అందం ఎరగా వేసి.. అమ్మాయిలకు వల.. నగ్న చిత్రాలు సేకరించి..

By telugu news teamFirst Published Aug 2, 2021, 7:42 AM IST
Highlights

ఆ తర్వాత చదువు మానేసి జల్సాలకు అలవాటు పడిపోయాడు. 2017లో గొలుసు చోరీలు, ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడటం మొదలుపెట్టాడు. జైలుకు కూడా వెళ్లాడు. కానీ బెయిల్ పై బయటకు వచ్చాడు.

అతను చాలా అందంగా ఉంటాడు. చూడగానే ఎవరైనా ఇట్టే ఆకర్షించపడతారు. అందుకే.. అతను తన సంపాదన పెంచుకోవడానికి తన అందాన్ని పెట్టుబడిగా పెట్టుకున్నాడు. తన అందమైన ముఖాన్ని ఎరగా వేసి .. అమ్మాయిలను వలలో వేసుకునేవాడు. ప్రేమిస్తున్నానంటూ సోషల్ మీడియాలో మెసేజ్ లుపెట్టేవాడు. వారిని నమ్మించి... వారి దగ్గర నుంచి నగ్న చిత్రాలను సేకరించేవాడు. ఆ తర్వాత తన వికృత రూపం బయటపెట్టేవాడు. వారిని ఆ ఫోటోలు చూపించి బ్లాక్ మెయిల్ చేసి.. డబ్బులు గుంజడం మొదలుపెట్టేవాడు. ఈ సంఘటన కడపలో చోటుచేసుకోగా.. తాజాగా ఈ మోసగాడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కడప జిల్లా పొద్దుటూరు కు చెందిన ప్రసన్నకుమార్ అలియాస్ ప్రశాంత్ రెడ్డి అలియాస్ రాజారెడ్డి అలియాస్ టోనీ... ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం మధ్యలోనే ఆపేశాడు. ఆ తర్వాత చదువు మానేసి జల్సాలకు అలవాటు పడిపోయాడు. 2017లో గొలుసు చోరీలు, ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడటం మొదలుపెట్టాడు. జైలుకు కూడా వెళ్లాడు. కానీ బెయిల్ పై బయటకు వచ్చాడు.

ఇతనికి షేర్ చాట్ ద్వారా శ్రీనివాస్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తన పేరు ప్రశాంత్ రెడ్డి అంటూ పరిచయం చేసుకొని.. హైదరాబాద్ సచివాలయంలో పనిచేస్తున్నానని.. అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని శ్రీనివాస్ కి ఆశచూపించాడు. తన తల్లి వైద్యం కోసం డబ్బులు కావాలంటూ అమాయకంగా నటించాడు. నిజమని నమ్మి.. ఎలాగూ తనకు ఉద్యోగం ఇప్పిస్తున్నాడు కదా అని.. శ్రీనివాస్ బంగారు గొలుసు ఇఛ్చాడు. 

ఆ తర్వాత ప్రశాంత్ రెడ్డి కనిపించకుండా పోయాడు. మోసపోయానని గుర్తించిన శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు దర్యాప్తులోనే ఉండగా.. తాజాగా ఓ చోరీ కేసులో నిందితుడు పోలీసులకు చిక్కాడు. పోలీసులు అతనిని అరెస్టు చేసి విచారించగా.. విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి.

కడప, విజయవాడ, హైదరాబాద్ తదితర నగరాల్లో ఫేస్ బుక్, షేర్ చాట్, ఇన్ స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా వెబ్ సైట్ల ద్వారా యువతులకు వల వేసేవాడని తెలిసింది. మాయమాటలతో వారిని ప్రేమలో కి దింపేవాడు. ఆ తర్వాత వారితో రొమాంటిక్ గా ఛాట్ చేసి వారి వద్ద ఫోటోలు సేకరించేవాడు. తర్వాత వాటినే చూపించి బెదిరించి.. బ్లాక్ మొయిల్ చేసి డబ్బులు గుంజేవాడని తెలిసింది. అతని ఫోన్ లో దాదాపు 200మంది అమ్మాయిల ఫోటోలు ఉండటం గమనార్హం. 

click me!