జగన్ పై దాడి కేసు:రేపు హైకోర్టుకు సిట్ నివేదిక

By Nagaraju TFirst Published Nov 12, 2018, 8:32 PM IST
Highlights

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై దాడికేసుకు సంబంధించి సిట్ బృందం నివేదిక సిద్ధం చేసింది. 18 రోజులుగా దర్యాప్తు నిర్వహించిన సిట్ 40 పేజీల నివేదికను తయారు చేసింది. జగన్ పై దాడి జరిగిన అనంతరం ఇప్పటి వరకు 75 మందికి పైగా వ్యక్తులను విచారించింది. 
 

హైదరాబాద్: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై దాడికేసుకు సంబంధించి సిట్ బృందం నివేదిక సిద్ధం చేసింది. 18 రోజులుగా దర్యాప్తు నిర్వహించిన సిట్ 40 పేజీల నివేదికను తయారు చేసింది. జగన్ పై దాడి జరిగిన అనంతరం ఇప్పటి వరకు 75 మందికి పైగా వ్యక్తులను విచారించింది. 

విచారణ అనంతరం 40 పేజీల నివేదికను సీల్డ్ కవర్ లో పొందుపరచారు. ఆ నివేదికన సిట్ ఇంచార్జ్ నాగేశ్వరరావు హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ లోని అడ్వకేట్ జనరల్ ను కలిసి నివేదిక సమర్పించారు. విచారణకు సంబంధించి చర్చించారు. మంగళవారం జగన్ పై దాడి కేసు విచారణ రానున్న నేపథ్యంలో సిట్ నివేదికను అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు సమర్పించనున్నారు.  

ఇకపోతే తనపై హత్యకు కుట్ర చేశారంటూ వైసీపీ అధినేత జగన్ హైకోర్టులో పిటీషన్ వేశారు. జగన్ వేసిన పిటిషన్ పై గత శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు ఇరువాదనలు విని తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. అయితే ఈ కేసులో సిట్ అధికారుల పురోగతి నివేదికను సీల్డ్ కవర్ లో మంగళవారం కోర్టుకు సమర్పించాలని అటార్నీ జనరల్ కు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.  

మరోవైపు దాడి ఘటనపై జగన్ తరపు న్యాయవాదిని ఉద్దేశించి హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా తనకు ఏపీ పోలీసులపై నమ్మకంలేదని జగన్ పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా దీనిపై కోర్టు స్పందించింది.  దర్యాప్తు అధికారులకు వాంగ్మూలం ఇవ్వకుండా ఘటన జరిగిన వెంటనే విశాఖ నుంచి హైదరాబరాద్ కు ఎందుకు వెళ్లారని ప్రశ్నించింది.

పోలీసులకు వాంగ్మూలం ఇవ్వకుండా దర్యాప్తు తీరును ఆపేక్షించడం సమంజసం కాదని హైకోర్టు అభిప్రాయపడింది. అయితే.. ఈ వ్యాఖ్యలపై స్పందించిన జగన్ తరపు న్యాయవాది.. ప్రాణాపాయం ఉందనే కారణంతోనే స్టేట్ మెంట్ ఇవ్వలేదని చెప్పారు. 

ఈ వార్తలు కూడా చదవండి

జగన్‌పై దాడి: శ్రీనివాస్‌కు 120 కాల్స్, ఎవరీ కేకే

జగన్ పై దాడి.. హైకోర్టు సంచలన కామెంట్స్

జగన్‌పై దాడి: జోగి రమేష్‌ విచారణ, గుంటూరులో ఉద్రిక్తత

జగన్ పై దాడి కేసు:విచారణకు హాజరైన జోగి రమేష్

జగన్‌పై దాడి: శ్రీనివాస్‌ కత్తి ఎలా తీసుకెళ్లాడంటే?

జగన్ మీద దాడిపై జేసి దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

జగన్‌కేసు దర్యాప్తు: శ్రీనివాస్ దుబాయ్‌లో వెల్డర్, హైద్రాబాద్‌లో కుక్

జగన్‌పై దాడి కేసులో ట్విస్ట్: ఆ యువతులే కీలకం

జగన్‌పై దాడి కేసు...శ్రీనివాస్‌ మళ్లీ జైలుకే

జగన్‌పై దాడి: శ్రీనివాసరావుకు లైడిటెక్టర్ పరీక్ష..?

జగన్‌పై దాడి: ఆ నలుగురితో శ్రీనివాసరావు సంభాషణ

జగన్‌పై దాడి: ఇద్దరు గుంటూరు మహిళల విచారణ

శివాజీని చంపి జగన్‌పైకి నెడతారు.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై దాడికి ముందు శ్రీనివాస్ నుంచి ఆ మహిళకే ఎక్కువ ఫోన్ కాల్స్

శ్రీనివాస్ విచారణకు సహకరించడం లేదు, కొన్ని విషయాలు దాస్తున్నాడు:సీపీ లడ్డా

జగన్‌పై దాడి కేసు నిందితుడి హెల్త్ ఓకే: కేజీహెచ్ సీఎంఓ

జగన్‌పై దాడి: అందుకే శ్రీనివాస్‌ను కేజీహెచ్‌కు తెచ్చామని సీఐ

అందుకే జగన్‌పై దాడి చేశా: నిందితుడు శ్రీనివాస్

click me!