కుళ్లిపోతున్న దిశ నిందితుల మృతదేహాలు:చేతులెత్తేసిన వైద్యులు...
నవంబర్ 27న తోడుంపల్లి వద్ద దిశపై అత్యాచారం చేసి హత్య చేశారు నిందితులు ముహ్మద్ ఆరిఫ్, చెన్నకేశవులు, నవీన్, శివ. నిందితులను పోలీసులు 48 గంటల్లో పట్టుకున్నారు. నిందితులకు 14 రోజులపాటు రిమాండ్ విధించింది న్యాయస్థానం.
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ వైద్యురాలు దిశ హత్యకేసు నిందితుల మృతదేహాలు మృతదేహాలు కుళ్లిపోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. గాంధీ ఆస్ప్పత్రిలో ఫ్రీజర్ బాక్సుల్లో భద్రపరచిన మృతదేహాలు కుళ్లిపోయే స్థికి చేరుకున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే దిశపై రేప్,హత్య కేసులో సీన్ రీకనస్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు ఎదురుదాడికి దిగడంతో ఈనెల 6న పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. పోలీసుల కాల్పుల్లో నలుగురు నిందితులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
అయితే మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కుటుంబ సభ్యులకు అప్పగించాలని పోలీసులు భావించారు. అయితే న్యాయస్థానాలు ఎన్ కౌంటర్ పై విచారణ జరుగుతున్న తరుణంలో మృతదేహాలను భద్రపరచాలని ఆదేశించాయి. ఈనెల 13 వరకు మృతదేహాలను భద్రపరచాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
దాంతో ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మృతదేహాలు గాంధీ ఆస్పత్రిలోని ఫ్రీజర్ బాక్సుల్లో ఉంచి భద్రపరుస్తున్నారు. మృతదేహాలు పాడైపోకుండా ఉండేందుకు ఇటీవలే ఎంబాంమింగ్ నిర్వహించారు ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ శ్రావణ్‌కుమార్.
అయితే హైకోర్టు గడువు ముగియడంతో మార్చురీలో భద్రపరిచిన మృతదేహాలపై ప్రభుత్వ న్యాయవాదికి ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొ.శ్రావణ్ కుమార్ మంగళవారం నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది.
మృతదేహాలకు ఎలాంటి భద్రత కల్పించాలన్న అంశంపై ఆరా తీశారు. గడువు పూర్తవడంతో ఎక్కువ రోజులు ఫ్రీజర్ బాక్సుల్లో ఉంచలేమని ఫోరెన్సిక్ వైద్యులు చెప్తున్నారని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.
మృతదేహాలను వేరే చోటుకు తరలిస్తే బాగుంటుందని ఫోరెన్సిక్ వైద్యులు సూచనలు చేస్తున్నట్లు కూడా తెలిపారు. ఇకపోతే సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్న తరుణంలో మృతదేహాలను ఢిల్లీ తరలించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది.
దిశ కేసు: ఈ నెల 27న ఛార్జీషీటు దాఖలు చేయనున్న పోలీసులు...
ఇకపోతే నవంబర్ 27న తోడుంపల్లి వద్ద దిశపై అత్యాచారం చేసి హత్య చేశారు నిందితులు ముహ్మద్ ఆరిఫ్, చెన్నకేశవులు, నవీన్, శివ. నిందితులను పోలీసులు 48 గంటల్లో పట్టుకున్నారు.
నిందితులకు 14 రోజులపాటు రిమాండ్ విధించింది న్యాయస్థానం. అయితే కేసు రీ కనస్ట్రక్షన్ లో భాగంగా నిందితులను కస్టడీకి కోరారు పోలీసులు. షాద్ నగర్ కోర్టు అంగీకారం తెలపడంతో ఈనెల 6న కేసు రీ కనస్ట్రక్షన్ చేస్తున్న సమయయంలో వారు ఎదురుదాడికి దిగగా వారిపై పోలీసులు కాల్పులు జరపగా వారు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
అయితే ఎన్ కౌంటర్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్ తోపాటు సుప్రీంకోర్టు నియమించిన కమిటీ విచారణ జరుపుతున్న తరుణంలో సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చేవరకు మృతదేహాలను ఖననం చేయోద్దని హైకోర్టు ఆదేశించడంతో మృతదేహాలను ఎలా భద్రపరచాలా అన్న కోణంలో గాంధీ ఆస్పత్రి సిబ్బంది తర్జనభర్జన పడుతున్నారు.
కుళ్లిన స్థితిలోకి దిశ నిందితుల మృతదేహాలు: ఎంబామింగ్‌పై వైద్యుల తర్జనభర్జన...