బాలికపై అత్యాచారం: బెజవాడ కోర్టు సంచలన తీర్పు, నిందితుడికి 20 ఏళ్ల జైలు

By sivanagaprasad KodatiFirst Published Dec 2, 2019, 7:16 PM IST
Highlights

బాలికపై అత్యాచారం కేసులో విజయవాడ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. నిందితుడికి 20 కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. 

బాలికపై అత్యాచారం కేసులో విజయవాడ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. నిందితుడికి 20 కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. 2017లో విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఓ బాలికపై కృష్ణారావు అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.

Also Read:చిన్నారిపై అత్యాచారయత్నం: నిందితుడిని చితకబాది, నగ్నంగా ఊరేగించిన జనం

అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. నాటి నుంచి విచారణ జరుపుతున్న న్యాయస్థానం పోక్సో చట్టం కింద కృష్నారావుకి సోమవారం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 

దేశవ్యాప్తంగా దిశ అత్యాచారం, హత్యపై రగిలిపోతున్నప్పటికీ ఆడపిల్లలపై అత్యాచారాలు ఆగడం లేదు. రోడ్డుపైనే కాకుండా ఇంట్లోనూ మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. తాజాగా కన్నబిడ్డలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే కన్నకూతురుపై అత్యాచారం చేశాడు.

వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ జలోర్ జిల్లాలో ఓ వ్యక్తి తన 17 ఏళ్ల కూతురుతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతను తన భార్యపై వేధింపులకు పాల్పడటంతో ఏడేళ్ల క్రితమే భర్త నుంచి విడాకులు తీసుకుని మరో వివాహం చేసుకుంది.

ఈ క్రమంలో అతనికి వేరే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం కాస్తా కుమార్తె వరకు చేరడంతో ఆమె తండ్రిని నిలదీసింది... దీంతో ఆగ్రహానికి గురైన అతను ఆమెను చైన్లతో కట్టేసి బంధించాడు.

అంతేకాకుండా కన్న కూతురు అనే సంగతిని కూడా మరచిపోయి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం తండ్రి బారి నుంచి తప్పించుకున్న యువతి మేనమామ ఇంటికి చేరుకుంది.

Also Read:రేప్ చేశారని ఫిర్యాదు: పోలీసుల నిర్లక్ష్యం, ఉరేసుకున్న బాధితురాలు

ఆయన సహాయంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన తండ్రి మరో మహిళతో సన్నిహితంగా ఉంటోందని, అది తాను చూసినట్లు బాలిక పోలీసులకు తెలిపింది. దీనిపై తాను నిలదీసినప్పటి నుంచి వేధిస్తున్నాడని వాపోయింది. 

click me!