మింగేసే సుడిగుండాలు.. లోతైన ప్రదేశాలు: అక్కడ రెస్క్యూ ఆపరేషన్లూ కష్టమే

Siva Kodati |  
Published : Sep 16, 2019, 07:54 AM ISTUpdated : Sep 16, 2019, 08:29 AM IST
మింగేసే సుడిగుండాలు.. లోతైన ప్రదేశాలు: అక్కడ రెస్క్యూ ఆపరేషన్లూ కష్టమే

సారాంశం

ఆదివారం గోదావరిలో జరిగిన బోటు ప్రమాద ప్రాంతంలో సహాయక చర్యలు నిర్వహించడం అంత సులభం కాదంటున్నారు నిపుణులు. మునిగిపోయిన బోటు నదీ గర్భంలో సుమారు 150 నుంచి 200 అడుగుల లోతులో ఉంది. కచ్చులూరు వెళ్లడానికి రోడ్డు మార్గం అంతంత మాత్రమే.. నదీ మీదుగా వెళ్లాలన్నా.. దేవీపట్నం నుంచి గంటన్నరసేపు ప్రయాణించాలి.

ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సహాయక చర్యలు ఎంతో కీలకం. బతికున్న వారిని ప్రాణాలతో కాపాడటానికి కానీ.. అయినవారికి మరణించిన వ్యక్తి కడసారి చూపు దక్కించడానికి రెస్క్యూ ఆపరేషన్స్ ఎంతో కీలకం.

అయితే ఆదివారం గోదావరిలో జరిగిన బోటు ప్రమాద ప్రాంతంలో సహాయక చర్యలు నిర్వహించడం అంత సులభం కాదంటున్నారు నిపుణులు. మునిగిపోయిన బోటు నదీ గర్భంలో సుమారు 150 నుంచి 200 అడుగుల లోతులో ఉంది.

కచ్చులూరు వెళ్లడానికి రోడ్డు మార్గం అంతంత మాత్రమే.. నదీ మీదుగా వెళ్లాలన్నా.. దేవీపట్నం నుంచి గంటన్నరసేపు ప్రయాణించాలి. అన్నింటికి మించి తాజా ప్రమాదంతో ఆ ప్రాంతంలో వెళ్లడానికి భయపడుతున్న పరిస్ధితి.

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉద్థృతంగా ప్రవహిస్తోంది. ఈ పరిణామాల దృష్ట్యా సహాయక చర్యలపై ఆందోళన వ్యక్తమవుతోంది.

గతంలో వాడపల్లి వద్ద లాంచీ ప్రమాదం జరిగినప్పుడు అధికారులు రెండు వైపుల నుంచి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ.. చాలా సమయం పట్టింది. ఇప్పుడు లోతైన ప్రదేశంలో సహాయక చర్యలు అంత సులభం కాదని నిపుణులు వివరిస్తున్నారు.

మరోవైపు ప్రమాదం జరగడానికి కొద్ది క్షణాల ముందు.. ఇది అత్యంత ప్రమాదకర ప్రాంతం.. ఇక్కడ సుడిగుండాలు ఉంటాయని.. అప్రమత్తంగా ఉండాలని టూరిస్ట్ గైడ్‌ మైకులో హెచ్చరించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

అయితే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇలాంటి ఆపరేషన్స్‌లో సిద్ధహస్తులు కావడం.. ఉత్తరాఖండ్ నుంచి ప్రత్యేక బృందం వస్తుండటంతో సహాయక చర్యలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కొందరు వాదిస్తున్నారు. 

అంతులేని విషాదం: ఒకే కుటుంబంలో 12 మంది గల్లంతు

డేంజర్ జోన్ అని చెప్పిన క్షణాల్లోనే తిరగబడిన బోటు: క్షతగాత్రులు

పడవ ప్రమాదం: అజయ్ కు కేసీఆర్ ఆదేశం, కన్నబాబుతో మాట్లాడిన కేటీఆర్

పడవ ప్రమాదం: ప్రధాని మోడీ దిగ్భ్రాంతి, రాహుల్ సంతాపం

పడవ ప్రమాదం: డ్రైవర్లు ఇద్దరూ మృతి, ఆ ప్రాంతంలో సుడిగుండం

బోటు మునక: 41 మంది గల్లంతు, 24 మంది సురక్షితం

గోదావరిలో పడవ మునక: ఆచూకీ దొరికినవారు, గల్లంతైనవారు వీరే..

అమ్మా...! పాపికొండలు పోతున్నా: వరంగల్ వాసి అవినాష్

బోటుపై నిలబడి ప్రాణాలు దక్కించుకొన్నా: వరంగల్ వాసి

బోటు మునక: ప్రమాదంలో చిక్కుకొన్న వరంగల్ వాసులు

బోటు మునక ఎఫెక్ట్: బోటు సర్వీసుల నిలిపివేయాలని సీఎం ఆదేశం

బోటు ప్రమాదంపై చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి

బోటు మునక: ఐదు మృతదేహాల వెలికితీత, కొనసాగుతున్న గాలింపు

పడవ ప్రమాదంపై స్పందించిన హోంమంత్రి సుచరిత

తూ.గో జిల్లాలో బోటు మునిగి 41 మంది ఆచూకీ గల్లంతు

పడవ బొల్తా: రంగంలోకి హెలికాఫ్టర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది

కచ్చలూరు: ఇదే చోట రెండు ప్రమాదాలు

బోటు మునక:సహాయక చర్యలకు సీఎం జగన్ ఆదేశం

PREV
click me!

Recommended Stories

Anam Rama Narayana Reddy:థ్యాంక్ యూ సార్.. పవన్ కళ్యాణ్ పై మంత్రి ఆనం ప్రశంసలు| Asianet News Telugu
Atchennaidu Appreciated Pawan Kalyan: ఇవి మినీ కలెక్టరేట్లలా పనిచేస్తాయి | Asianet News Telugu