని పిలిచేవాడని అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. ''ప్రతి పండక్కి తప్పకుండా ఫోన్‌ చేసేవాడు. అంతకు ముందే మెసేజ్‌ చేసి విష్‌ చేసేవాడు. మేమంటే తనకు అంత అభిమానం, ప్రేమ. మేమిద్దరం కలిసి సుమారు పది చిత్రాల్లో నటించాం. ‘మనసున్న మారాజు’, ‘రాజ సింహం’, ‘ఒక్కడు చాలు’, ‘గోరింటాకు’ చిత్రాల్లో తన నటనకు, హాస్యానికి మంచి పేరు వచ్చింది. ప్రతి ఒక్కరినీ వరుసలు పెట్టి పిలుస్తూ కుటుంబంలా కలుపుకుని వెళ్లేవారు. అంత మంచి మనిషి ఇంత త్వరగా లోకాన్ని విడిచి వెళతాడని అనుకోలేదు'' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

‘మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌’ (మా) ఎన్నికల సమయంలో వేణుమాధవ్‌కి ఆరోగ్యం బాలేదట కానీ ఆ విషయాన్ని ఎవరికీ తెలియన్విలేదని.. సాటి కళాకారుల కోసం ముందడుగు వేశారని.. ఎన్నికల్లో విజయం సాధించారని అన్నారు. 

వేణుమాధవ్ మృతికి మహేష్ బాబు సంతాపం!

వేణుమాధవ్ జీవితాన్ని మార్చేసిన సంఘటన.. తొలి పారితోషికం ఎంతంటే!

మెగాస్టార్ కోసం రూల్ బ్రేక్ చేసిన వేణుమాధవ్!

'అప్పట్లో భుట్టో.. ఇప్పుడు ముషారఫ్'.. వేణుమాధవ్ మృతికి ప్రముఖుల సంతాపం!

బ్రేకింగ్: హాస్య నటుడు వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి విషమం!

బ్రేకింగ్: ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత!

బూతులు ఉన్నాయనే సినిమాలు చేయలేదు.. వేణుమాధవ్!

ఛాన్సుల కోసం ఎవరినీ అడుక్కోను.. వేణుమాధవ్ కామెంట్స్!

కాలు మీద కాలేసి కూర్చున్నానని.. ఆ స్టార్ హీరో.. : వేణుమాధవ్!

వేణుమాధవ్ యూ టర్న్ రోల్స్.. నల్లబాలు నల్ల తాచు లెక్క

అభిమానుల సందర్శనార్ధం వేణుమాధవ్ పార్థివదేహం.. రేపే అంత్యక్రియలు

వేణుమాధవ్ కి ఎంత ఆస్తి ఉందో తెలుసా..?

వేణుమాధవ్ ఇంటిపై ఉండే దర్శకుల పేర్లు ఎవరివంటే..?

click me!