Delhi Police summons CM Revanth Reddy : అమిత్ షా వీడియోకు సంబంధించిన విషయంపై ఢిల్లీ పోలీసులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమన్లు జారీ చేశారు.
Delhi Police summons Telangana CM Revanth Reddy: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. విమర్శలు, ఆరోపణలతో కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి సమన్లు అందాయి. అమిత్ షా వీడియోకు సంబంధించి ఢిల్లీ పోలీసులు సీఎం రేవంత్ రెడ్డి సమాన్లు పంపారు.
అసలు ఏం జరిగింది?
undefined
కేంద్ర హోంమంత్రి అమిత్ షా రిజర్వేషన్లపై మాట్లాడిన ఫేక్ వీడియోకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్రానికి చెందిన మరో నలుగురికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ వీడియోను తెలంగాణ కాంగ్రెస్ ఎక్స్ హ్యాండిల్ షేర్ చేసిందనీ, చాలా మంది పార్టీ నేతలు దాన్ని రీపోస్ట్ చేశారు. ఇది ఫేక్ వీడియో కావడంతో ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారనే కారణంతో పోలీసులు వారికి సమన్లు పంపినట్టు సమాచారం.
అమిత్ షా ఫేక్ వీడియోలో ఏముంది? కేంద్ర హోం శాఖ ఏం చెప్పింది?
బీజేపీ, హోం మంత్రిత్వ శాఖ ఫిర్యాదుల తర్వాత అమిత్ షాకు సంబంధించిన ఫేక్ ఎడిట్ వీడియోపై ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సైబర్ వింగ్ ఐఎఫ్ఎస్ఓ యూనిట్ కేసు నమోదు చేసింది. సంబంధిత వీడియోలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలకు రిజర్వేషన్ కోటాలను రద్దు చేయాలని పేర్కొంటున్నట్టుగా ఉంది. ఇండియన్ పీనల్ కోడ్ (IPC)లోని సెక్షన్లు 153, 153A, 465, 469, 171G, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) చట్టంలోని సెక్షన్ 66C కింద కేసు నమోదు చేశారు.
ఎఫ్ఐఆర్ ప్రకారం.. కేంద్ర హోం శాఖ తన ఫిర్యాదులో "కొన్ని ఎడిట్ చేసిన చేసిన వీడియోలను ఫేస్ బుక్, ట్విట్టర్ (ఎక్స్) సహా పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో వినియోగదారులచే ప్రసారం చేయబడుతున్నాయి" అని గుర్తించబడింది. “వీడియో డాక్టరేడ్ అయినట్లుంది, ప్రజాశాంతి, పబ్లిక్ ఆర్డర్ సమస్యలను ప్రభావితం చేసే అవకాశం ఉన్న కమ్యూనిటీల మధ్య అసమ్మతిని సృష్టించే ఉద్దేశ్యంతో తప్పుదోవ పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేస్తోంది. దయచేసి చట్ట నిబంధనల ప్రకారం అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించబడింది”అని మంత్రిత్వ శాఖ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.
అమిత్ షా అసలు వ్యాఖ్యలను వక్రీకరించేందుకే ఈ వీడియో తారుమారు చేయబడిందనీ, తెలంగాణలో ముస్లింలకు రిజర్వేషన్ కోటాలను రద్దు చేయడానికి బీజేపీ కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటిస్తూ, వీడియో ప్రామాణికతను బీజేపీ గట్టిగా ఖండించింది. అటువంటి దురుద్దేశపూరిత చర్యలకు వ్యతిరేకంగా పార్టీ తమ వైఖరిని నిర్ద్వంద్వంగా కొనసాగించింది. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను ఖండించింది. అంతకుముందు, బీజేపీ ఐటి సెల్ అధిపతి అమిత్ మాల్వియా మాట్లాడుతూ, తెలంగాణ కాంగ్రెస్ అమిత్ షా డాక్టర్డ్ వీడియోను ప్రసారం చేస్తోందనీ, ఇది పూర్తిగా కల్పితమనీ, విస్తృతంగా హింసను ప్రేరేపించగలదని ఆరోపించారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ఏప్రిల్ 23న తెలంగాణలో జరిగిన విజయ సంకల్ప సభలో అమిత్ షా అన్నారు. "నేను ఇది చెప్పాలనుకుంటున్నాను. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, ఈ రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్ రద్దు చేయబడుతుంది. ఈ హక్కులు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందినవని, ముస్లిం రిజర్వేషన్‌ను రద్దు చేయడం ద్వారా వారికి అందజేస్తామని" మంత్రి చెప్పారు. ఈ వ్యాఖ్యలను ఎడిట్ చేసి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్లను రద్దు చేస్తానని షా చెబుతున్నట్టుగా ప్రచారం అవుతున్న వీడియో క్రమంలో ఇది నకిలీదని బీజేపీ పేర్కొంది.
PM MODI: బస్టాండ్ లో పండ్లు అమ్మే మహిళను కలిసిన ప్రధాని మోడీ.. ఆమెపై ఎందుకు ప్రశంసలు కురిపించారు?