‘ఎన్టీఆర్ 30’ షూటింగ్ కు అంతా సిద్ధం.. డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్.. స్ట్రాంగ్ బజ్.!

By team teluguFirst Published Aug 21, 2022, 12:36 PM IST
Highlights

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషనల్ లో వస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్ 30’. ఈ చిత్రం ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందోనని ఫ్యాన్స్, ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు ఇంటర్నెట్ లో స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. 
 

‘ఆర్ఆర్ఆర్’తో ప్రపంచ వ్యాప్తంగా కీర్తి పొందారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR). కోమురం భీం పాత్రలోని ఆయన నటనకు ఏకంగా ఆస్కార్ అవార్డు నామినేషన్ కు ఎంపికయ్యారు. ఈ భారీ బ్లాక్ బాస్టర్ తర్వాత ఎన్టీఆర్ మరో రెండు భారీ చిత్రాలో నటిస్తున్నారు. దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ‘జనతా గ్యారేజ్’ తర్వాత రెండో సారి నటిస్తున్నారు. ప్రస్తుతానికి వర్క్ టైటిల్ ‘ఎన్టీఆర్ 30’గా ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. అయితే ఎప్పటి నుంచో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుందనే వార్తలు వినిపించాయే గానీ.. ఇంకా షూటింగ్ మాత్రం మొదలవ్వలేదు. కానీ తాజాగా ఇంటర్నెట్ లో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ అయ్యింది. 

ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ చిత్రం ఆలస్యం అవడంతో మూవీని  ఈ నెలలోనే ప్రారంభించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగస్టు నెల దాటకూడదని మేకర్స్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆగస్టు 31న NTR30 షూటింగ్ ను ప్రారంభించాలని మేకర్స్ డేట్ ఫిక్స్ చేసినట్టు గట్టి ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లేందుకు అంతా సిద్ధం చేశారని తెలుస్తోంది. ఈ నెల చివరిలో చిత్రం సెట్స్ పైకి వెళితే కేవలం ఆరు నెలల్లోనే షూటింగ్ పార్ట్ పూర్తి చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. 

ఇప్పటికే  ఎన్టీఆర్ 30 నుంచి తారక్ పుట్టిన రోజు సందర్భంగా వచ్చిన మోషన్ పోస్టర్ కు అదిరిపోయే రెస్సాన్స్ వచ్చింది. కొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. కొత్త సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్ చిత్రంలో విద్యార్థి నాయకుడి పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. పొలిటికల్ డ్రామాగానే సినిమా కథ ఉండనున్నట్టు సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసిన కొరటాల శివ సినిమాను సెట్స్ పైకి తీసకెళ్లనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మరియు యువసుధ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. 

click me!