దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్: వీరభద్రస్వామికి సజ్జనార్ మొక్కులు

By telugu teamFirst Published Dec 18, 2019, 11:24 AM IST
Highlights

దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగి త్రిసభ్య కమిటీని నియమించిన తర్వాత సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ లేపాక్షిలోని వీరభద్రస్వామిని దర్శించుకుని పూజలు చేశారు.

కర్నూలు: వెటర్నరీ డాక్టర్ దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ తర్వాత సైబరాబాద్ పోలీసు కమిషనర్ విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్ ప్రజల దృష్టిలో హీరో అయ్యారు. ఆయనపై పూలవర్షం కురిపించారు. భుజాల మీద ఎత్తుకుని ఊరేగించారు. గత వారాంతంలో వీసీ సజ్జనార్ అనంతపురంలో పురాతన దేవాలయ్యాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు. 

దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ పై విచారణ జరిగి, సంఘటనపై సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీని నియమించింది. అది జరిగిన తర్వాత వీసీ సజ్జనార్ తన కుటుంబ సభ్యులతో కలిసి అనంతపురంలోని లేపాక్షికి వెళ్లారు. అక్కడ శనివారంనాడు తమ కుటుంబ దైవం వీరభద్ర స్వామికి పూజలు చేశారు. 

Also Read: దిశ రేప్, హత్య: దారి మూసేసి, గుడారం వేసి కాపలా

సజ్జనార్ శివుడి భక్తుడు. ఆయన తరుచుగా శ్రీశైలం సందర్శిస్తారని చెబుకుంటారు. ధవళ వస్త్రాలు ధరించి సజ్జనార్ వీరభద్ర స్వామికి పూజలు నిర్వహించినట్లు తెలుస్తోంది. వ్యక్తిగతంగా గానీ వృత్తిపరంగా గానీ తాను ఏమైనా తప్పులు చేసి ఉంటే కాపాడాలని ఆయన కోరుకున్నట్లు చెబుతున్నారు. 

సజ్జనార్ ఇక్కడికి వచ్చారనే సమాచారం అందుకున్న ప్రజలు పెద్ద యెత్తున వచ్చారు. ఆయనను చూడడానికి వారు తాపత్రయపడ్డారు. దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ కు ప్రజల నుంచి ఆమోదం లభించిందని చెప్పడానికి ఇది సాక్ష్యమని అంటున్నారు.

Also Read: కుళ్లిపోతున్న దిశ నిందితుల మృతదేహాలు:చేతులెత్తేసిన వైద్యులు

click me!