యాక్సిడెంట్ చేసింది సురేష్ బాబే.. చర్యలు తప్పవు!

Published : Oct 22, 2018, 11:39 AM ISTUpdated : Oct 22, 2018, 04:03 PM IST
యాక్సిడెంట్ చేసింది సురేష్ బాబే.. చర్యలు తప్పవు!

సారాంశం

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సురేష్ బాబు సికింద్రాబాద్ లోని ఇంపీరియల్ గార్డెన్ వద్ద చేసిన యాక్సిడెంట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. సురేష్ బాబు కారు రాంగ్ రూట్ లో వచ్చి బైక్ పై వెళ్తున్న వారిని ఢీకొట్టింది

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సురేష్ బాబు సికింద్రాబాద్ లోని ఇంపీరియల్ గార్డెన్ వద్ద చేసిన యాక్సిడెంట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. సురేష్ బాబు కారు రాంగ్ రూట్ లో వచ్చి బైక్ పై వెళ్తున్న వారిని ఢీకొట్టింది.

దీంతో బైక్ మీద ప్రయాణిస్తోన్న సతీష్ చంద్ర(35), నీలం దుర్గాదేవి(30), నీలం సిద్దేశ్ చంద్ర(3) లకి గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన సురేష్ బాబుకి కార్ఖానా పోలీసులు 41A సెక్షన్ కింద నోటీసులు పంపించారు.

కారు నడిపింది సురేష్ బాబేనని కార్ఖానా సీఐ తెలిపారు. ప్రమాదం తరువాత ఆయన పోలీస్ స్టేషన్ కి కారుతో వచ్చినట్లు సీఐ స్పష్టం చేశారు. సురేష్ బాబుకి నోటీసులు జారీ చేశామని, ఆయనపై చర్యలు తీసుకుంటామని అన్నారు. 

సంబంధిత వార్త.. 

యాక్సిడెంట్ చేసిన దగ్గుబాటి సురేష్ బాబు!

PREV
click me!

Recommended Stories

100 సినిమాల్లో 44 ప్లాప్ లు, 30 మూవీస్ రిలీజ్ అవ్వలేదు, అయినా సరే ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
భగవంతుడా ఒక్క ఫ్లాప్ ఇవ్వు అని వేడుకున్న చిరంజీవి డైరెక్టర్ ఎవరో తెలుసా? వరుసగా 16 సక్సెస్ లు తట్టుకోలేకపోయాడా?