బోటు మునక: డ్యాన్సులు చేస్తూనే మృత్యు ఒడిలోకి.....

By narsimha lodeFirst Published Sep 16, 2019, 7:38 AM IST
Highlights

తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం-కచలూరు వద్ద ప్రమాదంలో 47 మంది జల సమాధి అయ్యారు.


దేవీపట్నం: పాపికొండలను చూసేందుకు ఆడుతూ, పాడుతూ  ఎంజాయి చేస్తూ  ప్రయాణం సాగుతున్న తరుణంలో ఊహించని ప్రమాదం ఎదురైంది. ఈ ప్రమాదంలో 47 మంది జలసమాధి అయ్యారు.

ఆదివారం నాడు ఉదయం గండి మైసమ్మ ఆలయం నుండి  బయలుదేరిన మూడు గంటల తర్వాత ప్రమాదం చోటు చేసుకొంది.బోటులో ప్రయాణంలో టూరిస్టులు ఉత్సాహంగా ప్రారంభించారు. ఆడుతూ పాడుతూ ప్రయాణాన్ని ప్రారంభించారు. బోటు నిర్వాహకులు  ఇద్దరు ఆర్టిస్టులతో పాటలను పాడించారు.

ఈ పాటలకు అనుగుణంగా బోటులో ఉన్న టూరిస్టులు కూడ డ్యాన్సులు వేశారు. ప్రమాదం జరిగే  ప్రదేశానికి చేరే వరకు కూడ టూరిస్టులంతా ఆడుతూ పాడుతూ గడిపారు. బోటు ప్రమాదం జరగడానికి ముందే డేంజర్ స్పాట్ ఉందని బోటు నిర్వాహకులు చెప్పారు.

ఆ సమయంలో రెండు వైపులా సమానంగా టూరిస్టులు కూర్చొన్నారు. కానీ అదే సమయంలో బోటు చిన్న కుదుపుకు గురైంది. వెంటనే బోటు నదిలో బోల్తా పడిందని ప్రమాదం నుండి బయటపడిన వారు చెప్పారు.

పాపికొండలను చూసేందుకు బయలు దేరే ముందు టూరిస్టుల్లో ఎక్కువ మంది తమ కుటుంబసభ్యులతో ఫోన్లో మాట్లాడారు. పాపికొండలు ప్రాంతంలో సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఉండవని చెప్పారు. వచ్చిన తర్వాత తాము కాంటాక్టులోకి వస్తామని చెప్పారు. అవే చివరి మాటలయ్యాయి. పాపికొండలను చూసేందుకు ముందు దిగిన ఫోటోలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలను చూసి కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

డేంజర్ జోన్ అని చెప్పిన క్షణాల్లోనే తిరగబడిన బోటు: క్షతగాత్రులు

పడవ ప్రమాదం: అజయ్ కు కేసీఆర్ ఆదేశం, కన్నబాబుతో మాట్లాడిన కేటీఆర్

పడవ ప్రమాదం: ప్రధాని మోడీ దిగ్భ్రాంతి, రాహుల్ సంతాపం

పడవ ప్రమాదం: డ్రైవర్లు ఇద్దరూ మృతి, ఆ ప్రాంతంలో సుడిగుండం

బోటు మునక: 41 మంది గల్లంతు, 24 మంది సురక్షితం

గోదావరిలో పడవ మునక: ఆచూకీ దొరికినవారు, గల్లంతైనవారు వీరే..

అమ్మా...! పాపికొండలు పోతున్నా: వరంగల్ వాసి అవినాష్

బోటుపై నిలబడి ప్రాణాలు దక్కించుకొన్నా: వరంగల్ వాసి

బోటు మునక: ప్రమాదంలో చిక్కుకొన్న వరంగల్ వాసులు

బోటు మునక ఎఫెక్ట్: బోటు సర్వీసుల నిలిపివేయాలని సీఎం ఆదేశం

బోటు ప్రమాదంపై చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి

బోటు మునక: ఐదు మృతదేహాల వెలికితీత, కొనసాగుతున్న గాలింపు

పడవ ప్రమాదంపై స్పందించిన హోంమంత్రి సుచరిత

తూ.గో జిల్లాలో బోటు మునిగి 41 మంది ఆచూకీ గల్లంతు

పడవ బొల్తా: రంగంలోకి హెలికాఫ్టర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది

కచ్చలూరు: ఇదే చోట రెండు ప్రమాదాలు

బోటు మునక:సహాయక చర్యలకు సీఎం జగన్ ఆదేశం

click me!