MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • Chiru To NTR: చిరంజీవి నుంచి ఎన్టీఆర్ వరకు, పాత బిరుదులు పక్కన పెట్టేసిన హీరోలు.. ఆ ఇద్దరికీ అదొక పీడకల

Chiru To NTR: చిరంజీవి నుంచి ఎన్టీఆర్ వరకు, పాత బిరుదులు పక్కన పెట్టేసిన హీరోలు.. ఆ ఇద్దరికీ అదొక పీడకల

టాలీవుడ్ హీరోలని అభిమానులు బిరుదులతో ప్రేమగా పిలుస్తుంటారు. అయితే ఆ బిరుదులు ఎక్కువ కాలం ఉండవు. ప్రారంభంలో ఉన్న బిరుదులని మార్చేసి కొత్త బిరుదులు పెట్టుకుంటూ ఉంటారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 26 2026, 07:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
టాలీవుడ్ హీరోల బిరుదులు
Image Credit : Asianet News

టాలీవుడ్ హీరోల బిరుదులు

టాలీవుడ్ స్టార్ హీరోలని అభిమానులు వారి బిరుదులతో పలకరిస్తూ మురిసిపోతుంటారు. చిరంజీవికి మెగాస్టార్, మహేష్ బాబు సూపర్ స్టార్ ఇలా టాలీవుడ్ అగ్ర హీరోలందరికీ ఏదో ఒక బిరుదు ఉండనే ఉంది. చాలామంది హీరోలకు ప్రారంభంలో ఉన్న బిరుదులు మారిపోయాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
చిరంజీవి
Image Credit : Asianet News

చిరంజీవి

చిరంజీవికి హీరోగా క్రేజ్ వచ్చాక సూపర్ హీరో అనే బిరుదు ఇచ్చారు. చాలా కాలం పాటు అభిమానులు చిరంజీవిని సుప్రీం హీరో అని పిలుస్తూ మురిసిపోయేవారు. ఆ తర్వాత మరణ మృదంగం చిత్రం నుంచి సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ గా చిరు మారారు. మెగాస్టార్ బిరుదు వచ్చిన తర్వాత చిరంజీవి క్రేజ్ ఇంకా రెట్టింపు అయింది. టాలీవుడ్ లో చిరు ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగారు.

38
బాలకృష్ణ
Image Credit : Asianet News

బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణని అభిమానులు ముగ్గుగా యువరత్న అని పిలుస్తారు. ఆ తర్వాత యువరత్న నుంచి ఆయన బిరుదు నటసింహంగా మారింది. ఇప్పుడు గాడ్ ఆఫ్ మాసెస్ అని కూడా అంటున్నారు.

48
నాగార్జున
Image Credit : Asianet News

నాగార్జున

అక్కినేని నాగార్జునకి ప్రారంభంలో యువ సామ్రాట్ అనే బిరుదు ఇచ్చారు. చాలా కాలం అదే బిరుదు కొనసాగించారు. కింగ్ మూవీ విజయం తర్వాత యువసామ్రాట్ నాగార్జున.. కింగ్ నాగార్జునగా మారారు. కింగ్ అనే బిరుదు నాగ్ కి అంతగా కలసి రాలేదు అనే చెప్పాలి. ఆ తర్వాత నాగ్ కెరీర్ లో ఎక్కువగా విజయాలు దక్కలేదు.

58
మహేష్ బాబు
Image Credit : Instagram

మహేష్ బాబు

మహేష్ బాబు టాలీవుడ్ లో భారీ సంఖ్యలో అభిమానులని సొంతం చేసుకున్న హీరోల్లో ఒకరు. ప్రారంభంలో మహేష్ బాబుకి ప్రిన్స్ అనే టైటిల్ ఇచ్చారు. పోకిరి చిత్రం తిరుగులేని ఇండస్ట్రీ హిట్ గా రికార్డ్స్ క్రియేట్ చేసింది. దీనితో ప్రిన్స్ ప్లేస్ లో సూపర్ స్టార్ టైటిల్ వచ్చింది. సూపర్ స్టార్ టైటిల్ మహేష్ కి బాగానే కలసి వచ్చింది. సినిమా సినిమాకి మహేష్ రేంజ్ పెరుగుతూనే ఉంది.

68
జూనియర్ ఎన్టీఆర్
Image Credit : youtube

జూనియర్ ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ నందమూరి వారసుడిగా ఒక సునామీలా టాలీవుడ్ లోకి దూసుకువచ్చారు. తారక్ కి అభిమానులు ప్రేమగా యంగ్ టైగర్ అని పవర్ ఫుల్ టైటిల్ ఇచ్చారు. అయితే శక్తి చిత్రంలో యంగ్ టైగర్ తీసేసి ఎ 1 స్టార్ అని వేశారు. శక్తి మూవీ ఊహకందని డిజాస్టర్ గా నిలిచింది. శక్తి మూవీ ఎన్టీఆర్ కెరీర్ లో ఒక పీడకల అనే చెప్పాలి. దీనితో తారక్ ఇమ్మీడియట్ గా ఎ 1 స్టార్ అనే బిరుదుని డ్రాప్ చేసి యంగ్ టైగర్ ని కొనసాగించారు. ఎ 1 స్టార్ అనేది మూన్నాళ్ళ ముచ్చటగా మిగిలింది. ఇప్పుడు తారక్ ని అభిమానులు మాన్ ఆఫ్ మాసెస్ అని కూడా అంటున్నారు.

78
రాంచరణ్
Image Credit : X

రాంచరణ్

మగధీర మూవీ తర్వాత రాంచరణ్ కి అభిమానులు మెగా పవర్ స్టార్ అనే బిరుదు ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ మూవీతో అంతర్జాతీయ స్టేజీలపై రాంచరణ్ పేరు మారుమోగింది. దీనితో గ్లోబల్ స్టార్ అని పిలవడం ప్రారంభించారు. గేమ్ ఛేంజర్ లాంటి డిజాస్టర్ మూవీ పడడంతో రాంచరణ్ గ్లోబల్ స్టార్ అనే బిరుదుని డ్రాప్ చేశారు.

88
అల్లు అర్జున్
Image Credit : Allu Arjun/ Instagram

అల్లు అర్జున్

ఆర్య, గంగోత్రి, బన్నీ లాంటి సూపర్ హిట్స్ తర్వాత అల్లు అర్జున్ కి స్టైలిష్ స్టార్ అనే బిరుదు వచ్చింది. ఇటీవల అల్లు అర్జున్ దానిని మార్చేసి ఐకాన్ స్టార్ అని పెట్టుకున్నారు. పుష్ప సిరీస్ భారీ విజయంతో అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా ఎదిగారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
మహేష్ బాబు ఘట్టమనేని
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ranveer Singh: బాక్సాఫీస్ వద్ద అసలైన 'ధురంధర్' రణ్‌వీర్ సింగ్.. ఈ 5 కారణాలే ప్రూఫ్!
Recommended image2
Jason Sanjay: నాన్న సీఎంగా బిజీ, అందుకే ఇన్వాల్వ్ కాలేదు.. కానీ సిగ్మా కోసం ఎదురుచూస్తున్నారు
Recommended image3
Disha Patani Outfit Controversy: దేవుడి దగ్గర ఈ ఎక్స్‌పోజింగ్ అవసరమా? దిశా పటానీపై నెటిజన్ల ఫైర్
Related Stories
Recommended image1
July Telugu Movies: నాగబంధం నుంచి రావు బహదూర్ వరకు, జూలై లో క్రేజీ సినిమాల సందడి.. అఖిల్ కి గట్టి పోటీ
Recommended image2
ANR: శ్రీరామదాసు మూవీ చూసి మైమరచిపోయిన ఏఎన్నార్ దంపతులు, ఆమెని మాత్రమే ఇంటికి పిలిచి ఏం చేశారో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved