Asianet News TeluguAsianet News Telugu

దిశ రేప్, హత్య: దారి మూసేసి, గుడారం వేసి కాపలా

దిశ రేప్, హత్య కేసు నిందితుల ఎన్ కౌంటర్ జరిగిన స్థలంలో పోలీసులు దారిని మూసేశారు. అక్కడ గుడారం వేసి ఎవరూ చేరకుండా కాపలా కాస్తున్నారు. కోర్టుకు పోలీసులు అదనపు నివేదికను సమర్పించారు.

Disha rape and murder: Wall closed at incident place
Author
Chatanpally Road, First Published Dec 18, 2019, 8:22 AM IST

హైదరాబాద్: దిశ రేప్, హత్య కేసు నిందితుల ఎన్ కౌంటర్ జరిగిన స్థలానికి దారి మూసేశారు. సంఘటన స్థలానికి ఎవరు వెళ్లకుండా ఆ పనిచేశారు. ఎన్ కౌంటర్ జరిగిన స్థలానికి చటాన్ పల్లి వంతెన దగ్గరి నుంచి చెట్లు, పొలం గట్ల మధ్యలో నుంచి దారి ఉంది. 

దాంతో ఆ స్థలానికి ఎవరూ వెళ్లకుండా ఇనుప కంచె ఏర్పాటు చేశారు. ఘటన స్థలం వద్ద పోలీసులు గుడారం వేసి బందోబస్తు నిర్వహిస్తున్నారు. చటాన్ పల్లి వంతెన వద్ద దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే.

Also Read: ట్విస్ట్: ఢిల్లీకి చేరనున్న దిశ నిందితుల మృతదేహాలు

దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ కు సంబంధించి అదనపు నివేదికను పోలీసులు షాద్ నగర్ కోర్టుకు సమర్పించారు. దిశ కేసులో నిందితుల కస్టడీ, రిమాండ్ గడువు పూర్తి కావడంతో కేసుకు సంబంధించిన వివరాలను కోర్టుకు అందించాల్సిన అవసరం ఏర్పడింది. ఆ నేపథ్యంలో పోలీసులు కోర్టుకు అదనపు నివేదికను సమర్పించినట్లు తెలుస్తోంది. 

దిశ రేప్, హత్య జరిగిన తర్వాత నలుగురు నిందితులు పోలీసు ఎన్ కౌంటర్ లో మరణించారు. నిందితుల ఎన్ కౌంటర్ కు దారి తీసిన పరిస్థితులపై, మృతుల వివరాలపై, నిందితుల నుంచి సేకరించిన వివరాలతో అదనపు నివేదికను పోలీసులు కోర్టుకు సమర్పించారు. మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించిన తర్వాత తుది నివేదికను కోర్టుకు సమర్పించే అవకాశం ఉంది. 

Also Read: దిశ కేసు: ఈ నెల 27న ఛార్జీషీటు దాఖలు చేయనున్న పోలీసులు

Follow Us:
Download App:
  • android
  • ios