MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Raj Nidimoru: సమంత భర్తను ముద్దుగా ఏమని పిలుస్తుందో తెలుసా? రాజ్ నిడిమోరు నిక్ నేమ్ ఏంటంటే?

Raj Nidimoru: సమంత భర్తను ముద్దుగా ఏమని పిలుస్తుందో తెలుసా? రాజ్ నిడిమోరు నిక్ నేమ్ ఏంటంటే?

ప్రస్తుతం మా ఇంటి బంగారం సినిమా సక్సెస్ జోష్ లో ఉంది సమంత. భర్తతో కలిసి సంబరాలు చేసుకుంటుంది. ఈ క్రమంలో ఓ గుడ్ న్యూస్ కూడా సమంత చెప్పకనే చెప్పింది. సమంత తన భర్త రాజ్ నిడిమోరుని ముద్దుగా ఏమని పిలుస్తుందో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 26 2026, 08:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రెండు శుభవార్తలు చెప్పిన సమంత..
Image Credit : Instagram, X

రెండు శుభవార్తలు చెప్పిన సమంత..

తన అభిమానులకు డబుల్ ఖుషీ అయ్యేలా.. రెండు గుడ్ న్యూస్ లను అందించింది సమంత. మా ఇంటి బంగారంతో ఒకవైపు ప్రొఫెషనల్ లైఫ్‌లో భారీ సక్సెస్, మరోవైపు పర్సనల్ లైఫ్‌లో ఎవరూ ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన సామ్.. చాలా కాలం తర్వాత ఆనందంతో పొంగిపోయింది. సంతోషకరమైన జీవితాన్ని ఆస్వాదిస్తోంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత చాలా కృంగిపోయిన సమంత.. డైరెక్టర్ రాజ్ నిడిమోరును ప్రేమించి, పెళ్లాడి హ్యాపీగా జీవిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
భర్త రాజ్ ను సమంత ముద్దుగా ఏమని పిలుస్తుందో తెలుసా?
Image Credit : Asianet News

భర్త రాజ్ ను సమంత ముద్దుగా ఏమని పిలుస్తుందో తెలుసా?

రీసెంట్ గా మా ఇంటిబంగారు సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది సమంత. ఈమూవీ సూపర్ హిట్ అవ్వడంతో.. రీసెంట్ గా సక్సెస్ మీట్ కూడా పెట్టింది. ఈ సక్సెస్ మీట్‌లో సమంత తన భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు గురించి ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. మా ఇంటి బంగారం సినిమాలో సమంత తన ఆన్ స్క్రీన్ భర్త అనిరుధ్ క్యారెక్టర్‌ను ముద్దుగా ‘’అని'' అని పిలుస్తుంది. మరి నిజ జీవితంలో తన భర్త రాజ్ ను ముద్దుగా ఏమనిపిలుస్తుంది? రాజ్ నిక్ నేమ్ ఏంటి అనే ప్రశ్న ఆమెకు ఎదురయ్యింది. 

యాంకర్.. సమంతను సరదాగా ప్రశ్నించారు. దీనికి సమంత సిగ్గుపడుతూ.. ఎంతో మురిసిపోతూ సమాధానమిచ్చింది. "రాజ్ వాళ్ల అమ్మగారు, చెల్లి ఇంట్లో తనను ఎంతో ప్రేమగా 'బాబు' అని పిలుస్తారు. వాళ్లలాగే నేను కూడా రాజ్‌ను ఎప్పుడూ 'బాబు' అని పిలుస్తుంటాను" అని నవ్వుతూ చెప్పింది. ప్రస్తుతం ఈ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Related Articles

Related image1
Uma Telugu Traveller: 100 దేశాలు తిరిగిన యూట్యూబర్ ఉమా తెలుగు ట్రావెలర్ నెల సంపాదన ఎంతో తెలసా?
Related image2
Trisha Home: 10 కోట్ల త్రిష ఇల్లు చూశారా..? లగ్జరీ హౌస్ లో ఎవరెవరు ఉంటారంటే?
34
అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన సామ్..
Image Credit : Asianet News

అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన సామ్..

సినిమా సక్సెస్‌తో తో పాటు అభిమానులకు సమంత మరో గుడ్ న్యూస్ కూడా చెప్పింది. తాను త్వరలో తల్లిని కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్ లో జరిగిన 'మా ఇంటి బంగారం' సక్సెస్ మీట్‌ ఈవెంట్ లో పాల్గొన్న సమంత మాట్లాడుతూ.. తాను ప్రెగ్నెంట్ అని, తన జీవితంలోకి కొత్త అతిథి రాబోతున్నారని సంతోషంగా వెల్లడించింది. ఈ వార్త విన్న వెంటనే అక్కడున్న వారంతా చప్పట్లతో, కేరింతలతో ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఒక్క ప్రకటనతో ఆమె అభిమానుల ఆనందం రెట్టింపు అయింది.

44
మా ఇంటి బంగారం బాక్సాఫీస్ ప్రభంజనం
Image Credit : Asianet News

మా ఇంటి బంగారం బాక్సాఫీస్ ప్రభంజనం

దాదాపు మూడేళ్ల గ్యాప్ తరువాత మా ఇంటి బంగారం సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది సమంత. ఈసినిమా జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ రికార్డుల వర్షం కురిపిస్తోంది. సెంటిమెంట్, ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో సమంత నటనకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. రిలీజ్ అయిన వారం రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
సమంత రూత్ ప్రభు
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 10 Movies: అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన టాప్‌ 10 మూవీస్‌.. టాక్సిక్‌ ఉందా?.. టాలీవుడ్‌ దే హవా
Recommended image2
Rajinikanth Net Worth : తలైవా ఆస్తి ఎంతో తెలుసా?
Recommended image3
Irumudi: ఇరుముడి మూవీకి చిరంజీవి రివ్యూ, ఇండస్ట్రీ ఏ కొందరిదో కాదు..మెగాస్టార్ నుంచి అస్సలు ఊహించని కామెంట్
Related Stories
Recommended image1
Uma Telugu Traveller: 100 దేశాలు తిరిగిన యూట్యూబర్ ఉమా తెలుగు ట్రావెలర్ నెల సంపాదన ఎంతో తెలసా?
Recommended image2
Trisha Home: 10 కోట్ల త్రిష ఇల్లు చూశారా..? లగ్జరీ హౌస్ లో ఎవరెవరు ఉంటారంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved