ఉమ్మడి మ్యానిఫెస్టోతో బీజేపీకి సంబంధం లేదా!? దూరం అందుకేనా?

By Rajesh KarampooriFirst Published May 2, 2024, 8:32 PM IST
Highlights

TDP Janasena BJP Manifesto: టీడీపీ - జనసేన - బీజేపీ సంకీర్ణ కూటమి మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో గందరగోళం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ వ్యాఖ్యలు చర్చనీయమయ్యాయి. 

TDP Janasena BJP Manifesto: టీడీపీ - జనసేన - బీజేపీ సంకీర్ణ కూటమి మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో గందరగోళం చోటు చేసుకుంది. ఈ మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ నాయకులు ఎవరూ హాజరుకాలేదు. చివరికి అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం హాజరు కాలేదు.రాష్ట్ర నాయకులు కాకుండా.. ఢిల్లీ నుంచి బీజేపీ నేత సిద్దార్థ నాథ్ సింగ్ నుంచి వచ్చారు.

అంతేకాకుండా.. ఆ మేనిఫెస్టో కాపీ కూడా చంద్రబాబు,పవన్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. కానీ, ఎక్కడా కూడా మోడీ ఫోటో లేదు. అలాగే.. మేనిఫేస్టో విడుదల సమయంలో ముగ్గురు నాయకులు నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చే ముందు  కాపీని చేత్తో పట్టుకోవడానికి కూడా బీజేపీ నేత సిద్దార్థ నాథ్ ఇష్టపడలేదు. ఈ పరిస్థితిని చూస్తే.. మేనిఫెస్టో తయారీలో బీజేపీ  పాత్ర లేదా? అనే చర్చ కూడా జరుగుతోంది.  

అనంతరం బీజేపీ నేత సిద్దార్థ నాథ్  మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకి జాతీయస్థాయిలో ప్రత్యేక మేనిఫెస్టో ఉందని, అదే రాష్ట్రంలోనూ ప్రచురించామన్నారు. ఇప్పుడు విడుదల చేసింది టీడీపీ, జనసేన మేనిఫెస్టో అని, వారి మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదని చెప్పారు. ఈ వ్యాఖ్యలు కూడా ప్రసుత్తం చేస్తున్నాయి.

అసలేం జరిగింది? 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2014 నేపథ్యంలో టీడీపీ-జనసేన- బీజేపీలు మూడు పార్టీలు పొత్తుతో ఎన్నికలకు వెళ్లాలి. ఈ సందర్బంగా చంద్రబాబు దాదాపు ఆరు వందల హామీలు ఇచ్చి.. ఆ తరువాత మాటతప్పి.. మేనిఫెస్టోను పార్టీ వెబ్ సైట్ నుంచి మాయం చేశారని అధికార వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో గత మ్యానిఫెస్టోను సీఎం వైయస్ జగన్ బయటకు తీసి, ఒక్కో హామీని ప్రజలకు గుర్తు చేస్తున్నారు. 

ఈ హామీలకు అప్పట్లో మోడీ గ్యారెంటీగా ఉంటే.. పవన్  గ్యారెంటీగా ఉన్నట్టు ఉందనీ, కేవలం వాళ్ళ ఫోటోలు మాత్రం ఉన్నాయనీ, మళ్ళీ అలాంటి వాళ్లకు ఓట్లేస్తారా? అంటూ అధికార పార్టీ ప్రశ్నిస్తుంది.  చంద్రబాబు  అమలుసాధ్యం కాని హామీలు ఇస్తుందని .  అందుకే మేనిఫెస్టోమీద కేవలం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే ఉన్నాయనీ విమర్శిస్తుంది అధికార వైసీపీ. చంద్రబాబు ఇస్తున్న హామీలకు బీజేపీకి ఎలాంటి బాధ్యత వహించలేదని చెప్పకనే చెప్పుతున్నట్టు తెలుస్తోంది. 
.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్ల విషయంలో కూడా చంద్రబాబు తమను మోసం చేసినట్లు కేంద్రం గుర్తించింది. పీవీఎన్ మాధవ్, జివిఎల్ నరసింహారావు... సోము వీర్రాజు వంటివాళ్లకు టిక్కెట్లు ఇవ్వకుండా కేవలం టీడీపీ నాయకులనే బీజేపీ నేతలుగా చూపించి టిక్కెట్లు ఇచ్చుకుని అసలైన బీజేపీ నేతలను మోసం చేసారని ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ బీజేపీ నేతలు  టీడీపీ మ్యానిఫెస్టోతో బీజేపీకి ఏం సంబంధం లేదననట్టు వ్యవస్తున్నట్టు టాక్. 

click me!