Andhra Pradesh Elections 2024 : ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమిపై వైసీపీ శ్రేణులు ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నాయి. మళ్లీ జనం చెవిలో పూలు పెడుతూ మౌత్ టాక్ మల్లిగాళ్ళు వచ్చారంటూ కౌంటర్లు వేస్తున్నాయి.
Andhra Pradesh Elections 2024 : ఎన్నికలు వచ్చాయంటే చాలు ఎక్కడా కనిపించని రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఎటూ చూసినా కనబడుతూనే ఉంటారు. ఓటర్లను తమవైపునకు తిప్పుకోవడానికి ఎప్పుడూ చూడని చిత్రవిచిత్ర పనులు చేస్తుంటారు. ఏం చెబుతున్నామనేదానితో సంబంధం లేకుండా ఓటర్లకు గాలం వేయడమే మొదటి టార్గెట్ గా ఉంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా గతంలో రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు నాయుడు తీరుపై వైకాపా శ్రేణులు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఎన్నికల సమయంలో బాబుకు అన్ని గుర్తుకు వస్తాయంటూ ఫైర్ అవుతున్నాయి.
పల్లెల్లో కొందరుంటారు... ఉత్త గాలి పోగేసి కబుర్లు చెప్పడం... జనాన్ని నమ్మించడం... వాళ్ళు నమ్మకపోతే వాళ్ళను గందరగోళపర్చడం.. ఇదే వారి వృత్తిగా జీవిస్తుంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ముప్పయ్యేళ్లుగా చేస్తున్నది...నమ్ముకున్నది ఇదేనంటూ వైకాపా నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. సినిమా ఎప్పుడైతే చప్పగా ఉన్నట్లు అనిపిస్తుందో... సరిగ్గా అప్పుడే రెండు కామెడీ జోక్స్...లేదా మంచి మసాలా ఐటం సాంగ్ వేస్తారు... దీంతో మళ్ళీ థియేటర్లో ప్రేక్షకులు ఎటెన్షన్లోకి వచ్చి...సినిమాలో లీనమవుతారు... అచ్చం చంద్రబాబు కూడా ఇదే విధానము ఫాలో అవుతున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు గత టీడీపీ పాలన, పార్టీ పరిస్థితి, చంద్రబాబు గురించి ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.
undefined
తెలుగుదేశం పార్టీ గ్రాఫ్... చంద్రబాబు ప్రతిష్ట ఎప్పుడైతే డౌన్ అవుతోందని గ్రహిస్తారో.... అప్పుడు తన మీడియాను... పచ్చ జనాన్ని... అలవోకగా బొంకగలిగేవాళ్లను జనంలోకి దించుతారు... వీళ్ళే మౌత్ టాక్ మల్లిగాళ్ళు వీళ్ళు జనం ఎక్కువగా ఉండే హోటళ్లు... టీ స్టాళ్లు.. బస్సులు...రైల్వే కౌంటర్ల వద్ద అకస్మాత్తుగా ప్రత్యక్షమై ఉన్నఫళంగా ప్రభుత్వాన్ని తిడుతూ అరుస్తూ కేకలు వేస్తారు.. అక్కడ ఉన్నవాళ్ళంతా ఆటే చూసేలా చేస్తారు.... ఐదారు నిముషాలు స్క్రిప్ట్ ప్రకారం తమిళ యాక్టర్లు మనోరమ.. శివాజీ గణేష్ లను మించిపోయేలా యాక్టింగ్ చేసేసి వెళ్ళిపోతారు ఇప్పుడు ఇదే ప్లాన్ తో చంద్రబాబు వర్గాలు చేస్తున్నాయని వైసీసీలో టాక్ నడుస్తోంది. ఇదంతా చూసేవాళ్ళు మాత్రం...వామ్మో ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఉందా అని జనం అనుకోవాలనేది వాళ్ళ ప్లాన్. అయితే గ్రామస్థాయిలో ప్రజల అభిప్రాయం మాత్రం వేరేలా ఉందంటున్నారు వైసీసీ శ్రేణులు.
గత ఐదేళ్ళలో సీఎం వైయస్ జగన్ తమకు ఎంత మేలు చేశారన్నది లెక్కలు వేసుకుని మరీ ప్రజలు ఓటు చేతబట్టుకుని ఎన్నికల కోసం సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. మళ్ళీ తమ సోదరుడిని గెలిపించుకోవాలని వాళ్లంతా ఎదురుచూస్తున్నారు...ప్రజల్లో ఇలాంటి అభిప్రాయం ఉన్నపుడు ఈ మౌత్ టాక్ మల్లిగాళ్ళు ప్రజల మనోభిప్రాయాలను మార్చలేరనీ, ఎన్నిసారు అరిచినా ఇత్తడిని పుత్తడి చేయలేరు కాబట్టి చంద్రబాబును మళ్ళీ గెలిపించలేరని వైకాపా శ్రేణులు పేర్కొంటున్నాయి. వారు ఏం చేసినా రాబోయేది జగన్ సర్కారు అంటున్నారు. అయితే, ఇదంతా తేలాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే.. !
చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు సాధ్యమేనా?