Search results - 385 Results
 • car Accident

  Telangana16, Jan 2019, 2:13 PM IST

  విజయవాడ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం...ముగ్గురు మృతి

  సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద విజయవాడ-హైదరాబాద్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో టైరు పేలడంతో అదుపుతప్పి ఇతర వాహనాలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా మరో బాలుడు కొర ఊపిరితో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

 • undefined

  Andhra Pradesh14, Jan 2019, 3:57 PM IST

  పవన్ వ్యాఖ్యలపై తలసాని స్పందన ఇదీ

  ఏపీ సీఎం చంద్రబాబుకు  రిటర్న్ గిఫ్ట్ కచ్చితంగా ఇస్తామని మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తలసాని శ్రీనివాస్ యాదవ్  స్పందించారు.

 • undefined

  Andhra Pradesh12, Jan 2019, 7:27 PM IST

  దమ్ముంటే బయటపెట్టు: పవన్ రాయబారం వ్యాఖ్యలపై వైసీపీ నేత

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత టీజేఆర్ సుధాకర్ నిప్పులు చెరిగారు. జనసేనతో పొత్తుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ నేతలను రాయబారానికి పంపుతున్నారన్న వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కు దమ్ముంటే తనతో మాట్లాడిన వారి పేర్లను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. 
   

 • Raghuveera reddy

  Andhra Pradesh12, Jan 2019, 5:43 PM IST

  స్వరం మార్చిన రఘువీరారెడ్డి: టీడీపీతో పొత్తు లేనట్టే

  ఏపీలో కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పొత్తు బెడిసికొట్టిందా...? కాంగ్రెస్ తో పొత్తు కేవలం తెలంగాణ, జాతీయ రాజకీయాల వరకు మాత్రమే పరిమితమా...?  ఏపీలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందా...? నిన్నటి వరకు టీడీపీని విమర్శించని కాంగ్రెస్ నేడు విమర్శించడం వెనుక ఆంతర్యం ఏంటి...? 
   

 • srinivasrao

  Andhra Pradesh12, Jan 2019, 5:09 PM IST

  జగన్ కేసులో ట్విస్ట్ : కోర్టుకెక్కిన శ్రీనివాస్ తరుపు న్యాయవాది

  వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హత్యాయత్నం కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. జగన్ పై దాడికేసులో విచారణ చేపడుతున్న ఎన్ఐఏ వ్యవహార శైలిపై నిందితుడు శ్రీనివాసరావు తరపు న్యాయవాది సలీం కంటెప్ట్ ఆఫ్ కోర్టు కింద సెషన్స్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. 
   

 • undefined

  Andhra Pradesh12, Jan 2019, 4:36 PM IST

  ఎన్నికలకు ముందే వైసీపీకి తొలి విజయం

  ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొలి విజయం దక్కిందని ఆ పార్టీ నేత సుధాకర్ బాబు స్పష్టం చేశారు. శనివారం విజయవాడలో వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న పింఛన్‌ పెంపు నిర్ణయం వైసీపీ విజయంగా భావిస్తున్నట్లు తెలిపారు. 

 • undefined

  Andhra Pradesh12, Jan 2019, 3:22 PM IST

  చంద్రబాబుది భయం, పవన్ కళ్యాణ్ ది ఉబలాటం: బొత్స

   ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తనదైన స్టైల్ లో విరుచుకుపడ్డారు. వైఎస్ జగన్ పై దాడికేసును హైకోర్టు, కేంద్రప్రభుత్వం ఎన్ఐఏకు ఆదేశించడంతో చంద్రబాబులో భయం పట్టుకుందని ఆరోపించారు. 

 • srinivasrao

  Andhra Pradesh12, Jan 2019, 3:07 PM IST

  జగన్ పై దాడికేసులో ఎన్ఐఏ దూకుడు: రహస్య ప్రదేశానికి శ్రీనివాస్

  ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ దూకుడు ప్రదర్శిస్తోంది. హైకోర్టు, కేంద్రప్రభుత్వం ఆదేశాలతో కేసు నమోదు చేసిన ఎన్ఐఏ కేసును విశాఖపట్నం మెట్రోపాలిటన్ కోర్టు నుంచి విజయవాడ ఎన్ఐఏ కోర్టుకు బదిలీ చేయించింది.
   

 • undefined

  Andhra Pradesh11, Jan 2019, 6:56 PM IST

  నీ సంగతి చూస్తా: చంద్రబాబుపై కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు

  ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని నిప్పులు చెరిగారు. కోడెల అసమర్థత స్పీకర్ అంటూ విరుచుకుపడ్డారు. చంద్రబాబు చెప్పినట్లు నడిచే సిగ్గుమాలిన వ్యక్తి స్పీకర్ గా ఉండటం మన దౌర్భాగ్యం అంటూ విరుచుకుపడ్డారు.  

 • undefined

  Andhra Pradesh11, Jan 2019, 6:28 PM IST

  ఎవరితోనైనా గొడవ పెట్టుకుంటా, చింతమనేనిని వదలను : పవన్ కళ్యాణ్

  దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ మరోసారి నిప్పులు చెరిగారు. చింతమనేనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చెయ్యాలని డిమాండ్ చేశారు. విజయవాడలో పశ్చిమగోదావరి జిల్లా నేతల సమావేశంలో చింతమనేని ఆగడాలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు దళిత నేతలు.

 • undefined

  Andhra Pradesh11, Jan 2019, 6:10 PM IST

  పోటుగాడిలా వెళ్లావ్, గుడ్డలూడదీసి పంపారు : చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్

  సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు సిగ్గు, శరం లేని నాయకుడని విమర్శించారు. విజయవాడ వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కొడాలి నాని చంద్రబాబు నాయుడు దొంగ ముఖ్యమంత్రి అంటూ తిట్టిపోశారు. 
   

 • jagan attack

  Andhra Pradesh11, Jan 2019, 5:54 PM IST

  జగన్ పై దాడి కేసు: ఎన్ఐఏ కస్టడీకి నిందితుడు శ్రీనివాస్

  ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావును ఎన్ఐఏ కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. నిందితుడు శ్రీనివాస్ ను వారం రోజులపాటు కస్టడీకీ అప్పగిస్తూ ఎన్ఐఏ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 

 • ka paul

  Andhra Pradesh11, Jan 2019, 1:25 PM IST

  జగన్ సీఎం కాలేడు, పవన్ సెట్ అవ్వడు : నేనే సీఎం అంటున్న కేఏ పాల్

  చంద్రబాబు నాయుడు మళ్లీ సీఎం అయ్యే ఛాన్స్ లేదు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సీఎం కాలేడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ అసలే ఉండదు. ఖచ్చితంగా నేనే సీఎం అవుతా అందులో ఎలాంటి సందేహం లేదు. నేను సీఎం అయితే చంద్రబాబును నా సలహాదారుగా పెట్టుకుంటా. 
   

 • undefined

  Andhra Pradesh11, Jan 2019, 1:03 PM IST

  పవన్ ను చంద్రబాబు బతిమిలాడుతున్నాడు: కొడాలి నాని

  తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని నిప్పులు చెరిగారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై తెలుగుదేశం పార్టీ పసలేని ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు.