అల్లనేరేడుతో అక్రమంగా వైన్ తయారీ...రైతు తోటపై ఎక్సైజ్, ఈడీ దాడులు

By sivanagaprasad KodatiFirst Published Nov 20, 2019, 11:23 AM IST
Highlights

అనంతపురం జిల్లాలో ఓ రైతు తోటపై ఈడీ, ఎక్సైజ్ శాఖ దాడులు నిర్వహించడం సంచలనం కలిగించింది. 

అనంతపురం జిల్లాలో ఓ రైతు తోటపై ఈడీ, ఎక్సైజ్ శాఖ దాడులు నిర్వహించడం సంచలనం కలిగించింది. బొమ్మనహాల్ మండలం ఉద్దేహల్‌‌ గ్రామానికి చెందిన ఓ రైతు అల్లనేరేడు జ్యూస్ పేరుతో అక్రమంగా వైన్ తయారుచేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి.

Also read:వల్లభనేని వంశీపై మాట్లాడబోను: యార్లగడ్డ వెంకట్రావు

దీనిపై స్పందించిన అధికారులు బుధవారం సదరు రైతు తోటపై దాడులు నిర్వహించారు. అతనిని మాజీ సర్పంచ్ మారుతి ప్రసాద్‌గా గుర్తించారు. ఇతను ఐదెకరాల్లో అల్లనేరేడు పంటను సాగు చేస్తున్నాడు. సదరు ఫ్రూట్ జ్యూస్‌పై ఆరోపణలు రావడంతో తనిఖీలు నిర్వహించి సుమారు 9 వేల లీటర్ల జ్యూస్ క్యాన్లను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు

Also Read:ఐపీఎస్ అధికారి బాలసుబ్రమణ్యం బదిలీ

click me!