సూపరింటెండెంట్‌ అత్యాచారం కేసు...ఆ బాలిక ఓ లెస్బియన్: తోటి బాలికలు

By Arun Kumar PFirst Published Nov 12, 2018, 6:16 PM IST
Highlights

తిరుపతిలోని అనాథ బాలికల వసతి గృహ సూపరింటెండెంట్ నందకిశోర్ పై ఓ బాలిక అత్యాచార ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.  బాధితురాలి ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు ఇవాళ నందకిశోర్ ను అరెస్ట్ చేశారు.  ఈ అరెస్టుతో బాలికల హాస్టల్ వద్ద తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. 

సూపరింటెండెంట్ అరెస్ట్ ను నిరసిస్తూ హాస్టల్లోని విద్యార్థినిలు నిరసనకు దిగారు. బాలికలంతా కలిసి హాస్టళ్లోని ఓ రూంలో తమను తాము బంధించుకుని ఆందోళన చెపట్టారు. తమ చేతుల మణికట్టు వద్ద కోసుకుని ఆత్మహత్యాయత్నానికి సిద్దమయ్యారు. దీంతో హాస్టల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 

తమను నందకిశోర్ తండ్రి లాగా చూసుకునేవాడని బాలికలు తెలిపారు.దాదాపు 16 మంది అనాధ బాలికలకు ఆయనే వివాహం చేశారని అన్నారు. అలాంటి వ్యక్తి ఆ బాలికపై అత్యాచారం చేశాడంటే తాము నమ్మడంలేదని అన్నారు. అయినా ఈ కేసు పెట్టిన బాలిక ఓ లెస్బియన్ అంటూ నిరసన చేపడుతున్న బాలికలు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

అరెస్ట్ చేసిన నందకిశోర్ ను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. చేతులపై చేసుకున్న గాయాల కారణంగా ఎవరైనా చనిపోతే అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌ వెంటనే స్పందించాలని  విద్యార్థినులు డిమాండ్ చేశారు. 
 
మరిన్ని వార్తలు

అరెస్ట్: హాస్టల్ విద్యార్థిని గర్భవతిని చేసిన సూపరింటెండెంట్

click me!