హత్య మిస్టరీ: శిఖా ఇంటి ముందు జయరామ్ కారు

Published : Feb 04, 2019, 01:38 PM IST
హత్య మిస్టరీ: శిఖా ఇంటి ముందు జయరామ్ కారు

సారాంశం

ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్‌ హత్య కేసులో చిక్కుముడులను  పోలీసులు విప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే హత్యకు ముందు జయరామ్ కారు శిఖా చౌదరి ఇంటి ముందు ఉన్నట్టుగా సీసీ దృశ్యాల్లో వెల్లడైందని ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌  ప్రకటించింది.


హైదరాబాద్: ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్‌ హత్య కేసులో చిక్కుముడులను  పోలీసులు విప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే హత్యకు ముందు జయరామ్ కారు శిఖా చౌదరి ఇంటి ముందు ఉన్నట్టుగా సీసీ దృశ్యాల్లో వెల్లడైందని ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌  ప్రకటించింది.

తన వద్ద తీసుకొన్న నాలుగున్నర కోట్ల రూపాయాల అప్పును జయరామ్‌  తీసుకొన్నాడని రాకేష్ రెడ్డి పోలీసుల విచారణలో  వెల్లడించినట్టు చెప్పారు.అప్పు విషయమై మాట్లాడేందుకు జయరామ్‌ను పిలిపించి మాట్లాడే క్రమంలో రాకేష్ రెడ్డి కొట్టడంతో  జయరామ్ మృతి చెందినట్టుగా పోలీసుల విచారణలో వెల్లడించినట్టుగా  సమాచారం.

అయితే  గత నెల 31వ తేదీ ఉదయం పూట  జయరామ్‌ను హత్య చేసిన తర్వాత రాత్రి పూట ఆయన మృతదేహంతో రాకేష్ రెడ్డి నందిగామ వరకు కారులో వెళ్లారు.జయరామ్‌ హత్యను  రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు రాకేష్ రెడ్డి ప్రయత్నించినట్టుగా పోలీసులు  అనుమానిస్తున్నారు.

అయితే జయరామ్‌ హత్య జరిగిన రోజునే రాత్రి సమయంలో జయరామ్ కారు శిఖా చౌదరి ఇంటి ముందు ఎందుకు ఆగిందనే కోనణంలో కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ మేరకు సీసీటీవీ పుటేజీని పరిశీలిస్తున్నారు. ఆ సమయంలో  కారులో జయరామ్ కూడ ఉన్నాడా.... కారును ఎవరు డ్రైవ్ చేశారనే విషయమై కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

చిగురుపాటి హత్య: రాకేష్ రెడ్డి నేపథ్యమిదీ...

జయరామ్ మర్డర్ కేసులో కీలక ఆధారాలు స్వాధీనం: డిఎస్పీ బోస్

జయరామ్ మర్డర్: యాంకర్ ద్వారా వల వేశారా?

గట్టిగా కొట్టడంతో జయరాం చనిపోయాడు.. రాకేష్ రెడ్డి

జయరాంతో నాకు శారీరక సంబంధం నిజమే: శిఖా చౌదరి 

రాకేష్‌ను పెళ్లి చేసుకోవాలనుకొన్నా, కానీ, మామయ్య ఇలా...:శిఖా చౌదరి

జయరామ్ మర్డర్‌ కేసు: ఆ సీసీ పుటేజే కీలకం, విషమిచ్చారా?

జయరామ్ హత్య కేసు: కబాలీ తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి ఆసక్తికరం

వీడిన జయరాం మర్డర్ మిస్టరీ: హంతకుడు రాకేశ్ రెడ్డి, అప్పే కారణం

జయరాం హత్య కేసు: కబాలీ ప్రొడ్యూసర్ చేతికి శిఖా చౌదరి కారు

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు

జయరాం హత్య: మూడు ముక్కులాట.. రాకేష్, శ్రీకాంత్, శిఖా చుట్టూ..

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...

శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్

జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి

చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్

హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?

చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే