నందమూరి కలయిక..వాళ్లకు మింగుడుపడటం లేదా..?

By Udayavani Dhuli  |  First Published Oct 22, 2018, 12:12 PM IST

ఏ సన్నివేశం కోసం నందమూరి ఫ్యాన్స్ ఎదురుచూసారో ...ఆ సీన్ వచ్చేసింది. ఎన్టీఆర్ తాజా చిత్రం అరవింద సమేత సక్సెస్ మీట్ లో నందమూరి హీరోలు కలిసి సందడి చేసారు. ఒకే వేదికపై బాలయ్య, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కనపడటం ఖచ్చితంగా నందమూరి అభిమానులకు పండుగే. 


ఏ సన్నివేశం కోసం నందమూరి ఫ్యాన్స్ ఎదురుచూసారో ...ఆ సీన్ వచ్చేసింది. ఎన్టీఆర్ తాజా చిత్రం అరవింద సమేత సక్సెస్ మీట్ లో నందమూరి హీరోలు కలిసి సందడి చేసారు. ఒకే వేదికపై బాలయ్య, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కనపడటం ఖచ్చితంగా నందమూరి అభిమానులకు పండుగే. అయితే అది కొందరికి మింగుడుపడని వ్యవహారమే. ఎందుకంటే ఎన్టీఆర్ వెళ్లి బాలయ్యతో కలిస్తే ఖచ్చితంగా రేపటి రోజున తెలుగుదేశానికి ప్రచారం చేస్తాడు ఎన్టీఆర్. అందుకే ..అప్పుడే పుల్లలు వేయటం మొదలెట్టారు. 

పంక్షన్ లో ఎక్కడా బాలయ్య ...అందరూ ఎక్సపెక్ట్ చేసినట్లుగా ఎన్టీఆర్ గురించి మాట్లాడలేదని, కేవలం మొక్కుబడిగా రెండు ముక్కలు చెప్పి ముగించేసాడని, ఆయనకు ఎన్టీఆర్ తో ఇలా వేదిక పంచుకోవటం ఇష్టం లేదని అనటం మొదలెట్టారు. ఓ వర్గం మీడియా సైతం ఈ ప్రచారం మొదలెట్టేసింది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటి అంటే..అసలు బాలయ్యకు ఇష్టం లేకపోతే ఎంతమంది బలవంతపెట్టినా ఏ పంక్షన్ కు రాడు. అలాగే ఆయన గతంలో కూడా ఎవరినీ పొగిడిన ధాకలాలు లేవు. 

Latest Videos

undefined

ఈ సందర్బంగా బాలయ్య చెప్పిన .."నేను, మన జూనియర్ ఎన్టీఆర్.. మేం చేసే సినిమాలు మరే హీరోలు చేయలేరు, అసాధ్యం. ఎందుకంటే అవి లార్జర్ దేన్ లైఫ్ క్యారెక్టర్లు." అన్న మాట ఒక్కటి చాలు. తనను ..ఎన్టీఆర్ తో సమానం చేసి మాట్లాడారని అర్దం చేసుకోవటానికి . అసలు మాట్లాడకూడదంటే అదీ మాట్లాడేవాడు కాదు.  ఇక హరికృష్ణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మాట్లాడారు అంటే నిజానికి తన అన్నగారు పై ప్రేమతోనే ఆయన ఈ పంక్షన్ కు వచ్చారన్నది అందిరికి తెలిసిన సత్యమే. కాబట్టి...ఇప్పుడిప్పుడే కలుస్తున్న కుటుంబంలో పుల్లలు పెట్టాలనుకోవటం పద్దతి కాదు అనేది అందరి మాట. 

సంబంధిత వార్తలు..

హీరోయిన్ పై బాలయ్య కవిత.. సోషల్ మీడియాలో విమర్శలు!

ఏ యాక్టర్ తో ఫోటో దిగలేదు.. కానీ వీరితో దిగా: జగపతిబాబు

తారక్, నేను చేసే సినిమాలు మరెవరూ చేయలేరు: నందమూరి బాలకృష్ణ!

బాబాయ్ కోసం తారక్ ఎమోషనల్ స్పీచ్.. @ అరవింద సమేత సక్సెస్ మీట్!

నాన్న లేని లోటుని బాబాయ్ తీర్చేశారు: కల్యాణ్ రామ్!

బాలయ్య చేతుల మీదుగా తారక్ కి షీల్డ్!

అరవింద సక్సెస్ మీట్ లో బాలయ్య.. ఇప్పుడే ఎందుకు వస్తున్నట్టు?

'అరవింద సమేత' కథ నాది.. త్రివిక్రమ్ నన్ను మోసం చేశాడు: ప్రముఖ రచయిత ఆరోపణలు!

'అరవింద సమేత' ఫస్ట్ వీక్ కలెక్షన్స్!

త్రివిక్రమ్ పై కామెంట్లు.. ఎన్టీఆర్ ఘాటు సమాధానం!

'అరవింద సమేత'కి అక్కడ అవమానం!

'అరవింద సమేత'కి అక్కడ పెద్ద దెబ్బే!

click me!