'2.0' పైరసీ.. 12 వేల వెబ్ సైట్లు బ్లాక్!

By Udayavani DhuliFirst Published Nov 29, 2018, 2:09 PM IST
Highlights

ఈ మధ్యకాలంలో భారీ బడ్జెట్ సినిమాలకు పైరసీ తాకిడి మరింత ఎక్కువైంది. సినిమా రిలీజ్ అయిన మొదటిరోజే ఆన్ లైన్ లో పెట్టేస్తున్నారు. '

ఈ మధ్యకాలంలో భారీ బడ్జెట్ సినిమాలకు పైరసీ తాకిడి మరింత ఎక్కువైంది. సినిమా రిలీజ్ అయిన మొదటిరోజే ఆన్ లైన్ లో పెట్టేస్తున్నారు. '2.0' సినిమాకి కూడా పైరసీ ఎఫెక్ట్ ఉంటుందని భావించిన చిత్రబృందం హైకోర్టుని సంప్రదించగా దాదాపు 12 వేలకు పైగా వెబ్ సైట్లను బ్లాక్ చేయాల్సిందిగా కోర్టు 37 ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించింది. 

ఇందులో తమిల్ రాకర్స్ పేరుతో ఆపరేట్ చేస్తోన్న రెండు వేల వెబ్ సైట్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. రజినీకాంత్ నటించిన '2.0' సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను పైరసీ చేసే ఛాన్స్ ఉందని భావించిన నిర్మాణ సంస్థ మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించింది.

విచారణలో లైకా ప్రొడక్షన్స్ న్యాయవాది సుబ్రమణియన్ హైకోర్టుకి 12,564 అక్రమ వెబ్ సైట్ల లిస్టు సమర్పించారు. పైరసీ విషయంలో తమిల్ రాకర్స్ పోటీ పడుతోందనే విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. తమిళ రాకర్స్ తో పాటు ఇతర వెబ్ సైట్లపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ సినిమా పైరసీకి గురైతే భారీగా నష్టపోయే అవకాశం ఉందని కోర్టుకి వివరించారు. ఇండియాలో 37 ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా పైరసీ చిత్రాలను వీక్షిస్తున్నారని పిల్ లో పేర్కొన్నారు. వాదనలు విన్న మద్రాస్ హైకోర్టు దేశవ్యాప్తంగా 12 వేలకు పైగా వెబ్ సైట్లను బ్లాక్ చేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించింది. 

ఇవి కూడా చదవండి.. 

'2.0'పై రజిని కూతురు ఒకే ఒక్క మాట!

ఆ రికార్డ్ రజినీకి మాత్రమే.. ఇండియాలో మరే హీరోకి లేదు!

మీడియాలో '2.0' మూవీ రివ్యూ..!

శంకర్ '2.0'పై సెలబ్రిటీల ట్వీట్స్!

'2.0' మూవీ ట్విట్టర్ రివ్యూ..!

2.0 ప్రీమియర్ షో రివ్యూ

'2.0' పై రాజమౌళి ట్వీట్!

'2.0'పై వారికి నమ్మకం లేదా..?

'2.0' మేకర్స్ అలా చేసి రిస్క్ చేస్తున్నారా..?

'2.0' లో శంకర్ ఏం దాచాడో..?

'2.0' సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!

2.0 క్రేజ్ లో టాలీవుడ్ సినిమాల ప్రమోషన్స్!

2.0 బాక్స్ ఆఫీస్: అడ్వాన్స్ రికార్డ్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

click me!