ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై  పీవీ రమేశ్ సంచలన ట్వీట్..?  వెనువెంటనే దిద్దుబాటు...

By Rajesh KarampooriFirst Published May 6, 2024, 7:36 PM IST
Highlights

Land Titling ACT: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. తాము అమలు చేసిన సంక్షేమ పథకాల ఫలితంగా మరోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటామని అధికార వైసీపీ దీమా వ్యక్తం చేస్తుంటే.. ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని ప్రతిపక్ష కూటమి ప్రయత్నిస్తుంది. ఈ తరుణంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరిట ప్రతిపక్ష టీడీపీ అబద్దపు ప్రచారం చేస్తుందని వైసీపీ ఆరోపిస్తుంది. ఇంతకీ అసలు కథేంటీ?  

Land Titling ACT: ఎన్నికల సమీపిస్తున్న కొద్ది ఆంధ్రప్రదేశ్లో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. ఇది ఏమైనా అధికారమే అంతిమ లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు  వ్యూహరచన చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎత్తుకు పై ఎత్తు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. తాము చేసిన సంక్షేమ ఫలితాలే మరోసారి అధికార పీఠాన్ని ఎక్కడానికి మార్గం సులభం చేస్తాయని వైసిపి నమ్ముతుంటే.. ఈ సారి ఎలాగైనా వైయస్ జగన్ గద్దె దింపి అధికార పీఠాన్ని అధిరోహించాలని ప్రతిపక్ష కూటమి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఈ తరుణంలో ల్యాండ్ టైటాలింగ్ యాక్ట్ పేరుతో అబద్ధపు ప్రచారానికి శ్రీకారం చుట్టింది ప్రతిపక్ష కూటమి. 

ఇంకా అమల్లోకి రాని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను అడ్డం పెట్టుకొని సీఎం జగన్ చరిష్మా పై దెబ్బ కొట్టాలని ప్రధానంగా టిడిపి విశ్వ ప్రయత్నాలు చేస్తోందనీ అధికార నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాష్ట్రంలో అమలు అయితే  తమ ఉనికి ప్రమాదమని భావించిన ప్రధాన ప్రతిపక్ష కూటమి అనుకూల మీడియా, సోషల్ మీడియా వేదికగా అబద్ధపు ప్రచారానికి తెర తీశాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.ప్రధానంగా భూ యజమానులకు రక్షణ కల్పించే ల్యాండ్‌ టైటిలింగ్ యాక్ట్‌ పేరిట అబద్దపు ప్రచారానికి తెర తీసిందని, దుష్ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని అధికార వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలో మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్...ప్రభుత్వంపై అబద్దపు ఆరోపణలు చేస్తూ అడ్డంగా బుక్కయ్యారు.

ఇంతకీ ఏం జరిగింది?

ఎన్నికల వేళ మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  అధికార పార్టీ వైఎస్సార్‌సిపి, ఇక అమల్లోకి రాని ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై విమర్శలు గుప్పిస్తూ  సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ ట్వీట్‌ చేశారు. అందులో తాను కూడా లాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌  బాధితుడినని ఆరోపణలు చేశారు. తన స్వగ్రామంలో ఉన్న భూమికి సంబంధించి మ్యుటేషన్ జరగలేదని వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతలోనే మళ్ళీ దాన్ని సరిదిద్దేసి ఇంకా ఆ ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమల్లోకి రాక ముందే ఇలా జరిగిందంటూ మరో రెండు పదాలు కలిపి మళ్ళీ పోస్ట్ చేశారు.

ఈ ట్వీట్ ను గమనించిన కొందరు దానికి సమాధానంగా అసలు అమల్లోకి రాని చట్టంతో నీకెలా అన్యాయం జరుగుతుందని అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నెటిజన్ల ప్రశ్నలకు సమాధానమివ్వలేక ఆయన సైలెంట్ అయ్యారు. ఈ క్రమంలో ఇంకా అమలులోకి రాని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను అడ్డుపెట్టుకుని సీఎం జగన్‌ను దెబ్బతీసేందుకు టీడీపీ శతవిధాలుగా ప్రయత్నిస్తోందని అధికార పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్ అమల్లోకి వస్తే.. తమ ఉనికే ప్రమాదమని ప్రతిపక్ష కూటమి భావిస్తున్నదనీ, అందుకే అధికార పార్టీ తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టారని పలువురు  విమర్శలు గుప్పిస్తున్నారు. పాపం టీడీపీ మాయలో రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి పీవీ రమేష్ అడ్డంగా బుక్కయ్యారని పలువురు నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా..  కృష్ణ జిల్లా విన్నకోట గ్రామంలో పీవీ రమేష్‌ కు వారసత్వంగా వచ్చిన భూమి సమస్యల్లో ఉందని, ఆ భూమికి సంబంధించిన వివాదం గత మూడేళ్లుగా కోర్టులో నడుస్తోన్నందని అధికారులు వివరణ ఇచ్చారు. ఆ భూమిలో పీవీ రమేష్ తో బాటు ఆయన సోదరులకు కూడా భాగం ఉందని, హైకోర్టులో WRIT PETITION No.31186 of 2022గా దాఖలైన పిటిషన్‌లో కోర్టు ఈ భూమిపై విచారణ జరపాలని కూడా ఆదేశించింది. అదే సమయంలో కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు మండలం విన్నకోట గ్రామంలోని  సర్వే నంబర్లు 61, 62, 66, 486/1, 487/1, 489/1 , 490/1 భూముల్లోని ప్రభుత్వ భూమిని, అలాగే కొన్ని అసైన్డ్‌ భూములను కబ్జా చేసి చేపల చెరువులు నిర్మించారని కోర్టు వెల్లడించింది.   2021లో రిట్‌ పిటిషన్‌ 10556 కింద దాఖలు కాగా..  అప్పట్లోనే కోర్టు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తుంది.  

మరోవైపు.. ఈ భూమి మ్యుటేషన్ కోసం వారు కూడా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు వివరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మ్యూటేషన్ కోసం పలు  పత్రాలు సమర్పించాల్సి ఉండగా రమేష్ అవేమి  చూపించకుండా దరఖాస్తు చేసారని..అందుకే ఆ ప్రక్రియ ముందుకు సాగలేదని తహసీల్దార్ తేల్చేసారు... దీంతో అనవసరంగా ఎల్లో మీడియా ట్రాప్ లో పడి పరువుపోగొట్టున్నారని ఆయన్ను నెటిజన్స్ విమర్శిస్తున్నారు. దీంతో ఉదయం 9.37కు ట్వీట్‌ చేసిన పీవీ రమేష్‌.. దాన్ని వెంటనే 10.23గంటలకు ఎడిట్‌ చేసినట్టు తెలుస్తోంది.  

click me!